Notification for Recruitment of Anganwadi Workers / Mini Anganwadi Workers / Helpers in 16 ICDS Projects in Ananthapuramu District.
అనంతపురం జిల్లా లోని 16 ఐ.సి.డి.యస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న వివిధ అంగన్వాడి ఉద్యోగాల నియామక ప్రకటన 2021
JOIN OUR TELEGRAM GROUP LATEST JOB NEWS CLICK HERE
నోటిఫికేషన్ నెంబర్ 233226 తేది: 06.12.2021
అనంతపురం జిల్లా లోని 16 ఐ.సి.డి.యస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న వివిధ అంగన్వాడి ఉద్యోగాల నియామక ప్రకటన 2021
అంగన్వాడి నియామకం కొరకు దిగువ అనుబందములో ఇవ్వబడిన నిర్ణీత ప్రొఫార్మాలో ప్రకటన వెలువడిన తేది నుండి 16.12.2021 సాయంత్రం 5-00 గంటలలోపు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తులను సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో పొంది, తిరిగి సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించి రసీదు పొందవలయును.
- అంగన్వాడీ కార్యకర్త, మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకొను వారు 10 వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండవలయును.
- అభ్యర్థులు వివాహితులయి మరియు స్థానికంగా నివాసం అంగన్వాడి కేంద్రము ఉన్న గ్రామం మజరా స్థానికులు అయి ఉండవలెను.
- 01.07.2024 నాటికి దరఖాస్తు చేయు అభ్యర్థుల వయసు 21 సంవత్సరముల నుండి. 35 సంవత్సరాల లోపల ఉండవలెను.
- SC మరియు ST ప్రాంతంలో గల SC మరియు ST అభ్యర్థులు 21 సంవత్సరములు నిండిన వారు లేని యెడల 18 సంవత్సరములు నిండిన వారు కూడా అర్హులు.
- అంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్టుల కొరకు SC మరియు ST హాబిటెషన్స్ నందు ఉండు SC మరియు ST మాత్రమే అర్హులు.
- దరఖాస్తుదారు విధవరాలు అయితే 5 మార్కులు, అలాగే విధవరాలు అయివుండి 18 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నట్లయితే మరోక 5 మార్కులు మొత్తం 10 మార్కులు కలుపబడును.
- అంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకుల పోస్టులలో నియామకమగు అభ్యర్థులకు ప్రభుత్వ నియమ నిబంధనలు మరియు G.O.MS.NO.13 WCD&SC (PROGS) తేది 26/06/19 ప్రకారం గౌరవవేతనం. చెల్లించబడును. నెలకు అంగన్వాడీ కార్యకర్తకు గౌరవ వేతనం రూ:11500/-. మిని అంగన్వాడీ కార్యకర్త గౌరవ వేతనం రూ.7000/- మరియు అంగన్వాడి సహాయకులు. గౌరవ వేతనం రూ.7000/- చెల్లించబడును.
- రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా కేంద్రాల వారిగా ప్రాజెక్టు కార్యాలయముల యందు నోటీసు బోర్డు నందు ఉంచబడును.
- అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు కుల (SC/ST/BC అయితే), నివాసము, పుట్టిన తేది, పదవ తరగతి మా మేమో. ఆధార్, వికలాంగత్వముకు సంబంధిచిన పత్రములను గజిటెడ్ అధికారిచే ధృవీకరణ పత్రాలను జతపరచవలయును.
- అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుండి పదవ తరగతి పాసై ఉంటే తప్పనిసరిగా టి.సి/స్టడీ సర్టిఫికేట్లు జతపరచాలి. స్క్రూటినీ సమయములో CDPO ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా వారిపై చేసుకోవాలి.
- అభ్యర్థులు CDPO లు నిర్వహించే తెలుగు డిక్టేషన్ పాసు కావలెను.
- కులము, నివాస పత్రములు సంబంధిత తహసీల్దారు వారిచే జారిచేయబడిన పత్రములను ఏదేని గజిటెడ్ అధికారి చే దృవీకరణ చేసినవి జతపరచవలయును.
