TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Saturday, 15 February 2025

MJPAPBC Backlog Admission Notification 2025

MJPAPBC Backlog Admission Notification 2025 - Online Application, Admission Notice for the remaining vacancies in classes 6 to 9 for the academic year 2025-26


Mahatma Jyothibapule Andhra Pradesh Backward Classes Welfare Gurukul Vidyalaya Sansthan, Vijayawada, has invited applications from BC, SC, ST, and EBC students for the remaining vacancies in classes 6 to 9 for the academic year 2025-26. The entrance examination will be held on 28.04.2025 from 10:30 am to 12:30 pm in the designated MJP schools following the applications received across the state.


2025-26 విద్యా సంవత్సరం కి 6 నుండి 9వ తరగతులలో మిగిలిన ఖాళీలకు ప్రవేశ ప్రకటన


మహాత్మ జ్యోతిబాపూలే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బీసీ బాల బాలికల పాఠశాలలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 6 నుండి 9 తరగతులలో మిగిలి ఉన్న ఖాళీలను ఇంగ్లీష్ మీడియం స్టేట్ సిలబస్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మరియు ఈ బీసీ విద్యార్థుల నుండి ప్రవేశానికి దరఖాస్తులు కోరడమైనది. ప్రవేశ పరీక్ష జరుగు తేది 28.04.2025 ఉదయం 10:30 నుంచి 12:30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన  దరఖాస్తులను అనుసరించి నిర్దేశించిన ఎం జె పి పాఠశాలల్లో పరీక్ష నిర్వహించబడును.


పరీక్ష కొరకు అర్హత: 


ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరంలో చేరాలనుకునే తరగతికి ముందు ఉండే తరగతి 2024-25 విద్యా సంవత్సరంలో చదివి ఉండవలెను ఉదాహరణకు 2025-26 విద్యా సంవత్సరంలో ఏడవ తరగతి ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకునే విద్యార్థి 2024-25 విద్యా సంవత్సరంలో ఆరవ తరగతి చదివి ఉండవలెను.


ఆదాయ పరిమితి:


విద్యార్థుల తల్లిదండ్రుల సంరక్షకుల సంవత్సర ఆదాయం రూ.100000 మించి రాదు.

  • జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి ఆ జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ ఉండాలి.
  • విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో గత సంవత్సరం చదివి ఉండాలి.

ప్రవేశ పరీక్ష :


6 నుండి 9వ తరగతులలో ప్రవేశమునకు జరుగు ప్రవేశ పరీక్షలో తెలుగు, ఇంగ్లీష్, గణితం, సైన్స్ మరియు సాంఘిక శాస్త్రం సబ్జెక్టుల వారీగా 5 నుండి 8వ తరగతుల సిలబస్ ను దృష్టిలో ఉంచుకొని రెండు గంటల వ్యవధిలో వంద మార్కులకు (తెలుగు 20, ఇంగ్లీష్ 20, గణితం 20, సైన్స్ 20, మరియు సాంఘిక శాస్త్రం 20) మార్కులకు ఆబ్జెక్టివ్ టైపులో ఉంటుంది.

  • జవాబులను ఓఎంఆర్ షీట్ లో గుర్తించాలి.
  • పరీక్ష ప్రశ్నాపత్రం ఇంగ్లీషులో ఉంటుంది.

సిలబస్ - 

  • 6వ తరగతి ప్రవేశమునకు సంబంధించిన పరీక్షకు గాను ఐదవ తరగతి సిలబస్ నుండి తెలుగు (20), ఇంగ్లీష్ (20), లెక్కలు (20), ఇ.వీ.ఎస్ (40) మార్కులకు ఉంటుంది.
  • 7వ తరగతి ప్రవేశమునకు సంబంధించిన పరీక్షకు గాను ఆరవ తరగతి సిలబస్ నుండి తెలుగు (20), ఇంగ్లీష్ (20), లెక్కలు (20), సైన్స్ (20), సాంఘిక శాస్త్రం (20) మార్కులకు ఉంటుంది.
  • 8వ తరగతి ప్రవేశమునకు సంబంధించిన పరీక్షకు గాను ఏడవ తరగతి సిలబస్ నుండి తెలుగు (20), ఇంగ్లీష్ (20), లెక్కలు (20), సైన్స్ (20), సాంఘిక శాస్త్రం (20) మార్కులకు ఉంటుంది.
  • 9వ తరగతి ప్రవేశమునకు సంబంధించిన పరీక్షకు గాను 8వ తరగతి సిలబస్ నుండి తెలుగు (20), ఇంగ్లీష్ (20), లెక్కలు (20), సైన్స్ (20), సాంఘిక శాస్త్రం (20) మార్కులకు ఉంటుంది.

పరీక్షా కేంద్రం :


విద్యార్థిని విద్యార్థులకు వారి సొంత పాత జిల్లాలలో నిర్దేశించబడిన మహాత్మ జ్యోతిబాపూలే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాలలో పరీక్ష నిర్వహించబడును.

