1st Class Admissions in Schools Eligible Age Limit Age of admission for Grade-l to 6+ years Ministry of Education directs State/UT to align their age of admission for Grade-l to 6+ years
States/UTs also requested to initiate process of designing and running a two years Diploma in Preschool Education (DPSE) course
The National Education Policy 2020 recommends strengthening of learning of children at the foundational stage' as a national priority for the country. The foundational stage consists of 5 years of learning opportunities for all children (between 3 to 8 years) that includes 3 years of pre-school education and 2 years of early primary Grade-1 and Grade-II. The policy thus promotes seamless learning and development of children from pre-school to Grade- II. This can only be done by ensuring accessibility to three years of quality preschool education for all children studying in Anganwadis or Government/Government-aided, private and NGO run preschool centers. Besides, the most important factor at the foundational stage is the availability of qualified teachers who are specially trained in the age and developmentally appropriate curriculum and pedagogy. The National Curriculum Framework for Foundational Stace(NE-ES) has also been launched recently on 20.10.2022.
To fulfill this vision, the Department of School Education Eneracy. Ministry of Education through D.O. letter 22-7/2021-EE.19/IS.13 dated 09.02.2023, has reiterated directions to all the State Governments and UT administrations to align their age to admission with the policy and provide admission to Grade-1 at the age of 6+ years.
The States have also been advised to initiate the process of designing and running a two years Diploma in Preschool Education (DPSE) course in their State and UT. The course is expected to be designed by the State Council of Educational Research and Training (SCERT) and run/ implemented through District Institute of Education & Training (DIETs) under supervision and hold of SCERTS.
ఒకటో తరగతిలో చేర్చుకునే చిన్నారులకు ఆరేళ్లు ఉండాల్సిందే.. కేంద్రం కొత్త రూల్!
నూతన విద్యావిధానాన్ని అనుసరించి ఇకపై ఒకటో తరగతిలో ఆరేళ్లు నిండిన (64) పిల్లలకే -ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలను, కోరింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ మేరకు లేఖ రాసింది. "చిన్నారుల పునాది దశ విద్యాభ్యాసాన్ని బలోపేతం చేయడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ విద్యావిధానం- 2020 సిపార్సు చేసింది. పునాది దశలో విద్యార్థులకు అయిదేళ్లపాటు -అభ్యాస అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. అందులో 3 ఏళ్లు పాఠశాల ముందస్తు విద్య (ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్), 2 ఏళ్లు ప్రాథమిక విద్యలో తొలిదశ అయిన 1, 2వ తరగతులు ఉంటాయి. ప్రీ స్కూల్ నుంచి -2వ తరగతి వరకు పిల్లలకు ఎలాంటి అవాంతరాలు లేని అభ్యాస పద్ధతిని ప్రోత్సహించాలన్నది ఈ విధానం ముఖ్య ఉద్దేశం. అందువల్ల అంగన్వాడీలు, ప్రభుత్వ/ ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేటు, ఎన్బోవోలు నిర్వహించే ప్రీ స్కూల్ కేంద్రాల్లో మూడేళ్లపాటు పిల్లలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చినప్పుడే ఇది సాధ్యం. ఈ లక్ష్యం సాకారం కావాలంటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఒకటో తరగతిలోకి ఆరేళ్లు నిండిన విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పించాలి. ఇందుకు అనుగుణంగా ప్రవేశ ప్రక్రియ నిబంధనల్లో సవరణలు చేయాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో ప్రీ స్కూల్ విద్యార్థులకు తగిన విధంగా బోధించే టీచర్లను తయారుచేయడానికి వీలుగా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్లో రెండేళ్ల డిప్లొమా కోర్సును రూపొందించి, అమలుచేయాలి. ఈ కోర్సును స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) ద్వారా రూపొందించి, డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (డైట్) ద్వారా అమల్లో పెట్టాలి. ఈ కార్యక్రమాన్ని ఎస్సీఈఆర్టీ పర్యవేక్షణలో నిర్వహించాలి" అని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలకు సూచించింది.
పాఠశాలల్లో చిన్నారుల అడ్మిషన్లకు సంబంధించి కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఒకటో తరగతిలో చేర్చుకునే చిన్నారులకు కనీసం ఆరేళ్ల వయసు ఉండాలనే నిబంధనను పక్కాగా అమలు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. కనీసం ఆరేళ్ల ఉంటేనే ఒకటో తరగతిలో చేర్చుకోవాలని.. ఈ నిబంధన అమలయ్యేలా చూడాలని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉత్తర్వులు జారీ చేసింది. నూతన విద్యా విధానంలో ఈ మేరకు నిబంధన ఉన్న విషయాన్ని విద్యాశాఖ గుర్తు చేసింది.
ఆ నిబంధన ప్రకారం మూడేళ్ల నుంచి ఎనిమిదేళ్ల మధ్య ఉన్న పిల్లలకు ఫౌండేషన్ స్టేజ్లో భాగంగా విద్య నేర్పాల్సి ఉంటుందని కేంద్రం పేర్కొంది. ఇందులో మూడేళ్ల నుంచి ఐదేళ్ల మధ్య వయసు ఉన్న పిల్లలకు ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఆటపాటలతో చదువుపై ఆసక్తి కలిగించేలా ప్రీ-స్కూల్ విద్య ఉంటుందని కేంద్రం ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఆ తర్వాత ఒకటి, రెండో తరగతులు ఫౌండేషన్ దశలో ఉంటాయి. అయితే ఒకటో తరగతిలో చేరే ముందే.. చిన్నారులకు నాణ్యమైన ప్రీస్కూల్ విద్య అందేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్ర విద్యా శాఖ సీనియర్ అధికారి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న వయసు నిబంధనను నూతన విద్యా విధానానికి అనుగుణంగా మార్చుకోవాలని స్పష్టం చేశారు. దేశ విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేందుకు కేంద్రం నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది.
ఈ నూతన విద్యావిధానంలో బట్టి చదువులకు స్వస్తి పలికి సృజనాత్మకతకు పెద్ద పీట వేయడమే లక్ష్యంగా కేంద్రం ఈ విధానాన్ని రూపొందించింది. ప్రస్తుతం ఉన్న ప్రాథమిక ఉన్నత విద్య తీరుతెన్నులను మార్చేసింది. ఇప్పటివరకు విద్యా విధానం 10+2+3గా ఉండగా.. దాన్ని 5+3+3+4గా మార్చింది. ఆర్ట్స్, సైన్స్ విద్య మధ్య విభజనలు లేకుండా నచ్చిన సబ్జెక్టులు ఎంపిక చేసుకునే వెసులుబాటును కల్పించేలా నూతన విద్యా విధానాన్ని రూపొందించింది. . జాతీయ విద్యా విధానంలో భాగంగా పాఠశాలల్లోనూ ప్లేస్కూల్స్ ఏర్పాటు చేస్తామని కేంద్రం గతంలోనే ప్రకటించింది. సమగ్ర శిక్షా అభియాన్ 2.0 కింద ప్లేస్కూల్స్ ఏర్పాటు చేసి, అందుకోసం ఉపాధ్యాయులకు తగిన శిక్షణ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.