APRS CAT 2023 Minority Schools 5th, 6th, 7th & 8th Admissions 2023-24 APRS (Minority) CAT - 2023 A.P. Residential Minority Schools Common Admission Test 2023 for Admissions into 5th, 6th, 7th & 8th Classes in A.P. Minority Residential Schools for the academic year 2023-24 APRS CAT 2023 Minority Application APR Minority Schools 5th, 6th, 7th & 8th Admissions 2023-24 Providing direct Admissions under Minority category into Classes 5th, 6th, 7th & 8th in all Minority APR Schools for the academic year 2023-24
APRS CAT 2023 Minority Schools 5th, 6th, 7th & 8th Admissions 2023-24 APRS Minority CAT 2023 5th Class Admissions in AP Minority Residential Schools for the academic year 2023-2024.
ఆంధ్రప్రదేశ్ మైనారిటీ గురుకుల విద్యాలయముల సంస్థ నిర్వహించబడుచున్న పాఠశాలల్లో 5,6,7,8 తరగతులకు 2023-24 విద్యా సంవత్సరం. ప్రవేశానికి నిర్వహించబడు APRS Minority CAT-2023 యొక్క దరఖాస్తుల స్వీకరణ తేదీ 15-05-2023 నుండి 30-06-2023 తేదీ వరకు
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థచే నడుపబడుచున్న 12 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను 5 వ తరగతి (ఇంగ్లీషు మీడియం) లో విద్యార్థులను ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేసి, ఎంపికైన వారికి పాఠశాల కేటాయింపు జరుగును.
ప్రవేశానికి అర్హత:
5 వ తరగతి ప్రవేశం కొరకుసంబంధిత జిల్లాలో 2021-22 & 2022-23 విద్యాసంవత్సరాలలో నిరవధికంగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 3 మరియు 4 తరగతులు చదివి ఉండాలి. O.C మరియు B.C విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలో మాత్రమే చదివి ఉండాలి. S.C, S.T. మరియు మైనారిటీ విద్యార్థులు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతంలో చదివినప్పటికీ జనరల్/మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హులు. ఓ.సి మరియు బి.సి (O.C, B.C) లకు చెందినవారు 01.09.2012 నుండి 31.08.2014 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC,ST) లకు చెందినవారు 01.09.2010 నుండి 31.08.2014 మధ్య పుట్టి ఉండాలి.
6 వ తరగతి ప్రవేశం కొరకు సంబంధిత పాత జిల్లాలోని మండలంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరంలో 5 వ తరగతి చదివి ఉండాలి. ఓ.సి. మరియు బి.సి.లకు చెందినవారు 01.09.2011 నుండి 31.08.2013 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC & ST లకు చెందినవారు 01.09.2009 నుండి 31.08.2013 మధ్య పుట్టి ఉండాలి.
7వ తరగతి ప్రవేశం కొరకు సంబంధిత పాత జిల్లాలోని మండలంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరంలో 6 వ తరగతి చదివి ఉండాలి. ఓ.సి. మరియు బి.సి.లకు చెందినవారు 01.09.2010 నుండి 31.08.2012 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC & ST) లకు చెందినవారు 01.09.2008 నుండి 31.08.2012 మధ్య పుట్టి ఉండాలి.
8వ తరగతి ప్రవేశం కొరకు సంబంధిత పాత జిల్లాలోని మండలంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరంలో 7 వ తరగతి చదివి ఉండాలి. ఓ.సి. మరియు బి.సి.లకు చెందినవారు 01.09.2009 నుండి 31.08.2011 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి.. మరియు ఎస్.టి (SC & ST) లకు చెందినవారు 01.09.2007 నుండి 31.08.2011 మధ్య పుట్టి ఉండాలి.
O.C మరియు B.C విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలో మాత్రమే చదివి ఉండాలి. S.C, S.T. మరియు మైనారిటీ విద్యార్థులు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతంలో చదివినప్పటికీ జనరల్/మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హులు.
