RTE Act Amendments 2024 Abolished the No-detention Policy. The central government has abolished the 'no detention policy'. There shall be regular examination in the fifth class and in the eighth class at the end of every academic year.
RTE Act Amendments 2024: Under the new rules, schools can hold year-end exams for classes 5 and 8. Students who fail will receive additional instruction and an opportunity to retake the exams after two months.
MINISTRY OF EDUCATION (Department of School Education and Literacy) NOTIFICATION New Delhi, the 16th December, 2024
G.S.R. 777(E). In exercise of the powers conferred by clause (fa) of sub-section (2) of section 38 of the Right of Children to Free and Compulsory Education Act, 2009 (35 of 2009), the Central Government hereby makes the following rules further to amend the Right of Children to Free and Compulsory Education Rules, 2010, namely:-
1. (1) These rules may be called the Right of Children to Free and Compulsory Education (Amendment) Rules, 2024.
(2) They shall come into force on the date of their publication in the Official Gazette.
2. In the Right of Children to Free and Compulsory Education Rules, 2010, after Part V, the following Part shall be inserted, namely: -
"PART VA EXAMINATION AND HOLDING BACK IN CERTAIN CASES
16A. Manner and conditions subject to which a child may be held hack (1) There shall be regular examination in the fifth class and in the eighth class at the end of every academic year.
(2) After the conduct of regular examination, referred to in sub rule (1), if a child fails to fulfil the promotion criteria, as notified from time to time, he shall be given additional instruction and opportunity for re- examination within a period of two months from the date of declaration of results.
(3) If the child appearing in the re examination referred in sub rule (2), fails to fulfil the promotion criteria again, he shall be held back in fifth class or eighth class, as the case may be.
(4) During the holding back of the child, the class teacher shall guide the child as well as the parents of the child, if necessary, and provide specialised inputs after identifying the learning gaps at various stages of assessment.
(5) The Head of the school shall maintain a list of children who are held back and personally monitor the provisions provided for specialised inputs to such children and their progress with respect to the identified learning gaps.
(6) The examination and re-examination shall be competency-hased examinations to achieve the holistic development of the child and not be based on memorisation and procedural skills.
(7) No child shall be expelled from any school till he completes elementary education.".
No-detention policy: 'నో డిటెన్షన్ విధానం' రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.
కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాలల్లో నో డిటెన్షన్ విధానాన్ని (No-detention policy) రద్దు చేసింది. దీంతో ఇకపై వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని 5, 8 తరగతుల విద్యార్థులు మళ్లీ అదే తరగతిలో చదవాల్సిఉంటుంది. విద్యాహక్కు చట్టం- 2019కు చేసిన సవరణ ప్రకారం దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలు (తెలుగు రాష్ట్రాలు మినహా), రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే ఈ రెండు తరగతులకు నో డిటెన్షన్ విధానాన్ని తొలగించాయని కేంద్రం పేర్కొంది.
గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. పరీక్షల్లో విద్యార్థి పైతరగతులకు ప్రమోట్ కావడంలో విఫలమైతే.. మళ్లీ పరీక్ష రాసేందుకు కొంత సమయం ఇస్తారు. ఫలితాల ప్రకటన తేదీకి రెండు నెలల్లోపే మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు. ఒకవేళ రీ-ఎగ్జామ్లోనూ ఫెయిల్ అయితే.. సదరు విద్యార్థులు మళ్లీ ఆయా తరగతుల్లోనే చదవాల్సి ఉంటుంది. ప్రాథమికోన్నత విద్య పూర్తయినంత వరకు ఏ విద్యార్థినీ బహిష్కరించరాదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని దాదాపు 3వేల కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాలలకు వర్తిస్తుందని కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
పాఠశాల విద్య రాష్ట్ర జాబితాలోని అంశం గనక ఈ విషయంలో ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పటికే 16 రాష్ట్రాలు, దిల్లీ సహా రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఈ రెండు తరగతుల విద్యార్థులకు నో డిటెన్షన్ పాలసీని రద్దు చేశాయని సదరు అధికారి పేర్కొన్నారు. హరియాణా, పుదుచ్చేరి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. మిగతా రాష్ట్రాలు మాత్రం ఈ విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు అధికారి తెలిపారు. నూతన విద్యా విధానంలో భాగంగా కేంద్రం డిటెన్షన్ విధానం (వార్షిక పరీక్షల్లో ఫెయిలైతే తిరిగి అదే తరగతిలో చదివేలా చేయడం) పై గతంలో రాష్ట్రాల నుంచి అభిప్రాయాలను కోరింది. ఇక మన తెలుగు రాష్ట్రాలలో 'నో డిటెన్షన్ విధానం' కొనసాగుతున్న విషయం తెలిసిందే.