పాఠశాలల్లో ప్రవేశానికి ఎంపిక విధానం :


అర్హులైన విద్యార్థులకు ప్రవేశ పరీక్ష ద్వారా మిగిలి ఉన్న ఖాళీలకు ప్రతిభా, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరి, అనాథ, మత్స్యకార మరియు అభ్యర్థి కోరిన పాఠశాల ప్రాధాన్యతల ఆధారంగా ఎంపిక చేయబడును.

  • ఏదైనా రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థులు లేనియెడల అట్టి ఏదేని రిజర్వేషన్ ఖాళీలను బిసి కేటగిరి అభ్యర్ధులకు కేటాయిస్తారు.
  • ఎంపిక సమానమైన ర్యాంక్ ఒకరి కంటే ఎక్కువ మందికి వచ్చినప్పుడు పుట్టిన తేదీ ప్రకారం అధిక వయస్సు గల విద్యార్ధికి ప్రాధాన్యత ఇవ్వబడును. ఒకవేళ సమానమైన ర్యాంకు వస్తే లెక్కలలో పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. గణితంలో కూడా సమానమైన మార్కులు వస్తే సైన్స్ లో పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.
  • ఎంపికైన విద్యార్థులు ప్రవేశానికి అర్హులు కానిచో అట్టి ప్రవేశాన్ని నిరాకరించుటకు సంస్థకు అధికారం ఉంది.
  • ప్రవేశానికి ఎంపికైన అభ్యర్ధులకు మాత్రమే ప్రవేశ అనుమతి పత్రాలు కాల్ లెటర్స్ పంపబడును లేదా ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వబడును.
దరఖాస్తు చేయు విధానం :


అభ్యర్ధులు పై అర్హతలు పరిశీలించుకొని సంతృప్తి చెందిన తరువాత ఏదేని (Payment) ఏ.పి ఆన్ లైన్ కి ప్రాథమిక వివరాలతో (విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తండ్రి లేక సంరక్షకుని మొబైల్ నెంబరు) వెళ్లి రూ 100/- చెల్లించిన తరువాత ఒక జనరల్ నంబరు ఇవ్వబడుతుంది జనరల్ నెంబరు పొందినంతమాత్రాన దరఖాస్తు చేసుకున్నట్లు కాదు అది కేవలం దరఖాస్తు రుసుము చెల్లించినట్లు తెలియజేయు నంబర్ మాత్రమే.

  • ఆ జనరల్ నంబర్ ఆధారంగా ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ లేదా కంప్యూటర్ నుండి వెబ్ సైట్ https://mjpapbcwreis.apcfss.in/ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు  చేసుకోవాలి ఈ జనరల్ నెంబరును పరీక్ష ఫీజు చెల్లించిన వివరాలకు కేటాయించిన స్థలం నందు నమోదు చేయవలెను.
గడువు

  • ఆన్లైన్ దరఖాస్తును తేది 15.02.2025 నుండి తేది 15.03.2025 వరకు చేసుకోవచ్చును.
  • ఆన్లైన్ దరఖాస్తులు పంపిన తర్వాత ఒక రిఫరెన్స్ నంబరు ఇవ్వబడును నింపిన దరఖాస్తు నమూనా కాపీని ప్రింట్ తీసుకొని ఉంచుకోవాలి.
  • దరఖాస్తు చేయు సమయానికి అభ్యర్థి వద్ద కుల ధ్రువీకరణ, సమీకృత కుల జనన ఆదాయ ధ్రువ పత్రాలు, పుట్టిన తేదీ, ఆదాయ ధ్రువీకరణ, ప్రత్యేక కేటగిరీ ధ్రువీకరణ, స్టడీ మరియు బోనఫైడ్ సర్టిఫికెట్ మొదలగు ధ్రువపత్రాలు ఒరిజినల్ పొంది ఉండాలి ఒరిజినల్ ధ్రువపత్రాలను కౌన్సెలింగ్ సమయంలో సమర్పించాలి. లేని ఎడల విద్యార్ధి ఎంపిక కాబడిన సీటు ఇవ్వబడదు.
  • ఆన్లైన్లో కాక నేరుగా సంస్థకు గాని గురుకుల పాఠశాలకు గాని మరియు ఈమెయిల్ ద్వారా గాని పంపిన దరఖాస్తులను పరిశీలించరు అట్టి అభ్యర్థులను పరీక్షకు అనుమతించరు.
  • హాల్ టికెట్లు పోస్టులో గానీ నేరుగా గాని అభ్యర్థులకు పంపబడవు కేవలం ఇంటర్నెట్ ద్వారా మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి.
  • అర్హత లేని అభ్యర్థుల దరఖాస్తులు పరిశీలించబడవు.
ధరఖాస్తు నింపుటకు అభ్యర్ధులకు కొన్ని ముఖ్య సూచనలు :

