TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Friday 27 September 2024

AP DASARA Holidays October 2024 Revised

AP DASARA Holidays October 2024 Revised AP Schools Dasara Holidays 2024 Changed Dasara Holidays from 3rd to 13th October 2024 instead of 4th to 13th October 2024 Dasara holidays 2024 Andhra Pradesh Dussehra holidays in ap 2024 Telugu

  • అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. 
  • ఉపాధ్యాయులు, పలు సంఘాల విజ్ఞప్తితో ఒకరోజు ముందుగానే సెలవులు ఇస్తున్నామని, OCT 13 వరకు సెలవులు ఉంటాయన్నారు. 
  • పాఠశాల విద్యపై ఆయన సమీక్షించారు. 
  • నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని, 14న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. 
  • ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలని సూచించారు.

అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇస్తున్నట్లు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఉపాధ్యాయుల, సంఘాల కోరిక మేరకు దసరా సెలవులు అక్టోబర్ 3 నుండే ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టిసారించాలని పేర్కొన్నారు. పాఠశాల విద్య బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో మంత్రి లోకేష్ ఉండవల్లి నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ……. తొలుత పాఠశాలలను లీక్ ప్రూఫ్గా మార్చాలి, ప్రభుత్వ స్కూళ్లలో బెంచిలు ఏర్పాటు చేయాలి, మంచినీరు, టాయ్ లెట్స్ వంటివి పూర్తిస్థాయిలో కల్పించాలి, కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటుచేయాలి, అవసరాన్ని బట్టి అదనపు తరగతి గదులపై దృష్టిసారించాలని సూచించారు. పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేసి వాటి ద్వారా ఇంటర్నల్ అస్సెస్మెంట్ చేసే ప్రక్రియను అధ్యయనం చేయాలని ఆదేశించారు. తాను ఇటీవల ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన శ్రీకాకుళం మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాల, అకనంబట్టు హైస్కూళ్ల పనితీరు బాగుందని తెలిపారు.


నిన్న సందర్శించిన శ్రీకాకుళం మున్సిపల్ ఎలిమెంటరీ స్కూలులో విద్యార్థుల హ్యాండ్ రైటింగ్, పర్ఫార్మెన్స్ బాగున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా కాపీ బుక్స్, డ్రాయింగ్ బుక్స్ తో విద్యార్థుల హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ మెంట్ చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. శ్రీకాకుళం స్కూలులో కేవలం రూ.50వేలతో అక్కడి టీచర్లు తరగతి గదులను బాగుచేసుకున్నారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో నాడు- నేడు, కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా పెద్దఎత్తున డబ్బు ఖర్చుచేసినా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు ఎందుకు తగ్గిపోయారు, లోపం ఎక్కుడుందో తెలుసుకొని సరిదిద్దాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ స్కూళ్ల బలోపేతం, మెరుగైన ఫలితాల కోసం నవంబర్ 14న రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలు నిర్వహించి ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని తెలిపారు. ఇందులో ముఖ్యమంత్రి నుంచి వార్డు మెంబర్ వరకు అందరం భాగస్వాములం అవుతామని అన్నారు. స్కూళ్లలో ఫలితాల మెరుగుదలపై ప్రతి క్వార్టర్కు సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు గ్రంథాలయాల బలోపేతంపై చర్చించారు.

కొద్దిపాటి నిధులు వెచ్చిస్తే నిరుద్యోగ యువతకు ఇవి ఎంతగానో ఉపయోగ పడతాయని అన్నారు. త్వరలో అమరావతిలో అత్యాధునిక సదుపాయాలతో వరల్డ్ క్లాస్ సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా లెర్నింగ్ ఎక్సెలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (లిప్) ప్రోగ్రామ్ పై కెపిఎంజి ప్రతినిధులు నారాయణన్, సౌమ్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పాఠశాల విద్య రోడ్ మ్యాప్, 117 జీవో, ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు, టెట్, మెగా డీఎస్సీ నిర్వహణపై సమావేశంలో చర్చించడం జరిగింది. స్వర్ణాంధ్రలో భాగంగా స్కూల్ వారీగా విజన్ డాక్యుమెంట్ రూపకల్పన అంశంపైనా సమాలోచనలు జరిపారు. వరదలు కారణంగా ఉపాధ్యాయ దినోత్సవం జరపలేకపోయామని, నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ను ఘనంగా నిర్వహించి ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించాలని అధికారులను ఆదేశించారు. 


ఈ సమావేశంలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, కమిషనర్ విజయరామరాజు, సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.


https://whatsapp.com/channel/0029VaAJjT484Om98bZbbr3X

అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది!!

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...