TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Saturday, 22 July 2023

CBA, TOEFL Instructions, Guidelines, Model OMR

CBA, TOEFL Instructions, Guidelines, Model OMR CBA OMR Model, Instructions, Guidelines for conducting CBA Class Room Based Assessment 2023 CBA -1 & TOEFL instructions to the teachers AP Classroom Based Assessment (CBA) for classes I to VIII, Formative assessment for classes IX & X How to conduct CBA and TOEFL 2023-2024 in school level for 1st class to 8th classes only


CBA, TOEFL Instructions, Guidelines, Model OMR Classroom Based Assessments ఉపాధ్యాయులకు సూచనలు:


పరీక్షలు నిర్వహించడానికి ముందుగా పాటించవలసిన సాధారణ సూచనలు:

(పరీక్ష నిర్వహించే ముందు ఈ క్రింది సూచనలను సరిగ్గా చదవండి.)


1. ప్రతి ఇద్దరు విద్యార్థుల మధ్య తగినంత దూరంతో విద్యార్థులందరూ సరిగ్గా కూర్చున్నట్లు నిర్ధారించుకోండి.

2. విద్యార్థులు తమ పెన్నులు/పెన్సిళ్లను బయటకు తీసి సిద్ధంగా ఉంచుకున్నారని నిర్ధారించుకోండి.

3. ప్రశ్నాపత్రాలను విద్యార్థులకు అందజేయండి.

4 ప్రశ్నాపత్రాలలో రెండు రకాల ప్రశ్నలు ఉంటాయి.

i) బహుళైచ్చి ప్రశ్నలు (MCQ)- బహుళైచ్ఛిక ప్రశ్నలకి 3 నుండి 4 ఎంపికలు ఇవ్వబడతాయి, వాటిలో ఒక ఎంపిక మాత్రమే సరైన సమాధానమౌతుంది.

ii) ఎంపికలు లేని ప్రశ్నలు (FR: Free Response) ఈ ప్రశ్నలకి ఎంపికలు ఉండవు. ఇటువంటి ప్రశ్నలకు మార్కులకు అనుగుణంగా సమాధానాలు వ్రాయవలసి ఉంటుంది.

5. CBA -1 ప్రశ్నల సంఖ్య మరియు మార్కుల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

CBA OMR Model, Instructions, Guidelines for conducting CBA

6. అన్ని పేపర్లకు పరీక్షా సమయం 1 గంట మాత్రమే

7. ప్రశ్నల సంఖ్య గురించి విద్యార్థులకు ముందుగా తెలియజేయండి. ప్రశ్నాపత్రంలో ఈ సమాచారం, పైన లేబుల్ లో ఇవ్వబడుతుంది.

8. సబ్జెక్టు వివరాలు, పరీక్ష ప్రారంభ సమయం మరియు ముగింపు సమయం బ్లాక్ బోర్డపై వ్రాయబడ్డాయని నిర్ధారించుకోండి.

9. ప్రతి పరీక్ష ముందు విద్యార్థికి OMR అందచేయవలసి ఉంటుంది. OMR పై ఇవ్వబడిన విద్యార్థి యొక్క అన్ని వివరాలు (విద్యార్థి ID,విద్యార్థి పేరు, UDISE కోడ్ మరియు తరగతి) సరిచూసుకొనవలెను.

10. 1వ తరగతి నుండి 5 వ తరగతుల వారికి ఇచ్చే OMR షీట్ 4 సబ్జెక్టులు (తెలుగు, ఇంగ్లీషు, గణితం, EVS) కలిగి ఉంటుంది. 

11. 1వ, 2వ తరగతులకు EVS పరీక్ష లేనందున వారి OMR లలో EVS నకు కేటాయించబడిన భాగంలో ఎటువంటి సమాధానాలు గుర్తించకుండా జాగ్రత్త వహించండి. 

12. 6 వ తరగతి నుండి 8 వ తరగతుల వారికి ఇచ్చే OMR షీట్ 6 సబ్జెక్టులు (ఇంగ్లీషు, తెలుగు, హిందీ, గణితం, విజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్త్రం) కలిగి ఉంటుంది.

