AP School Assembly Daily News, Activates 04-09-2023 in Telugu, in English Today's Special, Daily International News, National News, State News, Sports News, District News School Assembly Dailly Proverb, Poem, School Assembly G. K Question.
AP School Assembly Daily News, Activates School Assembly 04-09-2023
నేటి అసెంబ్లీ Dt:04.09.2023
నేటి వార్తలు
నమస్కారం .
💥 నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ..చదువుతున్నది ___ , ___వ తరగతి
- సింగపూర్ అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి..చైనా సంతతి వ్యక్తులను చిత్తుగా ఓడించిన షణ్ముగరత్నం. గతంలోనూ భారత సంతతి వ్యక్తులదే ఘన రికార్డు ..
- మేం భారత్‌లో కలుస్తాం.. వీధుల్లోకి వచ్చి కదం తొక్కిన పాక్ ఆక్రమిత కశ్మీరీలు…
- సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్' ప్రపంచానికి మార్గదర్శి అని.. విద్య, వైద్యం, సామాజిక రంగాల్లో అద్భుత ఫలితాలు సాధించి,2047 నాటికి అభివృద్ధి భారత్ సాధిస్తామన్న ప్రధాని నరేంద్ర మోడీ..
- దేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ చీఫ్, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం న్యాయ శాఖ అధికారులతో సమావేశమయ్యారు.. .
- వన్ నేషన్-వన్ ఎలక్షన్ అంటే దేశ ఐక్యత, అన్ని రాష్ట్రాలపై దాడి చేసే ఆలోచన అని అన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ..
- మిషన్ సూర్య సక్సెస్,సత్తా చాటిన పీఎస్‌ఎల్‌వీ సీ57 ఉపగ్రహ వాహక నౌక..నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించిన ఆదిత్య-ఎల్1..
- ఆదిత్య ఎల్-1 ప్రయోగంపై ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ..
- నూతనంగా నిర్మించిన కచ్చపి ఆడిటోరియంను ఆదివారం ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి...
- . శ్రీకాకుళంలోని స్థానిక ప్రకాష్ నగర్ కాలనీలోని హుస్సేనీ మసీదు పునర్నిర్మాణ భవనం ఆదివారం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు ...
- ట్రవిస్ హెడ్ విధ్వంసం.. సఫారీలను ఊడ్చేసిన కంగారూలు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయి దక్షిణాఫ్రికా .. .
చరిత్రలో ఈ రోజు
1882 సంవత్సరంలో ఈ రోజున విద్యుత్ కాంతులు వెలిగిన మొట్టమొదటి జిల్లా న్యూయార్క్..
నేటి సూక్తి
మనసులో మాలిన్యం ఉన్నపుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం.. చేపలు రాత్రింబవళ్లు నీళ్లలోనే ఉన్నా వాటి వాసన పోదు కదా
ఆరోగ్య సూత్రం
పుచ్చు పళ్ళ మీద మర్రిపాలను చుక్కలుగా వేస్తే క్రిములు నశించి నొప్పి కూడా తగ్గుతుంది.
. జీకే ప్రశ్న⁉️*.
*Q)నల్ల బంగారం అని దేనిని అంటారు?
A) బొగ్గు
ఆణిముత్యం
చంపదగినయట్టి శత్రువు తనచేత
జిక్కెనేని కీడు సేయరాదు
పొసగ మేలు చేసి పొమ్మనుటె చాలు
విశ్వదాభిరామ! వినురవేమ!
భావం : చంపదగినట్టి శత్రువు తన చేతిలో చిక్కిననూ, అపకారము చేయక, దగిన ఉపకారమునే చేసి విడిచిపెట్టుట మంచిది.