  • ధరఖాస్తును ఆన్ లైన్ లో నింపడానికి ముందుగా నమూనా దరఖాస్తు నింపుకోవాలి.
  • పారీక్షా కేంద్రాన్ని వారి సొంత జిల్లాను మాత్రమే ఎంపిక చేయాలి.
  • కౌన్సిలింగ్ ద్వారా సీట్లు భర్తీ చేయబడతాయి.
  • పాస్ పోర్ట్ సైజు ఫోటోను సిద్ధంగా ఉంచుకోవాలి.
  • ధరఖాస్తులను నింపునప్పుడు అభ్యర్థి వివరాలను జాగ్రత్తగా నమోదు చేయవలెను.
  • సెల్ నెంబరు వ్రాయునప్పుడు విద్యార్థి కుటుంబమునకు సంబంధించిన నంబరు లేదా సమీప బంధువుల నంబరు ఇవ్వవలెను.
  • దరఖాస్తు నింపుటకు జరుగు పొరపాట్లకు అభ్యర్థియే పూర్తి బాధ్యత వహించాలి తదుపరి ఏ విధమైన మార్పులు చేయబడవు.
  • ఒకసారి దరఖాస్తును ఆన్ లైన్ లో అప్లోడ్ చేసిన తరువాత ఎలాంటి మార్పులకు తావులేదు కావున దరఖాస్తును అప్లోడ్ చేయుటకు ముందే అన్ని వివరాలు సరిచూసుకోవాలి.
  • ప్రవేశ పరీక్షకు హాజరయినంత మాత్రాన అడ్మిషన్ కి అర్హులు కాదు.
  • ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కేటాయించిన సీట్లలో రిజర్వేషన్ అమలు చేయబడును.
  • పట్టిక-1 లో చూపించిన విధంగా ఆయా జిల్లాల విద్యార్థిని విద్యార్థులు ఆయా పాఠశాలలలో ప్రవేశానికి అర్హులు ఒక పాఠశాల నుండి వేరొక పాఠశాలకు ఎట్టి పరిస్థితులలో అడ్మిషన్ బదిలీ చేయబడదు.
విద్యార్థులకు అందించే సదుపాయాలు :

  • ఉచిత వసతి మరియు గురుకుల విధానంలో చదువుకునే విద్యార్థులకు నెలకు రూ. 1400 తో పౌష్టిక విలువలతో కూడిన ఆహారం అందచేయబడును.
  • మూడు జతల యూనిఫారం దుస్తులు.
  • దుప్పటి మరియు జంఖానా
  • ఒక జత బూట్లు, సాక్స్
  • టై మరియు బెల్ట్ 
  • నోటు పుస్తకాలు టెక్స్ట్ పుస్తకాలు అందచేయబడును.
  • కాస్మోటిక్ చార్జిల నిమిత్తం బాలురకు నెలకు 125 రూపాయల చొప్పున (5, 6 తరగతులు), 7వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు బాలురకు 150 రూపాయలు బాలికలకు 6, 7వ తరగతుల వరకు చదువుతున్న పిల్లలకు నెలకు 130 చొప్పున మరియు 8వ తరగతి ఆ పై క్లాసుల పిల్లలకు నెలకు 250 రూపాయలు చొప్పున చెల్లించడం జరుగుతున్నది మరియు బాలురకు నెలకు 50 రూపాయలు చొప్పున సెలూన్ నిమిత్తం ఖర్చు చేయడం జరుగుతున్నది. 
  • సమీకృత పౌష్టిక ఆహారం క్రింద రోజు వేరుశనగ చిక్కి వారానికి ఆరు దినములు గుడ్లు రెండు సార్లు చికెన్ ఇవ్వబడును.

ఉల్లాసభరితమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం లో బోధన చేయబడుతుంది క్రీడలతో పాటు బోధనేతర కార్యక్రమాలలో కూడా శిక్షణ ఉంటుంది గ్రంథాలయాలు ప్రయోగశాలలు డిజిటల్ తరగతులతో విద్యాబోధన జరుగుతుంది. ధరఖాస్తును ఆన్ లైన్ లో https://mjpapbcwreis.apcfss.in/  వెబ్ సైట్ లో ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ నుండి దరఖాస్తు చేసుకోగలరు.


పూర్తి వివరాల కొరకు ఏదైనా మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయం నందు కానీ లేదా విజయవాడలో గల సంస్థ కార్యాలయం ప్లాట్ నెంబర్ 9, స్ట్రీట్ నెంబర్ 4, బండి స్టాండ్లీ స్ట్రీట్, ఉమాశంకర్ నగర్, కానూరు, విజయవాడ కార్యాలయంలో కార్యాలయ పని వేళల్లో స్వయంగా సంప్రదించగలరు.

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...