AP SA 2 CBA 3 Guidelines 2024 to MEOs, Complex HMs, HMs, Teachers summative-assessment-2-s.a-2-cba-3-exams-guidelines-time-table-schedule-april-2024 Class Room Based Assessment 3/ Summative Assessment 2- Guidelines, Timetable and blueprint
AP SA 2 CBA 3 Guidelines 2024 to MEOs, Complex HMs, HMs, Teachers క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ 3 / సంగ్రహణాత్మక మదింపు-2 పరీక్షల నిర్వహణకు సూచనలు:
Syllabus for SA-II as informed by SCERT-AP is full syllabus (not semester wise) in all subjects of all classes.
1. జిల్లా లోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో (1 నుండి 9 వ తరగతి వరకు) మరియు ప్రవేట్ యాజమాన్య పాఠశాలలలో (6 నుండి 9 వ తరగతి వరకు) SCERT AP వారి ద్వారా జారీ చేయబడ్డ ప్రశ్నా పత్రాలతో మాత్రమే తేదీ 06.04.2024 నుండి 19.04.2024 SA-II పరీక్షలు నిర్వహించాలి.
2. 1వ తరగతి నుండి 8 తరగతి వరకు గల విద్యార్థులకు క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ (CBA-3) నిర్వహించడం. జరుగుతుంది. 9వ తరగతి విద్యార్థులకు, 10వ తరగతి మాదిరిగా SA-II పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.
3. క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ కు ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల విద్యార్థులకు ప్రశ్న పత్రంతో పాటు Variable OMR షీస్ఇవ్వడం జరుగుతుంది. (6,7, 8 తరగతులకు లాంగ్వేజ్ పరీక్షలకు ఒక OMR మరియు నాన్ లాంగ్వేజ్ పరీక్షలకు మరియొక OMR ఇవ్వబడతాయి). ప్రవేట్ యాజమాన్య పాఠశాలల విద్యార్థులకు కేవలం ప్రశ్నపత్రములు మాత్రమే ఇవ్వబడతాయి. OMRలు ఇవ్వబడవు.
4. ప్రశ్న పత్రంలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో పాటు డిస్క్రిప్టివ్ తరహా ప్రశ్నలు కూడా ఇవ్వబడతాయి. విద్యార్థులు అన్ని ప్రశ్నలకు జవాబులను ప్రశ్న పత్రం లో టిక్ చేయాలి, వ్రాయాలి మరియు MCQ ప్రశ్నలకు OMR నందు కూడా బబుల్ చేయాలి.
5. ప్రశ్న పత్రములో ప్రశ్నలు-మార్కుల క్రమము:
TOEFL.
1. TOEFL READINESS టెస్ట్ రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసి DCEB లకు అందచేసిన జాబితాలోని పాఠశాలల్లో 3, 4, 5 తరగతులకు ఏప్రిల్ 10వ తేదిన మరియు 6, 7, 8, 9 తరగతులకు ఏప్రిల్ 12 తేదిన నిర్వహించబడును.
2. జిల్లాల వారీగా పాఠశాలల వివరాలు, రోల్ వివరాలు ఇవ్వబడినవి.
3. DCEB లు పాఠశాలలో విద్యార్దుల వాస్తవ సంఖ్య ఆధారంగా ప్రశ్న పత్రాలు ఆయా పాఠశాలకు అందించవలెను.
4. 3, 4, 5 తరగతులకు ఒక ప్రశ్న పత్రము , 6, 7, 8, 9 తరగతులకు మరొక ప్రశ్న పత్రము ఇవ్వబడును.
5. రీడింగ్, లిసనింగ్ విభాగాలలో ప్రశ్నలు ఉండును.
6. ప్రీ ప్రింటెడ్ OMR పై విద్యార్ధులు తమ సమాధానాలను బబుల్ చేయవలెను (CBA లలో మాదిరిగానే )
7. లిసనింగ్ కి ఆడియో క్లిప్స్ IFP / SMART TV / టీచర్ ట్యాబ్స్ లలో రాష్ట్ర స్తాయి నుంచి IT సెల్ వారిచే పరీక్ష రోజు పంపబడును.
8. ఆయా పాఠశాలల్లో IFP / SMART TV / టీచర్ ట్యాబ్స్ కు ఏమైనా రిపేర్ ఉంటె ముందుగానే రిపేర్ చేయించుకొనవలెను.
9. DCEB లు DNO (IT) లు సమన్వయము తో వ్యవహరించవలెను.
10. పరీక్ష నిర్వహణకు TOEFL మాన్యువల్ లో సూచించిన రూమ్స్ అలోట్ మెంట్ సీటింగ్ అరేంజ్ మెంట్ విధానం పాటించాలి.
