AP P4 Policy Survey Form 2025, AP P4 Policy Feedback Form, P4 Participation Certificate, swarnandhra.ap.gov.in/p4, Inviting your valuable feedback on WITH (P4) PUBLIC-PRIVATE-PEOPLES PARTNERSHIP, DEVELOPMENT FOR EVERY HOME, PROGRESS FOR EVERY LIFE, Poverty Alleviation - Opinion Paper on the P4 Policy
Zero Poverty-P4 Policy: Empowering Communities, Building a Better Tomorrow
The Public, Private, People Participation(P4) initiative by the Government of Andhra Pradesh aims to mobilize prosperous families from the High Net-worth Individuals (HNIs) global Telugu community to handhold, support, and uplift the 20% most deprived households of the state. By creating structured pathways for mentorship, financial aid, and employment support, P4 fosters deep, meaningful engagements where well-off families take direct responsibility for guiding vulnerable families out of poverty and empowering them. This initiative goes beyond charity, emphasizing long-term empowerment and shared prosperity. With the government as an enabler, P4 envisions a self-sustaining model where communities actively support each other, ensuring a healthy, wealthy, and happy Andhra Pradesh.
Your feedback is crucial to ensure that this policy addresses real needs, strengthens partnerships, and delivers measurable outcomes. Together, we can build a Wealthy, Healthy and Happy Andhra Pradesh, thus making vision of Swarna Andhra 2047 a reality.
పేదరిక నిర్మూలన - P4 విధానంపై అభిప్రాయ సేకరణ పత్రం
సంఘాలకు సాధికారత కల్పించడం, మెరుగైన భవిష్యత్తు నిర్మించడం
ప్రభుత్వ, ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యం (P4) అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం ప్రవాస ఆంధ్రుల సంపన్న కుటుంబాలను రాష్ట్రంలోని అత్యంత వెనుకబడ్డ 20% కుటుంబాలకు సహాయం చేయడానికి, ప్రోత్సహించడానికి, మరియు ప్రగతి వైపు నడిపించేందుకు రూపొందించబడింది.
ఈ కార్యక్రమం ద్వారా వెనుకబడిన కుటుంబాలను ప్రత్యక్షంగా దత్తత తీసుకుని వారికి మార్గదర్శకత్వం, ఆర్థిక సహాయం, మరియు ఉద్యోగ అవకాశాలను కల్పించే మార్గాలను ఏర్పాటు చేసి వారిని పేదరికం నుండి బయటకు తీసుకురావడానికి కృషి చేస్తాయి.
P4 కేవలం దాతృత్వానికి పరిమితం కాకుండా, దీర్ఘకాలిక సాధికారత మరియు భాగస్వామ్య సంపన్నత అనే లక్ష్యాలను నెరవేర్చే విధంగా రూపుదిద్దుకుంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ఓ సమన్వయకర్తగా వ్యవహరించి, సమాజంలోని కుటుంబాలు ఒకరికొకరు సహాయం చేసుకునే విధంగా ఒక స్వయం-నిర్వహణ సామర్థ్యం కలిగిన వ్యవస్థను నిర్మించడానికి సహకరిస్తుంది.
ఈ విధానం ద్వారా, ప్రజల నిజమైన అవసరాలను తీర్చడం, భాగస్వామ్యాలను బలోపేతం చేయడం మరియు స్పష్టమైన ఫలితాలను సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నాము. మీ అభిప్రాయం ఇందులో కీలకమైన పాత్ర పోషిస్తుంది. " స్వర్ణ ఆంధ్ర@2047 " దార్శనికతను సాకారం చేసుకోవడానికి కలిసి పనిచేద్దాం మనం సమిష్టిగా సంపన్నమైన, ఆరోగ్యవంతమైన మరియు సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్‌ని సృష్టించగలమని విశ్వసిద్దాము.
- P4 సర్వేలో భాగంగా ఈ లింకు ద్వారా మీ అభిప్రాయాలను తెలియజేయవచ్చు.
- ప్రశ్నలన్నిటికీ ఆప్షన్ సెలెక్ట్ చేయడం మాత్రమే ఉంటుంది.
- కావున జిల్లాలోని ఉద్యోగులందరూ ఈ form ని త్వరగా submit చేయవలెను.
- పూర్తి చేసిన తర్వాత మీకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కూడా లభిస్తుంది. దయచేసి త్వరగా మీ పరిధిలోని ఉద్యోగులందరి చేత ఈ సర్వేను పూర్తి చేయించవలెను.
- పూర్తి చేసి సర్టిఫికెట్ పొందినవారు మీ CLUSTER/మండల గ్రూపులో సర్టిఫికెట్ పోస్ట్ చేయడం ద్వారా మీ మండలంలో అందరూ సర్వే పూర్తి చేసినట్లుగా నిర్ధారించుకొనగలరు.