TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Friday, 1 March 2024

APRS 5th Class Admission Notification 2024, Online Application

APRS 5th Class Admission Notification 2024, Online Application aprs.apcfss.in APRS Fifth Application 2024 APRS CAT 2024 for 5th Class Admissions 2024-2025 Notification, Online Application APR Schools Admission 5th Class Application Andhra Pradesh Residential Educational Institutions Admissions 2024-25 AP Residential Schools 5th Class Admissions 2024-25 -Notification-Schedule-Fee Payment-Online Application Admissions into 5th Class / Class V in Andhra Pradesh Residential Schools for the Academic Year 2024-25


APRS 5th Class Admission Notification 2024, Online Application APRS CAT 2024 5th Class Admissions in AP Residential Schools for the academic year 2024-2025 through Common Admission Test


ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థలో 5వ తరగతి అడ్మిషన్లు ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో ప్రవేశ పరీక్ష ద్వారా  విద్యా సంవత్సరానికి 5 వ తరగతి ప్రవేశము కొరకు సమాచారము..


ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయముల సంస్థ నిర్వహించబడుచున్న పాఠశాలల్లో 5,6,7,8 తరగతులకు, జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ కు మరియు డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం డిగ్రీ లో 2024-25 విద్యా సంవత్సరం. ప్రవేశానికి నిర్వహించబడు APRS CAT-2023, APRJC & DC CET 2023 యొక్క దరఖాస్తుల స్వీకరణ  తేదీ 01-03-2024 నుండి 10-04-2024 తేదీ వరకు. ఆన్ లైన్ దరఖాస్తులను https://aprs.apcfss.in ద్వారా సమర్పించగలరు. తదుపరి గడువు పెంపునకు అవకాశం లేదని గమనించగలరు.


      ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థచే నడుపబడుచున్న 38 సాధారణ మరియు 12 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో (రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గురుకుల బాలుర పాఠశాలలు తాడికొండ గుంటూరు జిల్లా, కొడిగెనహళ్ళి అనంతపురం జిల్లాతో సహా) 2024-25 విద్యా సంవత్సరానికి గాను 5 వ తరగతి (ఇంగ్లీషు మీడియం) లో విద్యార్థులను ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేసి, ఎంపికైన వారికి పాఠశాల కేటాయింపు జరుగును.

        ప్రవేశానికి అర్హత:
          • వయస్సు: ఓ.సి మరియు బి.సి (O.C, B.C) లకు చెందినవారు 01.09.2013 నుండి 31.08.2015 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC,ST) లకు చెందినవారు 01.09.2011 నుండి 31.08.2015 మధ్య పుట్టి ఉండాలి.
          • సంబంధిత జిల్లాలో 2022 - 23 & 2023-24 విద్యాసంవత్సరాలలో నిరవధికంగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 3 మరియు 4 తరగతులు చదివి ఉండాలి.
          • O.C మరియు B.C విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలో మాత్రమే చదివి ఉండాలి. S.C, S.T. మరియు మైనారిటీ విద్యార్థులు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతంలో చదివినప్పటికీ జనరల్/మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హులు.
          ఆదాయ పరిమితి: 
          • అభ్యర్థి యొక్క తల్లి,తండ్రి/సంరక్షకుల సంవత్సరాదాయము (2023-24) రూ.1,00,000/- మించి ఉండరాదు లేదా తెల్లరేషన్ కార్డు కలిగిన వారు అర్హులు. సైనికోద్యోగుల పిల్లలకు ఈ నియమం వర్తించదు.
          • అభ్యర్థులు పై అర్హతలు పరిశీలించుకొని సంతృప్తి చెందిన తరువాత ఆన్ లైన్ ద్వారాదరఖాస్తు రుసుము రూ. 100/- లు చెల్లించి ప్రాధమిక వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చును.
          రిజర్వేషన్ శాతం (%):

          ఇ) సాధారణ పాఠశాలలు:

          1. ఓసి: 41%, బిసి-ఎ: 7%, బిసి-బి : 10%, బిసి-సి: 1%, బిసి-డి: 7%, బిసి- ఇ: 4% ఎస్.సి: 15% మరియు ఎస్.టి: 6%

          ii. ప్రత్యేక కేటగిరి రిజర్వేషన్: పి.హెచ్.సి: 3%, సి.ఎ.పి. (సైనికోద్యోగుల పిల్లలు): 3%, అనాథ: 3%.


          b) మైనారిటీ పాఠశాలలు:

          i) మైనారిటీలు: 79%, ఎస్. సి: 15% మరియు ఎస్.టి: 6% 

          గమనిక: రిజర్వేషన్ అమలు మరియు రిజర్వేషన్ లకు అనుగుణముగా సీట్ల కేటాయింపు ఎప్పటికప్పుడు జారీ చేయబడు ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణముగా సీట్ల కేటాయింపు ఎప్పటికప్పుడు జారీ చేయబడు ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణముగా ఉండును.