13. 3 నుండి 9 తరగతుల వరకు ఇంగ్లీషు సబ్జెక్ట్ లో part B విభాగం క్రింద TOEFL టెస్ట్ నిర్వహించబడును. కావున 3 నుండి 8 తరగతుల విద్యార్థుల చేత ఇంగ్లీషు part B భాగంలో సంబంధిత సమాధానాలు గుర్తించునట్లుగా సరిచూసుకోవలెను. TOFEL పరీక్షకు సంబంధించిన సూచనలు విడిగా జత చేయబడ్డాయి.

14. సరైన OMR లేకపోయినా లేదా OMR లభించక పోయినా, మండల స్థాయిలో అందుబాటులో ఉన్న బఫర్ OMRని విద్యార్థికి అందజేయాలి. OMR షీటులో విద్యార్థుల వివరాలన్నీ మాన్యువల్ గా నమోదు చేయాలి.

15. విద్యార్థులు సమాధానాలను సంబంధిత సబ్జెక్టులకు కేటాయించిన భాగంలోనే గుర్తించేట్లుగా ఇన్విజిలేటర్లు జాగ్రత్త తీసుకొనవలెను.


16. అందించిన ఆన్లైన్ పోర్టల్ లో విద్యార్థుల హాజరు వివరాలను పూరించండి.

17. క్లాస్ట్రూమ్ బేస్డ్ అసెస్మెంట్ -1 పూర్తయిన తర్వాత ఆన్సర్ కీ విడుదల చేయబడుతుంది.

18. ప్రశ్నాపత్రాలపై టిక్ చేసిన సమాధానాల ఆధారంగా, పేపర్లు దిద్దబడుతాయి.


TOEFL (Test Of English as a Foreign Language) instructions:

  • Academic calendar లో TOEFL (Test Of English as a Foreign Language) instruction classes కు ఇచ్చిన schedule ప్రకారం SCERT వారితో తయారు చేయబడిన TOEFL day wise Practice Sheets మరియు Audio clippings State IT wing ద్వారా ఎక్కడ అయితే Smart TVS/ IFP devices ఉన్నాయో ఆ school కి సంబందించిన HMs కు_MOBILE DEVICE MANAGEMENT (MDM ) ద్వారా పుష్ చేయబడ్డాయి. 
  • Formative assessment 1 కి సంబందించిన TOEFL Exam జరిగి రోజున Question Paper మరియు Audio clippings protected mode & Smart TVs/ IFP devices & push చేయబడతాయి. School HMs వాటిని OTP ద్వారా మాత్రమే open చేసి వాడుకో వచ్చును.
  • సి.బి.ఏ.1 ఎగ్జామ్ వరకు ప్రాక్టీస్ కోసం మోడల్ పేపర్స్ మరియు ఆడియో క్లిప్స్ సంబంధిత Smart TV/IFP నందు మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా పోస్ట్ చేయడం జరిగింది. సంబంధిత ఉపాధ్యాయుడు కచ్చితంగా మంగళవారం, గురువారము శనివారములు ప్రాక్టీస్ చేయించవలెను. 

గమనిక:- English paper part B (TOEFL ) కి సంబంధించిన పరీక్ష కేవలం Smart TV/IFPs ఎక్కడైతే ఉన్నాయో..ఆ పాఠశాలలో మాత్రమే నిర్వహించబడును.