11. TOEFL మాన్యువల్ ప్రతి టీచర్ చదివేలా సాఫ్ట్ కాపీ షేర్ చేయవలెను. సంబందిత నిబంధనలు తప్పనిసరిగా పాటించవలెను.
12. ప్రశ్న పత్రాలు విద్యార్ధులకు తిరిగి ఇవ్వరాదు. USED/ UNUSED ప్రశ్న పత్రాలు తిరిగి పాఠశాలల నుంచి DCEB కి తెప్పించవలెను. తదుపరి సూచనల వరకు వాటిని సీల్ వేసి భద్రపరచవలెను.
13. OMR లు CBA తరహాలో ప్రత్యేకంగా ప్యాక్ చేసి DCEB కి తెప్పించి తదనంతరం స్కానర్ కి అందించవలెను.
14. OMR లో కుడి చేతి వైపు ఉన్న FORM CODE /SCHOOL USE ఓన్లీ అని ఉన్న బాక్స్ లో ఫిల్ చేయనవసరం లేదు.
15. ప్రీ ప్రింటెడ్ OMR రాని లేదా OMR పాడైన విద్యార్ధులకు బఫర్ OMR లలో NAME, UDISE CODE / STUDENT ID/ CLASS తదితర వివరాలు ఫిల్ చేయవలెను.
16. టీచర్ ATTENDANCE APP లో OMR స్కానింగ్ ఆప్షన్ ENABLE చేయబడుతుంది. దాని ద్వారా ONLINE ATTENDANCE కోసం OMR స్కాన్ చేయవలెను.
మండల విద్యాశాఖాధికారి చేయవలసిన పనులు:
పరీక్షలకు ముందు చేయవలసిన పనులు:
6. జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం నుండి ప్రశ్నపత్రాలను Variable OMRలను, Buffer OMRలను, పాఠశాల వారి విద్యార్థుల సంఖ్యలను తెలుపు లిస్టులను తీసుకొని సరి చూసుకొనవలెను. 1 నుండి 5 తరగతుల వరకు ప్రతి విద్యార్థికి ఒక OMR, 6 నుండి 8వ తరగతి వరకు ప్రతి విద్యార్థికి రెండు OMR లు ఇవ్వబడతాయి. ప్రశ్నపత్రాలను మండల విద్యాశాఖాధికారి మరియు ఒక సీనియర్ ప్రధానోపాధ్యాయుని సమక్షములో స్ట్రాంగ్ రూమ్ లో కానీ తాళముల వేసిన బాక్స్ లలో గాని భద్రపరచి వారి కస్టడీలో ఉంచుకొనవలెను,
7. ఇవ్వబడిన లిస్టు ప్రకారం పాఠశాల వారీ Variable OMR లను విభజించి పాఠశాల వారీ బాక్సులలో ఉంచి, పాఠశాలలకు 15.04.2023 తేదీ ఇవ్వవలెను. వారు పాఠశాలలోని అందరు విద్యార్థులకు Variable OMR లు సరి. పోయినవి/లేదు అని సరిచూసుకొన్న తరువాత అవసరమైన Buffer OMR లను 20.04.2023వ తేదీ ఇవ్వవలెను.
8. అట్లే 1 నుండి 5వ తరగతి వరకు ప్రశ్నపత్రాలను కాంప్లెక్స్ వారీగా విభజించుకొని, 19.04.2023వ తేదీ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ కు ఇచ్చి మరల వారు పరీక్ష రోజులలో వారి కాంప్లెక్స్ లోని పాఠశాలలకు రోజు వారి ఇవ్వవలసినట్లుగా తెలియ జేయవలెను.
పరీక్షల సమయంలో చేయవలసిన పనులు:
9. 6 నుండి 9వ తరగతి వరకు ప్రశ్నాపత్రాలను అన్ని పాఠశాలలకు MRC నుండి మాత్రమే ప్రతిరోజు టైం టేబుల్ అనుసరించి పరీక్షకు ఒక గంట ముందుగా ఇవ్వవలెను.
పరీక్షల అనంతరం చేయవలసిన పనులు:
10. పరీక్షల అనంతరం, అనగా 29.04.2023 తేదీ అన్ని పాఠశాలల నుండి OMR షీట్స్ పాకెట్స్ సేకరించి, కన్సాలిడేటెడ్ లిస్టు తయారు చేసి, స్కానింగ్ నిమిత్తమై 30.04.2023 తేదీ జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగము కార్యాలయానికి పంపాలి.
కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు చేయవలసిన పనులు:
11. కాంప్లెక్స్ హెడ్మాస్టర్ లు వారి కాంప్లెక్స్ కు సంబంధించిన అన్ని పాఠశాలల యొక్క తరగతి వారి విద్యార్థుల సంఖ్య లతో కూడిన లిస్టులను, 1 నుండి 5వ తరగతి వరకు ప్రశ్నపత్రాలను MRC నుండి CRP ద్వారా 19.04.2023వ తేదీ తెప్పించుకొని తమ కస్టడీలో ఉంచుకొనవలెను.
