How to apply / register or renewal for NSP Scholarships NMMS Selected Students Registrations, Renewal in National Scholarship Portal Guidelines, User Manual How to apply / register or renewal for scholarships in National Scholarship Portal NSP Registration of NMMS Students in National Scholarship portal - Guidelines
ఫిబ్రవరి 2023 లో నేషనల్ మీన్స్ - కం - మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలో ఎంపిక అయిన విద్యార్థులు ఈ సంవత్సరం తప్పకుండా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ (NSP) నందు తమ వివరములను నమోదు చేసుకొనుటకు చివరి తేది 31.12.2023 మరియు స్కూలు లెవల్ లో ధ్రువీకరణకు చివరి తేది 15.01.2024 అని జాతీయ మానవ వనరుల శాఖ వారు తెలియజేసారు. లేని యెడల వారికి ఇక ఎప్పటికీ ఏ విధంగా కూడా స్కాలర్షిప్ మంజూరు కాబడదు.
మార్చి, 2022, ఫిభ్రవరి 2021 , నవంబరు 2019 , 2018 సంవత్సరములలో ఎంపిక కాబడి ప్రభుత్వ పాఠశాలలో / కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ సంవత్సరం తప్పకుండా రెన్యువల్ చేసుకొనవలెను. లేనియెడల స్కాలర్షిప్ మంజూరు కాబడదు.
కావున ఎంపిక అయిన ప్రతీ విద్యార్ధి ఎట్టి పరిస్థితులలోనూ పోర్టల్ నందు తమ వివరములను నమోదు చేసుకొని స్కాలర్షిప్ పొందగలరు.
ప్రభుత్వ పరీక్షల కార్యాలయం - పత్రికా ప్రకటన
ఫిబ్రవరి 2023 లో జరిగిన నేషనల్ మీన్స్- కం- మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలో ఎంపిక అయిన విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ నందు తమ వివరములు నమోదు చేసుకొనుటకు మరొక అవకాశంగా 31-12-2023 వరకు పొడిగించినారు. విద్యార్థి వివరములు ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా మెరిట్ కార్డ్ పైన ముద్రించిన విధంగానే ఆధార్ మరియు బ్యాంక్ పాస్ బుక్ లో ఉండేవిధంగా సరిచూసుకుని పోర్టల్ నందు తమ వివరములు ది. 31-12-2023 లోపు నమోదు చేసుకొనవలెను. విద్యార్థి వివరములను సంబంధిత స్కూల్ నోడల్ ఆఫీసర్ లెవెల్ లో ది. 15-01-2024 లోపు క్షుణ్ణం గా పరిశీలించి, స్కూల్ నోడల్ ఆఫీసర్ లాగిన్ (INO) ద్వారా ధృవీకరించవలెను.
ఈ సంవ్సరమం ప్రతి DNO (District Nodal Officer) మరియు INO (Institute Nodal Officer) & HOI (Head of Institution) & Biometric Authentication చేయించుకోవాలి అనే రూల్ పెట్టడం వల్ల మైనారిటీ స్కీమ్ కొరకు Biometric Authentication చేయించుకున్న పాఠశాలల వారు కాక మిగిలిన పాఠశాలల వారు తప్పకుండా Biometric Authentication చేయించుకొనవలెను. ఈ విషయమై పూర్తి వివరములు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయమునకు అతి త్వరలో పంపించడం జరుగుతుంది. కనుక ఇంకా Biometric Authentication చేయించుకొనని INO/HOIలు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయమును సంప్రదించవలెను. మెరిట్ కార్డ్ పైన ముద్రించిన విధంగానే ఆధార్ కార్డ్ పైన లేని విద్యార్ధులు వెంటనే ఆధార్ మరియు బ్యాంక్ పాస్ బుక్ లలో సరిచేయించుకొనవలెను. మెరిట్ కార్డ్ పైన ఉన్న వివరములే తప్పుగా ఉన్న యెడల వెంటనే సంబంధిత స్కూల్ వారు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో ఆధార్ Mismatch వివరములను ఇవ్వవలెను. విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు ఒక్క అక్షరం తేడా ఉన్నా కూడా Mismatch proforma (Excel) సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయములో ఇవ్వవలెను. అదేవిధంగా నవంబరు 2019, ఫిబ్రవరి 2021 మరియు మార్చి 2022 సంవత్సరములలో ఎంపిక కాబడి ప్రభుత్వ మరియు అయిడెడ్ పాఠశాలల్లో / కళాశాలల్లో చదువుచున్న విద్యార్థులు ఈ సంవత్సరం తప్పకుండా రెన్యువల్ చేసుకొనవలెను. గత సంవత్సరాలలో బ్యాంక్ పాస్ బుక్ ద్వారా నమోదు చేసుకున్న రెన్యువల్ విద్యార్థులు తప్పకుండా ఈ సంవత్సరం ఆధార్ వివరములు నమోదు చేయవలెను. ఆధార్ Mismatch ఉన్న వారు వారి అప్లికేషన్ లో ఉన్న face-auth ఆప్షన్ ద్వారా వారి అప్లికేషన్ సబ్మిట్ చేయవలెను. అలా కాని పక్షంలో ఆధార్ లో సరిచేయించుకొనవలెను. లేనియెడల స్కాలర్షిప్ మంజూరు కాబడదు. ఈ పధకం యొక్క విధి విధానాలు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ నందు పొందగలరు. విద్యా మంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ వారు నిర్దేశించిన గడువులోపు ఈ ప్రక్రియ పూర్తి చేయని విద్యార్థులకు స్కాలర్షిప్ మంజూరు కాబడదు, దానికి విద్యార్థి తల్లితండ్రులు మరియు సంబంధిత పాఠశాలవారే బాధ్యత వహించవలసి ఉంటుంది అని ప్రభుత్వ పరీక్షల కార్యాలయ సంచాలకులు శ్రీ డి. దేవానంద రెడ్డి గారు తెలియజేసారు.
Guidelines for Registration on National Scholarship Portal
Welcome to National Scholarship Portal (NSP)
- How to Apply?
Students applying for scholarship for the first time (Fresh Students) need to "Register" on the portal as fresh applicant by providing accurate and authenticated information as printed on their documents in the "Student Registration Form".
The registration form is required to be filled by parents / guardian of students who are below the age of 18 years on the date of registration.
Before initiating registration process, students / Parents / guardian are advised to keep the following documents handy:
- 1. Educational documents of student
- 2. Student's Bank account number and IFSC code of the bank branch
Note: For pre matric scholarship scheme, where students do not have their own bank account, parents can provide their own account details. However, parents account number can only be used against scholarship applications for maximum two children. - 3. Aadhaar number of the Student
- 4. If Aadhaar is not available, then Bonafide student certificate from Institute / School and
- 5. Aadhaar Enrolment ID and Scanned copy of Bank passbook
- 6. If Institute/School is different from domicile state of the applicant, then Bonafide student certificate from Institute / School.
Brief instructions for filling up the online Application Form are given below (Fields marked with * are Mandatory fields):
1. Date of Birth (DOB)* | Provide DOB as printed in educational certificates. |
2. State of Domicile* | Domicile state means the state in which students have their permanent address. Students are required to provide their domicile state correctly as the "Application Id" allotted to them will be based on domicile state. This application Id will also be used as "Login Id" on the portal and for future references.Once allotted the student will not be allowed to change the domicile State under any circumstances. The student needs to provide a Bonafide Certificate in the prescribed proforma if the Students domicile state is different from the state of Institute/School, he/she is studying. |
3. Scholarship Category* | Scholarship schemes are divided in following major categories described below (Students are required to select the relevant category based on their class/course in which they are studying): 2.1 Pre-Matric Scholarship Scheme: For students studying from Class 1st to Class 10th. 2.2 Post - Matric Scholarship scheme/Top Class Scholarship Scheme/Merit Cum Means Scholarship Scheme: For students studying from Class 11th, 12th and above including Courses like ITI, B.SC, B. Com., B. Tech, Medical /students studying top level colleges such as IITs and IIMs/ students doing Technical and Professional courses etc. (Attach a hyperlink mentioning details of schemes of different Ministries) |
4. Name of Student* | Provide name as printed in educational certificates. For students applying for Post Matric, Top Class and MCM scholarship scheme preferably provide name as printed in class 10th certificate. For students providing Aadhaar number to ensure that your name is correct in your Aadhaar card. |
5. Mobile Number* | Provide correct and authenticated mobile number, as all the communications and One-time passwords related to portal activities will be sent as SMS on this mobile number.
|
6. Email Id | Provide correct and authenticated email id, as all the communications and One-time passwords related to portal activities will be sent on this email Id. |
7. Bank account details | Provide active bank account number and IFSC code of the bank branch of the student. The name of bank will be automatically mentioned based on your IFSC code. If not, then write it as printed on the bank passbook. In case of Post Matric, Top Class and MCM scholarship scheme one registration must be done with one bank account number. Whereas, for pre matric scholarship scheme, where students do not have their own bank account number parent's account number can be used. However, parent's account number can only be provided for maximum of their two children. |
8.Identification Details | Select and provide the information in this field very carefully. You are required to select one of the following methods for identification details: 7.1 Aadhaar Number: Students who have Aadhaar number are required to provide 12-digit Aadhaar number as printed on Aadhaar card. Upon submitting the registration form, the system will match the personal identification details of the applicant with the Aadhaar records. Only one registration is allowed with one Aadhaar number. However, if multiple applications of a student are found in the system at a later stage, all his/her applications are liable to be rejected. It may be noted that your Aadhaar Number could also be used for crediting scholarship amount in the bank account linked* to your Aadhaar number in fast track mode. For all such cases, where student does not possess Aadhaar, he is required to provide a bonafide certificate issued by his Institute/School in the prescribed proforma along-with Aadhaar enrolment number and scanned copy of first page of his Bank passbook (containing the photograph of the applicant) |