మండల విద్యాశాఖాధికారి చేయవలసిన పనులు, పరీక్షలకు ముందు చేయవలసిన పనులు

  • జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం నుండి ప్రశ్నా పత్రాలను Variable OMR లను, Buffer OMRలను, పాఠశాల వారి విద్యార్థుల సంఖ్యలను తెలుపు లిస్టు లను తీసుకొనిసరి చూసుకొనవలెను. ప్రశ్నాపత్రాలను మండల విద్యా శాఖాధికారి మరియు ఒక సీనియర్ ప్రధానోపాధ్యాయుని సమక్షములో స్ట్రాంగ్ రూమ్ లో కానీ తాళముల వేసిన బాక్స్ లలో గాని భద్రపరచి వారి కస్టడీలో ఉంచుకొనవలెను
  • ఇవ్వబడిన ప్రకారం పాఠశాల వారీ Variable OMR లను విభజించి పాఠశాల వారీ బాక్సులలోఉంచి, పాఠశాలకి ఒకటి చొప్పున కవర్ ఉంచి, పాఠశాలలకు 27.07.2023 తేదీ ఇవ్వవలెను. వారు పాఠశాలలోని అందరు విద్యార్థులకు Variable OMR లు సరి పోయినవి /లేదు అని సరిచూసుకొన్న తరువాత అవసరమైన Buffer OMR లను 01.08.2023 వ తేదీ ఇవ్వవలెను. 13, అట్లే 1 నుండి 5వ తరగతి వరకు ప్రశ్నాపత్రాలను కాంప్లెక్స్ వారీగా విభజించుకొని 27.07.2023 వ తేదీ కాంప్లె కీ
  • హెడ్మాస్టర్ కు ఇచ్చి మరల వారు పరీక్ష రోజులలో వారి కాంప్లెక్స్ లోని పాఠశాలలకు రోజువారి ఇవ్వవలసినట్లు గా తెలియజేయవలెను.

పరీక్షల సమయంలో చేయవలసిన పనులు

6 నుండి 10వ తరగతి వరకు ప్రశ్నాపత్రాలను అన్ని పాఠశాలలకు MRC నుండి మాత్రమే ప్రతిరోజు టైం టేబుల్ అనుసరించి పరీక్షకు ఒక గంట ముందుగా ఇవ్వవలెను.


పరీక్షల అనంతరం చేయవలసిన పనులు

పరీక్షల అనంతరం,అనగా 04.08. 2023 తేదీ అన్ని పాఠశాలల నుండి OMR షీట్స్ పాకెట్స్ సేకరించి, కన్సాలిడేటెడ్ లిస్టు తయారుచేసి స్కానింగ్ నిమిత్తమై 07.08.2023 తేదిజిల్లా ఉమ్మడి పరీక్షల విభాగముకార్యాలయానికి పంపాలి.


కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు చేయవలసిన పనులు

  • కాంప్లెక్స్ హెడ్మాస్టర్ లు వారి కాంప్లెక్స్ కు సంబంధించిన అన్ని పాఠశాలల యొక్క తరగతి వారి విద్యార్థుల సంఖ్య లతో కూడిన లిస్టులను 1 నుండి 5వ తరగతి వరకు ప్రశ్నాపత్రాలను MRC నుండి CRP ద్వారా 27.07 2023వ తేదీ తెప్పించుకొని తమ కస్టడీలో ఉంచుకొనవలెను.
  • ప్రతి పరీక్ష రోజు పాఠశాలకు కేటాయించబడిన ప్రశ్నా పత్రాలను పరీక్షకు గంట ముందు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు ఇవ్వవలెను.

పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు సూచనలు

పరీక్షలకు ముందు చేయవలసిన పనులు

  • మొదటగా మీ పాఠశాలలోని విద్యార్థుల యొక్క తరగతి వారి లిస్టులను వారిchild ID లతో తయారుచేసుకుని సిద్ధంగా ఉంచుకొనవలెను.
  • 27.07.2023 వ తేదీ MRC నుండి మీ పాఠశాలకు సంబంధించిన Variable OMRలను తీసుకొని సరి చూసుకొనవలెను. Variable OMRలు కేటాయించబడని విద్యార్థుల కొరకు Buffer OMR లను MRC వద్ద నుండి 01.08.2023 తేదీ తీసుకొని విద్యార్థుల పేరు child ID లను రాసుకొని సిద్దముగా ఉంచుకొనవలెను.

