TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Monday 19 August 2024

NIDHI Portal APGLI Online Services Problems - Solutions

NIDHI Portal APGLI Online Services Problems - Solutions Nidhi Portal సందలి APGLI online సేవలకు సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలు - పరిష్కారములు తెలియజేయుట

లేఖ నెం: 1469894/2/2024-25 తేది:09/08/2024


విషయము: బీమా నిర్దేశాలయము ఉపాధ్యాయ సంఘముల వారు Nidhi Portal సందలి online సేవలకు సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలు - పరిష్కారములు తెలియజేయుట- గురించి.


1. The State Teachers Union, Andhra Pradesh (STUAP) 8 : Lr 76./STUAP/2024 Dt:30-04-2024.

2. ప్రభుత్వ Spl. cheif Secretaryవారి నుండి  APTF, విజవాడ వారి లేఖ సంఖ్య; 210/APTF-1938/2024 Dt: 29-04-2024

3. APTF Vijayawada 5వారి లేఖ సంఖ్య: 27/2024, Dt:28-05-2024.

4. Bahujan Teachers' Association, Guntur 56 :28/2024/BTAAP తేది: 28-05-2024. 

5. ప్రభుత్వ జీవిత బీమా కార్యాలయము, ఏలూరు వారి లేఖ తేది: 25-05-2024.


పై విషయమును మరియు నిర్దేశములను పురస్కరించుకొని పైన తెలిపిన ఉపాధ్యాయ సంఘాల వారి లేఖల నందు తెలిపిన సమస్యలకు వివరములు ఈ క్రింది విధముగా తెలియజేయడమైనది.


1) Missing Credits వివరాలు online లో పొండుపరుచునపుడు "DIO Approver not found in the workflow" సమస్యను పరిష్కరించడమైనదని తెలియజేయడమైనది.


2) నామినీ వివరములను DDO స్థాయిలోని సరిదిద్దుకొనే అవకాశం ఒక నెలలో అందుబాటులోనికి రావడం జరుగుతుంది. 


3) గత సంవత్సర కాలంగా (జనవరి-2024 వరకు) పెంచిన ప్రీమియం మొత్తమునకు సరిపడా పాలసీ బాండ్లను ఉద్యోగులందరికీ స్పెషల్ డ్రైవ్ ద్వారా సంబంధిత APGLI కార్యాలయము వారు మంజూరు చేయుచున్నారు. స్పెషల్ డ్రైవ్ నందు పాలసీ బాండ్లు మంజూరు కానీ చందాదారులకు త్వరలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది.


4) చందాదారుని పాలసీ వివరములు Nidhi Portal నందు సరిగాలేని వారు సరైన పత్రాలతో మెయిల్ ద్వారా, తపాల ద్వారా లేదా ప్రత్యక్షముగా బీమా నిర్దేశాలయమునకు సమర్పించిన ఎడ్డల వాటిని సరిచేయుచున్నాము 


5) స్వచ్చంద పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుల పాలసీ వివరాలు నిధి పోర్టల్ నందు పొందుపరచడం జరిగినదని తెలియజేయడమైనది.


6) APGLI closer విషయములో E-sign లో OTP సమస్యను పరిష్కరించడమైనది.


7) VRS ఇచ్చిన వారు Surrender చేయు సమయంలో Closer date సమస్యను పరిష్కరించడమైనది.


8) Missing credits కు సంబంధించి token number /voucher number వివరములు  treasury వారి దగ్గర  అసంపూర్ణంగా ఉండుట వలన సస్పెన్స్ క్లియర్ చేయుటకు వీలుపడదు. కావున మిస్సింగ్ క్రెడిట్స్ వివరములను schedule కాపీ మరియు వోచర్ సంఖ్యతో తెలిపిన యెడల సరిచేయగలము.


9) Policy Data Certification తేదీని ప్రభుత్వము వారు మే-31 వరకు పొడిగించినందున మరలా దానిని పొడిగించుటకు వీలు పడదని తెలియచేయడమైనది.


Download APGLI Online Problems - Solutions

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...