12. ప్రతి పరీక్ష రోజు పాఠశాలకు కేటాయించబడిన ప్రశ్నపత్రాలను, పరీక్షకు గంట ముందు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు ఇవ్వవలెను.
పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సూచనలు:
పరీక్షలకు ముందు చేయవలసిన పనులు:
13. మొదటగా మీ పాఠశాలలోని విద్యార్థుల యొక్క తరగతి వారి లిస్టులను వారి child IDలతో తయారుచేసుకుని సిద్ధంగా ఉంచుకొనవలెను.
14. 19.03.2023 వ తేదీ MRC నుండి మీ పాఠశాలకు సంబంధించిన Variable OMRలను తీసుకొని సరిచూసుకొనవలెను. 1 నుండి 5 తరగతుల వరకు ప్రతి విద్యార్థికి ఒక OMR 6 నుండి 8వ తరగతి వరకు ప్రతి విద్యార్థికీ రెండు OMR లు లాంగ్వేజ్ పరీక్షలకు ఒక OMR, నాన్ లాంగ్వేజ్ పరీక్షలకు మరియొక OMR ఇవ్వబడతాయి, Variable OMRలు కేటాయించబడని విద్యార్థుల కొరకు Buffer OMR లను MRC వద్ద నుండి 20.03.2023 తేదీ తీసుకొని విద్యార్థుల పేరు, child ID లను రాసుకొని ఉపయోగించవలెను.
పరీక్షల సమయంలోచేయవలసిన పనులు:
15. 6 నుండి పదవ తరగతి విద్యార్థుల యొక్క ప్రశ్నాపత్రాలను ఏ రోజుకు ఆ రోజు MRC నుండి పరీక్షకు ఒక గంట ముందు తీసుకొని పాఠశాలకు రావలెను. 16. పరీక్షకు ముందువిద్యార్థులను క్రమంగా సరైన దూరములో కూర్చుండబెట్టి వారి వారిOMRలను వారికి అందజేయాలి. పేరు,child iDలు సరిపోయినవి / లేదు అని సరిచూసుకొనమని విద్యార్థులకు తెలియజేయాలి.
17. తరువాత ప్రశ్నపత్రాలను అందజేయాలి. CBA పరీక్షా పత్రంలో రెండు రకముల ప్రశ్నలు ఉంటాయి
- బహుళైచ్ఛిక ప్రశ్నలు (MCQS) - 2 నుండి 4 ఎంపికలు ఉంటాయి. వాటిలో ఒకటి మాత్రమే సరైన సమాధానం,సరియైన ఎంపికను ప్రశ్నపత్రం పై గుర్తించాలి మరియు OMRపై సరి అయిన వృత్తములో బబుల్ చేయాలి.
- ఎంపిక లేని ప్రశ్నలు (FRQS) - ఈ ప్రశ్నలకు జవాబులను ప్రశ్నపత్రం పైనేరాయాలి ( OMRలపై గుర్తించవలసిన అవసరం లేదు).
18. విద్యార్ధులు OMR లపై బహుళైచ్ఛిక ప్రశ్నలకు మాత్రమే జవాబులు గుర్తించాలని, ఎంపిక లేని ప్రశ్నలకు జవాబులను OMR పై రాయవలసిన అవసరం లేదని విద్యార్థులకు తెలియజేయాలి.
19. ఒకేOMR పై అన్ని సబ్జెకులకు సంబంధించిన బబుల్ ఉంటాయి కాబట్టి ఏ పరీక్షకు ఆసబ్జెక్టుకు సంబంధించిన బబుల్స్ మాత్రమే విద్యార్థి నింపాలని తెలియజేయాలి, పర్యవేక్షించాలి.
20. ప్రతిరోజూ పరీక్ష పూర్తైన వెంటనే విద్యార్థుల నుండి జవాబులు వ్రాసిన ప్రశ్నపత్రంతో పాటు OMR షీట్ వెనుకకు తీసుకోవాలి. కూడా
21. ప్రతి విద్యార్థి యొక్క OMR ను పరిశీలించి, విద్యార్థి ఏదైనా ప్రశ్నకు ఎంపికను గుర్తించనిచో ఆ ప్రశ్నకు ఉపాధ్యాయుడు E అనే ఎంపికను bubble చేయాలి.
22. 1 నుండి 5 తరగతుల వరకు ఒక్కొక్క విద్యార్థికి అన్ని పరీక్షలకు కలిపి ఒకే OMR షీట్ 6 నుండి 8వ తరగతి వరకు ఒక్కొక్క విద్యార్థికి లాంగ్వేజ్ పరీక్షలకు ఒక OMR, నాన్ లాంగ్వేజ్ పరీక్షలకు మరియొక OMH ఇవ్వబడతాయి. కనుక ప్రతిరోజు అదే OMR ను ఇచ్చి ఆ సబ్జెక్టు నందు జవాబులను బబుల్ చేయించవలెను.