పరీక్షల సమయంలో చేయవలసిన పనులు 

  • 6 నుండి పదవ తరగతి విద్యార్థుల యొక్క ప్రశ్నా పత్రాలను ఏ రోజుకు ఆ రోజు MRC నుండి పరీక్షకు ఒక గంట ముందు తీసుకొని పాఠశాలకు రావలెను.
  • పరీక్షకు ముందు విద్యార్థులను క్రమంగా సరైన దూరములో కూర్చుండబెట్టి వారి వారిOMR లను వారికి అందజేయాలి, పేరు, child IDలు సరిపోయినవి/లేదు అని సరిచూసుకొనమని విద్యార్థులకు తెలియజేయాలి.
  • తరువాత ప్రశ్నాపత్రాలను అందజేయాలి. CBA పరీక్షా పత్రంలో రెండు రకముల ప్రశ్నలు ఉంటాయి.
  • బహుళైచ్ఛిక ప్రశ్నలు - 2 నుండి 4 ఎంపికలు ఉంటాయి వాటిలో ఒకటి మాత్రమే సరైన సమాధానం. సరియైన ఎంపికను ప్రశ్నాపత్రం పై గుర్తించాలి మరియు OMR పై సరి అయిన వృత్తములో బబుల్ చేయాలి.
  • ఎంపిక లేని ప్రశ్నలు ( స్వేచ్ఛ సమాధాన ప్రశ్నలు) - ఈ ప్రశ్నలకు జవాబులను ప్రశ్నాపత్రం OMR లపై పైనేరాయాలి గుర్తించవలసిన అవసరం లేదు).
  • విద్యార్థులు OMRలపై బహుళైచ్ఛిక ప్రశ్నలకు మాత్రమే జవాబులు గుర్తించాలని ఎంపిక లేని ప్రశ్నలకు జవాబులను OMR పై రాయవలసిన అవసరం లేదని విద్యార్థులకు తెలియజేయాలి
  • అన్ని తరగతుల వారికి ఏ సబ్జెక్ట్ పేపర్ కు అయినాపరీక్షా సమయం ఒక్క గంట మాత్రమే అనుమతించాలి. 
  • ఒకేOMR పై అన్ని సబ్జెక్టులకు సంబంధించిన బబుల్ ఉంటాయి కాబట్టి ఏ పరీక్షకు ఆసబ్జెక్టుకు సంబంధించిన బబుల్స్ మాత్రమే విద్యార్థి నింపాలని తెలియజేయాలి పర్యవేక్షించాలి.
  • ప్రతిరోజూ పరీక్ష పూర్తైన వెంటనే విద్యార్థుల నుండి ప్రశ్నా పత్రంతో పాటు OMR షీట్ కూడా వెనుకకు తీసుకోవాలి. 
  • ప్రతి విద్యార్ధి యొక్క OMR ను పరిశీలించి, విద్యార్థి ఏదైనా ప్రశ్నకు ఎంపికను గుర్తించనిచో ఆ ప్రశ్నకు ఉపాధ్యాయుడు E అనే ఎంపికను bubble చేయాలి.
  • ఒక్కొక్క విద్యార్ధికి అన్ని పరీక్షలకు కలిపి ఒకే OMR షీట్ ఇవ్వబడుతుంది. కనుక ప్రతిరోజు అదే OMR ను ఇచ్చి ఆ సబ్జెక్టు నందు జవాబులను బబుల్ చేయించవలెను 
  • 1,2, 3 తరగతుల పరీక్ష నిర్వహణలో సూచనలు: ఉపాధ్యాయుడు ప్రతి ప్రశ్నను గట్టిగా చదివి విద్యార్థులు ఆ  ప్రశ్నకు జవాటును గుర్తించిన తర్వాత మరియొక ప్రశ్నను గట్టిగా చదువుతూ విద్యార్థుల చేజవాబులను రాయించాలి. పరీక్ష అనంతరం విద్యార్థుల నుండి ప్రశ్నాపత్రం లను సేకరించి వారి OMR లపై ఉపాధ్యాయుడే విద్యార్థి యొక్క జవాబులను బబుల్ చేయాలి..
  • 4, 5 తరగతుల పరీక్ష నిర్వహణలో సూచనలు: OMRలపై విద్యార్థులే జవాబులను గుర్తించాలి తెలుగు ఇంగ్లీషు పరీక్షలలో ప్యాసేజ్లను ఉపాధ్యాయుడు గట్టిగా చదివి వినిపించిన తరువాత విద్యార్థులు జవాబులను రాయాలని తెలియజేయాలి. 