ఆదాయ పరిమితి: - అభ్యర్థి యొక్క తల్లి,తండ్రి/సంరక్షకుల సంవత్సరాదాయము (2022-23) రూ.1,00,000/- మించి ఉండరాదు లేదా తెల్లరేషన్ కార్డు కలిగిన వారు అర్హులు. సైనికోద్యోగుల పిల్లలకు ఈ నియమం వర్తించదు.
- అభ్యర్థులు పై అర్హతలు పరిశీలించుకొని సంతృప్తి చెందిన తరువాత ఆన్ లైన్ ద్వారాదరఖాస్తు రుసుము రూ. 100/- లు చెల్లించి ప్రాధమిక వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చును.
రిజర్వేషన్ శాతం (%):
మైనారిటీ పాఠశాలలు:
i) మైనారిటీలు: 73%, పి. హెచ్. సి మైనారిటీ: 3%, అనాధ మైనారిటీ: 3%, ఎస్. సి: 15% మరియు ఎస్.టి: 6%
గమనిక: రిజర్వేషన్ అమలు మరియు రిజర్వేషన్ లకు అనుగుణముగా సీట్ల కేటాయింపు ఎప్పటికప్పుడు జారీ చేయబడు ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణముగా సీట్ల కేటాయింపు ఎప్పటికప్పుడు జారీ చేయబడు ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణముగా ఉండును.
SC & ST విద్యార్థినీ, విద్యార్థులు దరఖాస్తు చేసుకొనుటకు మార్గదర్శకాలు:
a) SC & ST విద్యార్థినీ, విద్యార్థులు మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశము కొరకు దరఖాస్తు చేయు విధానం మైనారిటీ విద్యార్థుల కంటే భిన్నంగా ఉంటుంది. వీరు ప్రవేశం కొరకు ప్రవేశ పరీక్ష తప్పనిసరిగా వ్రాయవలసి ఉంటుంది.
(b) కావున, SC & ST విద్యార్థిని విద్యార్థులు ప్రవేశము కొరకు వెబ్ సైట్ నందు ఉంచబడిన APRS CAT ప్రాస్పెక్టస్ ని చూడగలరు.
మైనారిటీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనుటకు మార్గదర్శకాలు:
ఎ) మైనారిటీ గురుకుల పాఠశాలల్లో చేరాలనుకునే మైనారిటీ అభ్యర్థులు అడ్మిషన్ల కోసం APRS CAT కి హాజరు కానవసరం లేదు.
b) అభ్యర్థులు https://aprs.apcfss.in వెబ్సైట్ను సందర్శించి, దరఖాస్తును మరియు ప్రాస్పెక్టస్ను డౌన్లోడ్ చేసుకొనవలెను.
c) అభ్యర్థి ప్రాస్పెక్టస్ ను జాగ్రత్తగా చదవవలెను మరియు అడ్మిషన్ కోసం అర్హత ప్రమాణాల గురించి సంతృప్తి చెందిన తర్వాత, అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్ మరియు మొబైల్ నంబర్ మొదలైన వాటితో అవసరమైన డేటాతో దరఖాస్తును పూరించవలెను.
d) అప్లికేషన్లో వినియోగములో ఉన్నమొబైల్ నెంబర్ను పేర్కొనవలెను.
e) దరఖాస్తును పూరిస్తున్నప్పుడు, తరగతిని జాగ్రత్తగా ఎంచుకోండి. అభ్యర్థి తరగతిని మార్చుకోవాలనుకుంటే తాజాగా దరఖాస్తు సమర్పించాలి. ఈ సందర్భంలో అతని/ఆమె మునుపటి దరఖాస్తులన్నీ రద్దు చేయబడినట్లు పరిగణించబడతాయి.
f) ఎలాంటి లోపాలు లేకుండా వివరాలను జాగ్రత్తగా పూరించవలెను. ఏదైనా తప్పుడు సమాచారం సమర్పించినట్లయితే, దరఖాస్తు / అడ్మిషన్ తిరస్కరణకు అభ్యర్థి పూర్తిగా బాధ్యత వహించవలసి ఉంటుంది.
