TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Monday, 11 November 2024

AP Budget 2024-25 Key Highlights

AP Budget 2024-25 Key Highlights School Education Thalliki Vandanam


 రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్


ఏపీ అసెంబ్లీ సమావేశాలు శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్ (AP Budget)ను ప్రవేశపెట్టారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,94,427.25 కోట్లతో వార్షిక బడ్జెట్ను సభ ముందుకు తీసుకొచ్చారు.


బడ్జెట్లో రెవెన్యూ వ్యయం అంచనా రూ. 2,35,916.99 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ. 32,712.84 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు రూ. 34,743.38 కోట్లు, ద్రవ్య లోటు రూ. 68,742.65 కోట్లుగా పయ్యావుల తన బడ్జెట్ ప్రసంగం ద్వారా వెల్లడించారు. బడ్జెట్లో వివిధ కీలక రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు.


తల్లికి వందనం.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం


ఎన్ని సవాళ్లు ఎదురైనా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయకత్వంలో కృషి చేస్తామని మంత్రి పయ్యావుల పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా 'తల్లికి వందనం' పథకానికి నిధులు కేటాయిస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే 1-12వ తరగతి విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. పేదరికం కారణంగా ఏ ఒక్కరూ విద్యకు దూరం కాకూడదనేది తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆ తర్వాత వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభను ఎల్లుండికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు.


శాఖల వారీగా కేటాయింపులు ఇవీ:

  • పాఠశాల విద్య - రూ.29,909 కోట్లు
  • వ్యవసాయం, అనుబంధ రంగాలు రూ.11,855 కోట్లు
  • ఎస్సీ సంక్షేమం - రూ.18,497 కోట్లు
  • ఎస్టీ సంక్షేమం - రూ.7,557 కోట్లు
  • బీసీ సంక్షేమం - రూ.39,007కోట్లు
  • మైనార్టీల సంక్షేమం - రూ.4,376 కోట్లు
  • మహిళా శిశు సంక్షేమం - రూ.4,285 కోట్లు
  • మానవ వనరుల అభివృద్ధి - రూ.1,215 కోట్లు
  • ఉన్నత విద్య - రూ.2,326 కోట్లు
  • ఆరోగ్య రంగం - రూ.18,421 కోట్లు
  • పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధికి - రూ.16,739 కోట్లు
  • పట్టణాభివృద్ధి - రూ.11490 కోట్లు
  • గృహ నిర్మాణం - రూ.4,012 కోట్లు
  • జలవనరులు - రూ.16,705 కోట్లు
  • పరిశ్రమలు, వాణిజ్యం - రూ.3,127 కోట్లు
  • ఇంధన రంగం - రూ.8,207 కోట్లు
  • రవాణా, రోడ్లు, భవనాలు - రూ.9,554 కోట్లు
  • యువజన, పర్యాటక, సాంస్కృతికం - రూ.322 కోట్లు
  • పోలీస్ శాఖ రూ.8,495 కోట్లు
  • పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖ రూ.687 కోట్లు

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...