Navodaya JNVST 6th Notification 2024, Apply Online Navodaya 6th Class Entrance Test JNVST 2024 Notification, Apply Online application form for class VI Jawahar Navodaya Vidyalaya Selection Test 2024 Navodaya 6th Class Entrance Test JNVST 2024 Notification, Schedule, Online Application form for class VI Jawahar Navodaya Vidyalaya Selection Test 2024.
Navodaya JNVST 6th Notification 2024, Apply Online Javahar Navodaya 6th Class Entrance Exam 2024 Notification Navodaya Admissions Online Application Released. Admission Notification to Class VI in Jawahar Navodaya Vidyalayas (2024-25).
Jawahar Navodaya Vidyalaya Selection Test - 2024 JNV Selection Test for admission to Class-VI in JNVs for the academic session 2024-25 will be held in On Saturday, the 4th November, 2023 at 11.30 A.M in First phase and On Saturday, the 20th January, 2024 at 11.30 A.M in Second phase for all Jawahar Navodaya Vidyalayas.
రాబోయే విద్యా సంవత్సరానికి (2024-25) జవహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల గడువు ఆగస్టు 10తో ముగియనున్న వేళ నవోదయ విద్యాలయ సమితి కీలక నిర్ణయం తీసుకుంది.
అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేందుకు గడువును మరో వారం రోజుల పాటు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆగస్టు 17వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకొనేందుకు అవకాశం ఏర్పడింది.
దేశ వ్యాప్తంగా 649 జేఎన్‌వీల్లో 6వ తరగతి సీట్ల భర్తీకి రెండు విడతల్లో ఎంపిక పరీక్ష(JNVST 2024) నిర్వహించాలని అధికారులు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నవంబర్ 4(శనివారం)న ఉదయం 11.30గంటలకు పర్వత ప్రాంత రాష్ట్రాల్లో; 2024 జనవరి 20 (శనివారం) తేదీన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈ ప్రవేశ పరీక్ష(Jawahar Navodaya Vidyalaya selection test) నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 649 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉండగా.. ఏపీలో 15, తెలంగాణలో 9 చొప్పున ఉన్నాయి.
Online applications are invited for admission to class VI in Jawahar Navodaya Vidyalayas through Selection Test for the session 2024-25.
Eligibility:Navodaya Vidyalaya Selection Test 2024 for Admission to Class - VI Important Dates:
Last Date to apply - 10-08-2023
Downloading of Admit Card - Will be Communicated Later.
Date of Exam - 04-11-2023 & 20-01-2024
Declaration of result - Will be Communicated Later.
- Candidates who are bonafide residents of the district and studying in class V in the academic session 2023-24 in Govt./ Govt. recognized school in the same district where JNV is functioning and to which they are seeking admission.
- Studied full academic session in each class and passed classes III & IV from Govt. / Govt. recognized school and born between 01.05.2012 to 30.04.2014 (Both the dates inclusive)
- At least 75% Seats in a district will be filled by candidates from rural areas.
- Reservation for SC, ST, OBC and Divyang candidates as per Govt. Norms.
- Minimum ¹/3 of the seats are reserved for girl students.
జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష 2024:
అర్హత: ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసి అయి ఉండాలి. విద్యార్థులు 2023-24 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతుండాలి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించారు. వారు 3, 4, 5 తరగతులు గ్రామీణ ప్రాంత పాఠశాలల్లోనే చదివి ఉండాలి. మిగిలిన 25 శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు.
వయసు: దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 01.05.2012 నుంచి 30.04.2014 మధ్యలో జన్మించిన వారై ఉండాలి.
ప్రవేశ పరీక్ష: జవహర్ నవోదయ ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది.
ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు (మెంటల్ ఎబిలిటీ, ఆరిథెమెటిక్, లాంగ్వేజ్) ఉంటాయి. మొత్తం 80 ప్రశ్నలు 100 మార్కులకు 2 గంటల సమయంలో ప్రవేశ పరీక్ష ఉంటుంది.
ఏపీలో తెలుగు / ఆంగ్లం / హిందీ/ మరాఠీ/ ఉర్దూ ఒరియా/ కన్నడ మాధ్యమంలో, తెలంగాణలో తెలుగు / ఆంగ్లం / హిందీ/ మరాఠీ/ ఉర్దూ/ కన్నడ మాధ్యమంలో ప్రవేశ పరీక్ష రాయవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో జేఎన్బీ అధికారిక వైబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు చేసుకొనేందుకు అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్లో అభ్యర్థి వివరాలను పేర్కొంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరించిన సర్టిఫికెట్ సాఫ్ట్ కాపీని అప్లోడ్ చేయడం తప్పనిసరిని. దీంతో పాటు అభ్యర్థి ఫొటో, అభ్యర్థి, తల్లిదండ్రుల సంతకాలు, ఆధార్ వివరాలు/ నివాస ధ్రువపత్రాల అవసరం ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు.
ముఖ్యమైన తేదీలు:
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-08-2023
- ప్రవేశ పరీక్ష తేదీ: - 4 నవంబర్ 2023 తేదీ మరియు 20 జనవరి 2024 తేదీ ఉదయం 11.30 గంటలకు సంబంధిత జిల్లాలో ఎంపిక చేసిన అన్ని కేంద్రాలలో నిర్వహిస్తారు.
- ఫలితాల వెల్లడి: 2024, జూన్
General Salient Features:
- Co-educational Residential School in every District.
- Separate Hostel for Boys & Girls
- Free Education, Board and Lodging
- Wide Cultural exchange through Migration Scheme
- Promotion of Sports & Games
- NCC, Scouts & Guides and NSS