          దరఖాస్తు చేసుకొనుటకు మార్గదర్శకాలు :

          a) జనరల్ పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేయగోరు అందరు అభ్యర్థులు మరియు మైనారిటీ పాఠశాలల్లో దరఖాస్తు చేయు యస్.సి & యస్.టి. తప్పక ఎ.పి.ఆర్.యస్. సెట్ వ్రాయవలెను.

          b) అభ్యర్థులు దరఖాస్తులను నింపుట కొరకు https://aprs.apcfss.in వెబ్ సైట్ ను దర్శించవలెను. 

          c) అభ్యర్థులు దరఖాస్తులను నింపుటకు ముందు వెబ్ సైట్ నందలి

          నియమావళిని జాగ్రత్తగా చదువుకొని తమ అర్హతల పట్ల సంతృప్తి చెందిన తరువాత మాత్రమే దరఖాస్తులను నింపవలెను.

          d) అభ్యర్థి అర్హత ప్రమాణాల గురించి సంతృప్తి చెందిన తర్వాత, రుసుము చెల్లింపు లింక్ని క్లిక్ చేయడం/తెరవడం ద్వారా రూ.100/- రుసుమును పేర్కొన్న వ్యవధిలో ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.

          e) ఆన్లైన్లో ఫీజు చెల్లింపు సమయంలో, అభ్యర్థి అవసరమైన ప్రాధమిక వివరాలను అనగా అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నంబర్ మొదలైనవి ఇవ్వవలెను.

          1) ఒక మొబైల్ నంబర్ను ఒక అప్లికేషన్ కోసం మాత్రమే ఉపయోగించవలెను. ఇవ్వబడిన మొబైల్ నెంబర్, OTP ద్వారా నిర్ధారించబడుతుంది.

          g) ఆన్లైన్లో ఫీజు చెల్లించిన తర్వాత, అభ్యర్థి ID జారీ చేయబడుతుంది. అభ్యర్థి ID జారీ చేయడం అంటే అభ్యర్థి ఆన్లైన్లో దరఖాస్తు సమర్పణను పూర్తి చేసినట్లు కాదు. ID. రుసుము రసీదుకి సంబంధించిన నిర్ధారణ మాత్రమే.

          h) ఆన్లైన్ దరఖాస్తును పూరించే ముందు అభ్యర్థి 3.5 X 4.5 సెంటీమీటర్ల పరిమాణంలో ఫోటో మరియు సంతకంతో సిద్ధంగా ఉండాలి. దరఖాస్తు ఫారమ్తో పాటు ఫోటో & సంతకాన్ని కలిపి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.

          i) ఆన్లైన్ దరఖాస్తును సమర్పించడానికి, అప్లికేషన్ ఫారమ్ లింక్పై క్లిక్ చేసి, అభ్యర్థి ID మరియు పుట్టిన తేదీతో లాగిన్ చేయవలెను. పిదప ఆన్లైన్ అప్లికేషన్ తెరవబడుతుంది.

          j) ఆన్లైన్ దరఖాస్తును పూరిస్తున్నప్పుడు, తరగతిని జాగ్రత్తగా ఎంచు కోవలెను. ఎంచుకున్న తరగతిని తర్వాత మార్చలేరు. 

          k) ఆన్లైన్ దరఖాస్తును సమర్పించేటప్పుడు ఎటువంటి ధృవపత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. కానీ, ఎంపికైన అభ్యర్థి అడ్మిషన్ సమయంలో దరఖాస్తులో అందించిన సమాచారానికి తగిన ఒరిజినల్ సర్టిఫికేట్లను సమర్పించగలగాలి.

          l) దరఖాస్తులో అభ్యర్థి తన కులం / కేటగిరిని తప్పుగా నమోదు చేసి, మరొక కేటగిరిలో ఎంపిక కాబడినచో ప్రవేశం ఇవ్వబడదు మరియు కులం / కేటగిరి మార్చబడదు.