పరీక్షల అనంతరం చేయవలసిన పనులు.

  • పరీక్షలు అన్ని పూర్తైన వెంటనే OMR షీట్స్ అన్నింటినీ, తరగతి వారీగా ఉంచి, అన్నింటిని పాలిథిన్ కవర్ నందు, కార్డు బోర్డు బాక్స్ నందుప్యాక్ చేసి, మండల విద్యాశాఖాధికారి వారి కార్యాలయానికి 04.08.2023 తేదీ పంపాలి. 
  • OMR షీట్స్ ను జిల్లా స్థాయిలో స్కాన్ చేయించడం జరుగుతుంది OMR నందు విద్యార్థులు పొందిన మార్కుల వివరాలు పాఠశాలలకు తెలియజేయబడవు. అవి కేవలం విద్యార్థుల స్థాయిని అంచనావేసి భవిష్యత్తు లో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఇవ్వవలసిన శిక్షణా కార్యక్రమాల రూపకల్పనకు మాత్రమే వినియోగించడం జరుగుతుంది.
  • CBA పరీక్షల అనంతరం ప్రతి తరగతి (1 నుండి 8 తరగతులకు మాత్రమే), ప్రతి సబ్జెక్టు నకుKEY విడుదల చేయబడుతుంది. దాని ప్రకారం ఉపాధ్యాయులు విద్యార్థుల వద్ద నుండి ప్రతి రోజు పరీక్ష తదనంతరం వెనుకకు సేకరించిన జవాబులతో కూడిన ప్రశ్నా పత్రములలోని జవాబులను దిద్దా లి విద్యార్థులు పొందిన మార్కులను సంబంధిత రిజిస్టర్లు నందు నమోదు చేయడంతో పాటు నిర్ణీత సమయం లోపల CSE సైట్ నందు ఎంటర్ చేయాలి. జవాబులతో కూడిన ప్రశ్నా పత్రాలను తనిఖీ అధికారుల పరిశీలనార్థం భద్రపరచాలి.
  • విద్యార్థులు పొందిన మార్కులను ప్రోగ్రెస్ కార్డులందు నమోదుచేసి విద్యార్థుల తల్లిదండ్రులకు పంపాలి తక్కువ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ఉపాధ్యాయులు- తల్లిదండ్రుల సమీక్షా సమావేశంలో FA-I నందు విద్యార్ధులు చూపిన ప్రతిభపై చర్చించాలి.

Packaging Instructions

1. మండల స్థాయికి ఒక ప్యాకెట్ ద్వారా అన్ని పాఠశాలలు OMR లు చేరతాయి.

2. మండలం నుండి ప్రతి పాఠశాల HM కు సంబంధిత పాఠశాల OMRలు, ఒక ఖాళీ ప్యాకెట్ అందించబడుతుంది. 

3. మండల కేంద్రం నుండి OMRలు తీసుకునేటప్పుడు సంబంధిత U-DISEతో సరిచూసుకొని తీసుకొనవలెను.

4. 1,6 తరగతులకు బఫర్ OMRలు తగు సంఖ్యలో తీసుకోవలెను.

5. ఉపయోగించిన బఫర్ OMRల డేటాను ఆన్లైన్ అటెండెన్స్ ఆఫ్ లో నమోదు చేయవలెను.

6. అన్ని సబ్జెక్టుల అసెస్మెంట్ పూర్తయిన తర్వాత, ఉపయోగించిన OMR షీట్లు అదే ప్యాకెట్ లో తిరిగి మండల కార్యాలయంలో అందించవలసి ఉంటుంది.

7. మండల స్థాయిలో, అన్ని పాఠశాలల OMRలు ఒకే ప్యాకెట్లో ఉంచి జిల్లా కేంద్రాలకు పంపించాలి.

8. తరగతుల వారీగా, పాఠశాల వారీగా విడివిడి ప్యాకింగ్ చేయరాదు.





CBA, TOEFL Guidelines in Telugu Download
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...