TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Wednesday 9 March 2022

BRAG FIFTH CET 2022 APSWREIS 5th Class Admissions Notification, Online Application

BRAG FIFTH CET 2022 APSWREIS 5th Class Admissions Notification, Online Application APSWREIS APGPCET 5th Class Admissions 2022-23 - Notification, Online Application APSWREIS - 5th Class Admission-Notification 2022-2023 APGPCET 2022 Andhra Pradesh Social Welfare Residential Education Institutions Society (APSWREIS) 5th class Admissions Notification 2022-2023.

APPLICATION START DATE: 08-03-2022

APPLICATION END DATE: 08-04-2022

DATE OF ENTRANCE TEST: 24-04-2022

Dr. B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (APSWREIS), తాడేపల్లి, గుంటూరు జిల్లా

2022-23 విద్యా సంవత్సరమునకు 5వ తరగతి నందు ప్రవేశము కొరకు ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న Dr. B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో 2022-2023 విద్యా సంవత్సరానికిగాను 5వ తరగతిలో (ఇంగ్లీష్ మాధ్యమం) ప్రవేశమునకు బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. 

అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను తేది 08-03-2022 నుండి 08-04-2022 వరకు https://apgpcet.apcfss.in ద్వారా ఆన్లైన్లో సమర్పించాలి. 

ఇతర సమాచారం కొరకు https://apgpcet.apcfss.in వెబ్సైట్ను సందర్శించగలరు. 

Dr. B.R. అంబేద్కర్ గురుకుల విద్యాలయాల సమన్వయ అధికారులను (District Coordinators) లేదా ఏదైనా Dr. B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల ప్రధానాచార్యులను (Principals) గాని సంప్రదించగలరు. 

ప్రవేశ పరీక్ష తేది: 24-04-2022.

ప్రవేశానికి అర్హత :

1) వయస్సు: యస్.సి. మరియు యస్.టి (SC, ST) విద్యార్ధులు 01-09-2009 నుండి 31-08 2013 మధ్య పుట్టి ఉండాలి. ఒ.సి., బి.సి., యస్.సి. కన్వర్టడ్ క్రిస్టియన్ (బి.సి.-సి) విద్యార్ధులు 01-09-2011 నుండి 31-08-2013 మధ్య పుట్టి ఉండాలి..

2) విద్యార్థులు తమ సొంత జిల్లాలో మాత్రమే ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సంబంధిత జిల్లాలలో 2020-21 విద్యా సంవత్సరములో 3వ తరగతి మరియు 2021-22 విద్యా సంవత్సరములో 4వ తరగతి నిరవధికంగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువు పూర్తి చేసి ఉండాలి.

4) ఆదాయ పరిమితి: అభ్యర్థి యొక్క తల్లి, తండ్రి / సంరక్షకుల సంవత్సరాదాయము (2021-22) రూ.1,00,000/- మించి ఉండరాదు. 

రిజర్వేషన్ల వివరాలు:

1) అన్ని గురుకుల విద్యాలయాల్లో S.C 75%, S.C. కన్వర్టర్ క్రిస్టియన్లు 12%, S.T - 6%, B.C. - 5% మరియు ఇతరులకు 2% సీట్లు కేటాయించబడినవి.

2) ప్రత్యేక కేటగిరి (ప్రమాదకర కర్మాగారాల్లో పని నుండి తీసివేయబడ్డ పిల్లలు, వెట్టి చాకిరీ నుండి బయట పడ్డ పిల్లలు, జోగినులు, బసవిన్లు, అత్యాచార బాధితులు, అనాధలు మరియు సైనిక ఉద్యోగస్తుల పిల్లలు) క్రింద 15% సీట్లు కేటాయించబడినవి.

3) వికలాంగులకు 3% సీట్లు కేటాయించబడినవి.

4) ఏదైనా కేటగిరిలో సీట్లు భర్తీ కాని యెడల, వాటిని S.C. కటగిరి విద్యార్ధులకు కేటాయిస్తారు.

5) ప్రతి కేటగిరి నందు 3% సీట్లను సఫాయి కర్మాచారి విద్యార్థులకు కేటాయించబడును.

Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల వివరములు పట్టిక-A నందు ఇవ్వబడినవి.

గమనిక: ఇతర సమాచారం కొరకు Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలు జిల్లా సమన్వయ అధికారులను (District Coordinators) లేదా Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయముల ప్రధానాచార్యుల (Principals) వారిని సంప్రదించగలరు.

దరఖాస్తు చేయు విధానం:

ఆసక్తి గల విద్యార్థులు https://apgpcet.apcfss.in ద్వారా ఆన్ లైన్లో మాత్రమే దరఖాస్తులు సమర్పించవలయును.

తేదీ 08:03 2022 నుండి 31.03 2022 వరకు మాత్రమే ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించడము జరుగుతుంది. తేదీ స్వీకరించడము జరగదు. 31.03.2022 తరువాత దరఖాస్తులు

విద్యార్థులు దగ్గరలోని ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ ద్వారా గాని (లేదా) దగ్గరలోని Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో ఏర్పాటు చేయబడిన సహాయ కేంద్రం ద్వారా ధరఖాస్తులు సమర్పించవలయున

దరఖాస్తు చేయుటకు ఎటువంటి రుసుము చెల్లించనవసరములేదు. 

ఆన్ లైన్ దరఖాస్తులో విద్యార్థి 5వ తరగతిలో చేరుటకు ఎంచుకున్న పాఠశాల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి.

ఒకసారి దరఖాస్తు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన తరువాత, ఎటువంటి మార్పులకు అవకాశము ఉండదు.

ఎంపిక విధానము:

2022-23 విద్యాసంవత్సరమునకు Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశము కొరకు దరఖాస్తు చేసుకొన్న బాలురు మరియు బాలికలకు ప్రవేశ పరీక్ష తేదీ 24.04.2022 న 10:00 am to 12.00 noon నిర్వహించి అందులో వారు సాధించిన మార్కులు ఆధారంగా Dr.B.R. అంబేద్కర్ గురుకుల విద్యాలయాలలో సీట్లు కేటాయించడము జరుగుతుంది.

APSWREIS 5th Class Admissions 2022 Online application click here

APSWREIS 5th Class Notification 2022 click here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...