APPOLYCET Seat Allotment 2023 Final Phase AP Polytechnic Common Entrance Test 2023- Download Allotment Orders APPOLYCET - 2023 Final Allotment List
The final phase of seats were allotted on September to the students registered for Polycet-2023 web options for filling up seats in polytechnics. The list of selected students can be checked college wise and branch wise on the official website. Diploma (Engineering, Non-Engineering Technology) seats in government and private polytechnic colleges are filled on the basis of polycet rank. The students who got the seats will have to report to the respective polytechnic colleges between September 4 to 7. From POLYCET, admissions will be provided in 84 government and 175 private polytechnic colleges of the state. 70,569 seats are available in 29 departments of these colleges.
ఏపీ పాలిసెట్-2023 ఫైనల్ విడత సీట్ల కేటాయింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పాలిటెక్నిక్లలో సీట్ల భర్తీకి ఉద్దేశించిన పాలిసెట్-2023 వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్న విద్యార్థులకు తుది విడత సీట్లను సెప్టెంబర్ 4న కేటాయించారు. అధికారిక వెబ్సైట్లో కాలేజీ, బ్రాంచీ వారీగా ఎంపికైన విద్యార్థుల జాబితా చూసుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలలోని డిప్లొమా (ఇంజినీరింగ్, నాన్- ఇంజినీరింగ్ టెక్నాలజీ) సీట్లను పాలిసెట్ ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 4 నుంచి 7 మధ్య సంబంధిత పాలిటెక్నిక్ కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. పాలిసెట్ ద్వారా రాష్ట్రంలోని 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కాలేజీల్లోని 29 విభాగాల్లో 70,569 సీట్లు అందుబాటులో ఉన్నాయి.