23. 1, 2, 3 తరగతుల పరీక్ష నిర్వహణలో సూచనలు: ఉపాధ్యాయుడు ప్రతి ప్రశ్నను గట్టిగా చదివి విద్యార్థులు ఆ ప్రశ్నకు జవాబును గుర్తించిన తర్వాత మరియొక ప్రశ్నను గట్టిగా చదువుతూ విద్యార్థుల చే జవాబులను. రాయించాలి. పరీక్ష అనంతరం విద్యార్థుల నుండి ప్రశ్నపత్రంలను సేకరించి వారి OMRలపై ఉపాధ్యాయుడే విద్యార్థి యొక్క జవాబులను బబుల్ చేయాలి.
24. 4, 5 తరగతుల పరీక్ష నిర్వహణలో సూచనలు: నిర్వహణలో సూచనలు: OMRలపై విద్యార్థులే జవాబులను గుర్తించాలి. తెలుగు ఇంగ్లీషు పరీక్షలలో ప్యాసేజీలను ఉపాధ్యాయుడు గట్టిగా చదివి వినిపించిన తరువాత విద్యార్థులు జవాబులను రాయాలని తెలియజేయాలి.
25. 6, 7, 8 తరగతుల పరీక్ష నిర్వహణలో సూచనలు: లాంగ్వేజ్ పరీక్షలకు ఒక OMR. నాన్ లాంగ్వేజ్ పరీక్షలకు మరియొక OMR ఇచ్చి పరీక్ష రాయించాలి. ప్రశ్న పత్రమును చదివి, అర్థం చేసుకొనుట మరియు జవాబులను గుర్తించుట/రాయుట పూర్తిగా విద్యార్థులే సొంతముగా చేయునట్లు పర్యవేక్షించాలి.
పరీక్షల అనంతరం చేయవలసిన పనులు:
26. పరీక్షలు అన్ని పూర్తైన వెంటనే OMR షీట్స్ అన్నింటిని తరగతి వారీగా OMR అకౌంటు షీట్లను తయారుచేసి, 1 నుండి 5 తరగతుల OMR షీట్స్ ఒక కవరు, 6 నుండి 8వ తరగతి వరకు లాంగ్వేజ్ OMR షీట్స్ ఒక కవరు, నాన్-లాంగ్వేజ్ OMR షీట్స్ ఒక కవరు నందు ప్యాక్ చేసి, అన్నింటిని BOX నందు ఉంచ, మండల విద్యాశాఖాధికారి వారి కార్యాలయానికి చివరి పరీక్ష రోజునే పంపాలి.
27. PACHA పరీక్షల తరం ప్రతి తరగతి (1 నుండి 8 తరగతులకు మాత్రమే), ప్రతి సబ్జెక్టు నకు KEY విడుదల చేయబడుతుంది. దాని ప్రకారం ఉపాధ్యాయులు విద్యార్థుల వద్ద నుండి ప్రతి రోజు పరీక్ష తదనంతరం వెనుకకు సేకరించిన జవాబులతో కూడిన ప్రశ్నా పత్రములలోని జవాబులను దిద్దాలి. విద్యార్థులు పొందిన మార్కులను సంబంధిత రిజిస్టర్లు నందు నమోదు చేయడంతో పాటు, నిర్ణీత సమయం లోపల CSE సైట్ నందు ఎంటర్ చేయాలి. జవాబులతో కూడిన ప్రశ్న పత్రాలను తనిఖీ అధికారుల పరిశీలనార్థం భద్రపరచాలి.
29. విద్యార్థులు పొందిన మార్కులను ప్రోగ్రెస్ కార్డులందు నమోదుచేసి విద్యార్థుల తల్లిదండ్రులకు పంపాలి, తక్కువ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమీక్షా సమావేశంలో SA-II నందు విద్యార్థులు చూసిన ప్రతిభపై చర్చించాలి.
30. ప్రాథమిక పాఠశాలలో పరీక్షలు 26.04.2023వ తేదీతో ముగుస్తాయి. కావున 27,04,2023వ తేదీ మూల్యాంక నము పూర్తి చేసి, ప్రమోషన్ లిస్టులను తయారు చేయాలి. 28.04.2023వ తేదీ తల్లిదండ్రుల సమావేశమును ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రగతిని తెలియజేయాలి. పాఠశాలలోని అందరు విద్యార్థుల యొక్క ప్రమోషన్ లిస్టు లను ప్రదర్శించాలి.
Download 2024 CBA 3 - SA2 Time Table
Download AP CBA 3 Blue Prints 2024