          m) ఎలాంటి లోపాలు లేకుండా వివరాలను జాగ్రత్తగా పూరించాలి. ఏదైనా తప్పులు/తప్పుడు సమాచారం సమర్పించినట్లయితే, దరఖాస్తు / అడ్మిషన్ తిరస్కరణకు అభ్యర్థి పూర్తిగా బాధ్యత వహించవలసి వుంటుంది.

          n) ఆన్లైన్ దరఖాస్తును సమర్పించిన తర్వాత, అభ్యర్థి తదుపరి అవసరముల కోసం దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింట్ను తీసుకోవాలి.

          o) అడ్మిషన్ సమయంలో అవసరమైన పత్రాలను సమర్పించడంలో విఫలమైతే మరియు నిబంధనల ప్రకారం ఏదైనా కారణంతో అతను/ఆమె అనర్హులైతే అభ్యర్థి యొక్క దరఖాస్తు / అడ్మిషన్ ఎలాంటి నోటీసు లేకుండా తిరస్కరించబడుతుంది.

          హాల్ టిక్కెట్ల జారీ & పరీక్ష:

          a) అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను https://aprs.apcfss.in వెబ్ సైట్ నుండి "హాల్ టికెట్ డౌన్లోడ్" లింక్ని క్లిక్ చేసి, వారి అభ్యర్థి ID మరియు పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

          b) అభ్యర్థులు వెబ్సైట్ నుండి మాత్రమే హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవాలి. అభ్యర్థికి ముద్రించిన హాల్ టికెట్ జారీ చేయబడదు. 

          C) హాల్ టికెట్ లేకుండా పరీక్షకు హాజరయ్యేందుకు అభ్యర్థులెవరూ అనుమతించబడరు.

          d) అభ్యర్థులు హాల్ టిక్కెట్పై పేర్కొన్న తేదీ మరియు సమయానికి సూచించబడిన పరీక్ష కేంద్రంలో ప్రవేశ పరీక్ష కి హాజరు కావాలి.

          e) ప్రవేశ పరీక్ష 2 గంటల వ్యవధితో, 100 మార్కులకు బహుళైచ్ఛిక ప్రశ్నలతో నిర్వహించబడుతుంది.

          ఆయా తరగతుల పరీక్ష కొరకు ఇవ్వబడు ప్రశ్నల సబ్జెక్టులు, ప్రశ్నల సంఖ్య మరియు మార్కులు క్రింది విధముగా ఉండును.



          g) పరీక్ష ప్రశ్నాపత్రము 5 వ తరగతికి తెలుగు మరియు ఇంగ్లీషు మీడియంలలోనూ, ఉర్దూ మరియు ఇంగ్లీషు మీడియంలలో వుంటుంది. మిగిలిన తరగతులకు తెలుగు మరియు ఇంగ్లీషు మీడియంలలో మాత్రమే వుంటుంది.

          h) అభ్యర్థులు OMR షీట్ను బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో మాత్రమే బబుల్ చేయాలి మరియు జారీ చేసిన సూచనలను పాటించాలి. సూచనలకు వ్యతిరేక చర్యలు OMR షీట్ను రద్దు చేయుటకు దారిచేయును.

          i) ప్రవేశ పరీక్ష, 26 జిల్లా ప్రధాన కేంద్రములలో మాత్రమే నిర్దేశించబడిన పరీక్ష కేంద్రాలలో నిర్వహించబడును. 
          j) సంబంధిత జిల్లాలోని పరీక్షా కేంద్రానికి తగినంతమంది అభ్యర్థులు లేని యెడల ప్రక్క జిల్లాలోని పరీక్షా కేంద్రానికి కేటాయించ బడతారు.

          ముఖ్యమైన తేదీలు:

          a) ప్రెస్ నోటిఫికేషన్ తేదీ : 01-03-2024

          b) ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 01-03-2024

          c) ఆన్లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ : 10.04.2024

          d) హాల్ టిక్కెట్ల జారీ తేదీ : 17.04.2024

          e) పరీక్ష తేదీ: 25-04-2024 (10 AM to 12 NOON)

          f) ఫలితాల ప్రచురణ & మొదటి ఎంపిక జాబితా తేదీ : 14.05.2024

          g) రెండవ ఎంపిక జాబితా తేదీ : 21.05.2024

          h) మూడవ ఎంపిక జాబితా తేదీ : 28.05.2024

          APRS 5th Class Admissions 2024-25 Important Links:

          Notification, Prospectus click here
          Do you have any doubts? Join Our WhatsApp Group
          Hello, How can I help you? ...
          Click me to Join Group and chat...