TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Wednesday 2 October 2024

APTET 2024 Awareness Videos Official

APTET 2024 Awareness Videos Official. 1A, 1B, 2A, 2B For the candidates who are going to write the TET Exam, AP CSE has prepared awareness videos related to the exam. Videos Explains TET Exam Pattern, Topics, Questions in the Previous Exam .

పత్రికా ప్రకటన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్య ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)- జూలై 2024 ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష జూలై-2024 అభ్యర్ధులకు సూచనలు

  • ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష 03-10-2024 నుండి 21-10-20-24 వరకు ప్రతిరోజు రెండు సెషన్లలో జరుగుతుంది.
  • మొదటి సెషన్ ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు జరుగుతుంది. రెండవ సిషన్ మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల వరకు జరుగుతుంది.
  • ఇంతవరకు హాల్టికెట్ లు డౌన్లోడ్ చేసుకొని అభ్యర్ధులు సత్వరమే తమ హాల్ టిక్కెట్లను http://cse.ap.gov.in వెబ్సైటు నుండి డౌన్ లోడ్ చేసుకోవాలి.
  • అభ్యర్థులను పరీక్షా సమయానికి ఒకటిన్నర గంటల ముందుగానే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 9 గంటల 30 నిమిషాల తర్వాత మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
  • ప్రతి జిల్లాలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సహాయ కేంద్రం ఏర్పాటు చేసి ఉన్నారు. అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా సహాయ కేంద్రానికి ఫోన్ సందేహాలు నివృత్తి కోవచ్చు..
  • పరీక్షా కేంద్రానికి అభ్యర్థి తప్పనిసరిగా తన గుర్తింపు కార్డును (ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ గుర్తింపు కార్డు మొదలైనవి) తీసుకొని వెళ్లవలెను.
  • దివ్యాంగ అభ్యర్థుల కొరకు జిల్లా విద్యాధికారి స్క్రైట్స్ ను ఏర్పాటు చేస్తారు. స్క్రైట్ కేటాయింపబడిన దివ్యాంగ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం 50 నిమిషాలు అదనపు పరీక్షా సమయం కేటాయించడం జరుగుతుంది.
  • అభ్యర్ది ఒకటి కన్నా ఎక్కువ హాల్ టికెట్లు పొంది ఉన్నట్లయితే ఏదో ఒక పరీక్షా కేంద్రంలో మాత్రమే పరీక్షకు హాజరు కావాలి.
  • నిబంధనలకు వ్యతిరేకంగా ఒక అభ్యర్థి స్థానంలో మరొకరు పరీక్షకు హాజరైనా, ఎటువంటి మాల్ Andhra Pradesh Public Examination (Prevention of Malpractices and Unfair means) Act, 1997 (No. 25 of1997) చర్యలు తీసుకోబడును.
  • సెల్ ఫోన్, ట్యాబు, లాప్టాప్, కాలికులేటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోని తీసుకు వెళ్ళరాదు.
  • హాల్ టికెట్ లో ఫోటో లేక పోయినా, సరిగా కనిపించకపోయినా, చిన్నసైజులో వున్నా అభ్యర్థి తన సరైన 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలను తీసుకువెళ్లి డిపార్మెంటల్ అధికారికి సమర్పించి అనుమతిపొందాలి.
  • అభ్యర్థులు తమ హాల్టికెట్లలో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే పరీక్షా కేంద్రంలో డిపార్ట్మెంటల్ అధికారి దగ్గర ఉన్న నామినల్ రోల్స్ లో సరిఅయిన ఆధారాలు చూపించి సరి చేయించుకోవచ్చు.
  • నామినల్ రోల్స్ లో ఇక్కడ పొందుపరచిన అంశాలను సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అభ్యర్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, సామాజిక వర్గం, జెండర్, ఎక్స్ సర్వీస్మెన్, ఫోటో అభ్యర్థి సంతకం మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు తదితర వివరాలు సరిచేసుకోవచ్చు.

APTET 2024 Awareness Videos click here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...