g) దరఖాస్తు చేయడానికి/ దరఖాస్తును సమర్పించడానికి ఎటువంటి రుసుము లేదు.
h) అభ్యర్థి పూరించిన దరఖాస్తును సంబంధిత పాఠశాల ప్రిన్సిపాల్కు వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా నిర్దిష్ట వ్యవధిలో సమర్పించాలి.
i) దరఖాస్తును సమర్పించేటప్పుడు, దరఖాస్తులో అందించిన సమాచారం | ప్రకారం అవసరమైన ధృవపత్రాలు జతచేయవలెను.
j) నిబంధనల ప్రకారం ఏదైనా కారణం చేత అతను/ఆమె అనర్హులైతే లేదా సమయంలో అవసరమైన పత్రాలను సమర్పించడంలో విఫలమైతే అభ్యర్థి యొక్క దరఖాస్తు / అడ్మిషన్ తదుపరి నోటీసు లేకుండా తిరస్కరించబడుతుంది.
మైనారిటీ అభ్యర్థులకు అడ్మిషన్ల కోసం మార్గదర్శకాలు:
a) నిబంధనల ప్రకారం దరఖాస్తు సమర్పించిన వెంటనే దరఖాస్తు పరిశీలించి సంతృప్తి చెందిన పిమ్మట మొదట వచ్చిన వారికి మొదట కేటాయింపు. ప్రాతిపదికన సీట్లు కేటాయించబడును..
b) ఎంపికైన అభ్యర్థులు సూచించిన నిబంధనలను అనుసరించి వెంటనే సంబంధిత పాఠశాలలో చేరాలి. ఎంపికైన అభ్యర్థి అడ్మిషన్ సమయంలో అవసరమైన అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లను సమర్పించగలగాలి. లేనిచో, అభ్యర్థి ఎంపిక తిరస్కరించబడుతుంది..
c) ఏదైనా దరఖాస్తు నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలితే, ఏ దశలోనైనా అడ్మిషను రద్దు చేసే హక్కు ప్రిన్సిపాల్ కి ఉంది.
ముఖ్యమైన తేదీలు:
a) ప్రెస్ నోటిఫికేషన్ తేదీ: 04.04.2023
b) దరఖాస్తు ప్రారంభ తేదీ: 15.05.2023
c) దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: 30.06.2023
ముఖ్యమైన సమాచారం & సహాయం కొరకు ఫోన్ నంబర్లు:
a) ఈ ప్రాస్పెక్టస్లో పేర్కొన్న తేదీలు మరియు షెడ్యూల్ కాలానుగుణంగా జారీచేయబడిన మార్గదర్శకాల ప్రకారం మారవచ్చును. అందువల్ల అభ్యర్థులు సంబంధిత పాఠశాల ప్రిన్సిపాల్ ను ఎప్పటికప్పుడు సంప్రదించవలెను.
b) అభ్యర్థులు నవీకరించబడిన సమాచారం కోసం వెబ్సైట్ మరియు ప్రెస్ నోట్స్న కూడా గమనించాలని సూచించడమైనది. పై సూచనలను విస్కరించడం ద్వారా ఎవరైనా అభ్యర్థి తన అవకాశాన్ని కోల్పోయినట్లయితే, సొసైటీ బాధ్యత వహించదు.
c) అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే / ఏదైనా స్పష్టత అవసరమైతే ప్రాస్పెక్టస్ను జాగ్రత్తగా చదవండి. వెబ్సైట్ అందించిన సమాచారాన్ని గమనించండి. అవసరమైన సమాచారాన్ని పొందడానికి సంబంధిత ప్రిన్సిపాల్: ను సంప్రదించండి.
APRS CAT 2023 Minority Schools 5th, 6th, 7th & 8th Admissions 2023-24 Important Links: