TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Saturday 9 April 2022

Jagananna AmmaVodi 2022 Child Student Info Data Updation

Jagananna AmmaVodi 2022 Child Student Info Data Updation Corrections Verification

ఆర్.సి.నెం. స్పెషల్ 1/బి/2022.  తేది: 06.04.2022

విషయము:- పాఠశాల విద్య అమ్మఒడి చైల్డ్ ఇన్ఫో డేటా లోని నమోదైన విద్యార్థినీ విద్యార్ధుల యొక్క పూర్తి వివరములను సరిచూసుకొనే నిమిత్తం తగు సూచనలను జారీ చేయుట - గురించి.

చైల్డ్ ఇనో డేటా లోని నమోదైన విద్యార్థినీ విద్యార్థుల యొక్క పూర్తి వివరములను సరిచూసుకొని నిమిత్తం ఈ క్రింది సూచనలను జారీ చేయడమైనది.

  • 1. పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్ధుల యొక్క పూర్తి వివరములు చైల్డ్ ఇన్ఫో లో నమోదు చేయవలెను.
  • 2. చైల్డ్ ఇన్ఫో లో నమోదు చేసిన విద్యార్థినీ, విద్యార్థుల యొక్క వివరముల యందు పుట్టిన తేది, విద్యార్ధి ఆదార్ నెంబర్ మరియు తరగతి సరియైన విధంగా నమోదు అయినదో లేదో సరిచూసుకొనవలెను. 
  • 3. విద్యార్థి పేరు మరియు తల్లి / సంరక్షకుని పేరు, ఆధార్ నెంబర్, రేషన్ కార్డు నెంబర్, బ్యాంక్ అక్కౌంట్ నెంబర్ మరియు ట్యాంక్ IFSC కోడ్ సరియైన విధంగా నమోదు అయినదో లేదో సరిచూసుకొనవలెను. 
  • 4. విద్యార్ధి మరియు విద్యార్ధి తల్లిదండ్రుల ఇతర వివరములు సరియైన విధంగా నమోదు అయినవో లేవో పునఃపరిశీలన చేసుకొనవలెను.

పై తెలియజేసిన ప్రక్రియ అంతయు కూడా సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు తరగతి ఉపాధ్యాయులు ది.12.04.2022 లోపుగా పూర్తి చేసి, ఇందుకు సంబంధించిన సాంకేతిక సమస్యలు ఉన్నచో వెంటనే సంబంధిత సమగ్ర శిఖీ, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు వారిని సంప్రదించి సమస్యను పరిష్కరించుకొనవలేను. అమ్మఒడి పథకమునకు అర్హత కలిగి పై కారణములు వలన అనర్హులుగా గుర్తింపబడినచో సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు తరగతి ఉపాధ్యాయులు వారిదే పూర్తి బాధ్యత వహించవలేను.

జిల్లాలోని ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాలలో చైల్డ్ ఇన్ఫో డేటాను పునఃపరిశీలన చేసి డేటా అంతయు కూడా విద్యార్ధులు మరియు వారి యొక్క తల్లిదండ్రుల పూర్తి వివరములన్నియు కూడా ఏ విధమైన లోపములు లేవని ధృవీకరించి నివేదికను ది.15.04.2022 లోపుగా సంబంధిత మండల విద్యాశాఖాధికారుల వారికి అందజేయవలసినదిగా తెలియజేయడమైనది. జిల్లాలోని మండల విద్యాశాఖాధికారులు అందరూ కూడా వారి పరిధిలోని సదరు విషయముపై తగు చర్య తీసుకొని ఏ విధమైన లోపములు లేవని నివేదికను ది.19.04.2022 లోపుగా జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయము, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం వారికి అందజేయవలసినదిగా మరియు పై తెలియజేసిన సూచనలను జిల్లాలోని ప్రతి పాఠశాలకు అందజేసి తగిన చర్యలు తీసుకొనవలసినదిగా ఆదేశించడమైనది.

GSWS వాలంటీర్ యాప్ లో సేవల అభ్యర్థనలో పిల్లలతో aadhar e-KYC చేయించండి.

చైల్డ్ ఇన్ఫో వెబ్ సైట్లో అమ్మఒడికి సంబంధించి విద్యార్థుల తల్లి ఆధార్ నంబర్ కు లింక్ చేసిన బ్యాంక్ ఖాతా నంబర్ కు మాత్రమే చేయాలి.

Download copy

Student Info Data Corrections / Updation Link

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...