- దరఖాస్తులో ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగములో అతికించి, ఫోటో పైన ఇంకు పెన్నుతో అభ్యర్థి సంతకము చేయవలయును.
గమనిక:
1) ఖాళీల వివరాల కొరకు సంబంధిత సిడిపివో కార్యాలయంలో సంప్రదించవలెను. ఖాళీల విషయంలో మార్పులు, చేర్పులు ఉండవచ్చును.
2) మరిన్ని వివరాల కొరకు సంబంధిత సిడిపివో కార్యాలయం లేదా అనంతపురం జిల్లా అధికారిక వెబ్సైటుhttps://ananthapuramu.ap.gov.inనందు చూసుకోగలరు.
3) పిల్లల భద్రత దృష్ట్యా, మినీ అంగన్వాడీ వర్కర్ల ఎంపికలో వికలాంగులకు రిజర్వేషన్ల నియమ నిబంధనలు పూర్తిగా మినహాయించబడినది. ఎందుకంటే అక్కడ ఒక వ్యక్తి ఉంటారు కావున పిల్లలను చూసుకోవడం, వంట చేయడం మరియు వడ్డించడంతో పాటు గృహ సందర్శన చేయడం వంటి పనులు చేయాల్సిన అవసరం ఉంది. అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లకు సంబంధించి, 6వ (అంధత్వం మరియు తక్కువదృష్టి), 31వ (చెవిటి మరియు వినికిడి లోపం) మరియు 86వ (ఆటిజం, మేధో వైకల్యం, నిర్దిష్ట అభ్యాస వైకల్యం, మానసిక వైకల్యం, బహుళ వైకల్యాలు) రోస్టర్ పాయింట్ నందు రిజర్వేషన్లు మినహాయించబడ్డాయి. పిల్లల భద్రత మరియు శ్రేయస్సు దృష్ట్యా ఈ రోస్టర్ కొరకు మైనర్ లోకోమోటార్ వైకల్యం కలిగి ఉండి గృహ సందర్శన చేయగల సామర్ధ్యానికి అడ్డురాని వైకల్యం ఉన్న మహిళలకు అవకాశం ఇవ్వబడుతుంది.
- మరియు అన్ని వివరములు జిల్లా వెబ్ సైట్ https://ananthapuramu.ap.gov.in ను సంప్రదించగలరు మరియు పూర్తి చేసిన దరఖాస్తును సంబంధిత సిడిపివో కార్యాలయము నందు సమర్పించవలెను.
- పోస్టుల ఖాళీల వివరములు ఈ దిగువన ఇవ్వబడినవి. ఏ సమయములో నైనా.. పోస్టుల సంఖ్య తగ్గించు అధికారము, పూర్తిగా ప్రకటన రద్దు చేయు అధికారము జిల్లా కలెక్టర్ గారికి కలదు.
అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు గేజిటేడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచవలసినవి:
ప్రాజెక్టుల వారీగా అంగన్ వాడి కార్యకర్త మినీ అంగన్ వాడి కార్యకర్త మరియు అంగన్ వాడి సహాయకుల ఖాళీల వివరాలు:
గమనిక: కదిరి (పడమర) ప్రాజెక్టు కు సంబంధించి సంబంధిత శిశు అభివృద్ధి పథక అధికారిణి వారు వైద్య సెలవులో ఉన్నందున అక్కడ జరగవలసిన నియామకాలు నిలుపుదల చేయడమైనది.
- అంగన్ వాడి కేంద్రముల వారి రోస్టర్ వివరములు కొరకు సంబంధించి ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు వారిని సంప్రదించవలయును.
- ప్రకటన పబ్లిష్ జరగవలసిన తేది: 06.12.2021
- దరఖాస్తులను తీసుకొనుటకు ప్రారంభ తేది: 06.12.2021
- దరఖాస్తులను తీసుకొనుటకు చివరి గడువు తేది: 16.12.2021
సిడిపిఒలు తప్పనిసరిగా పాటించవలసిన సూచనలు:
1. సంబంధిత సి.డి.పి.ఓలు వారి కార్యాలయము నందలి నోటీసు బోర్డు నందు అంగన్వాడీ కేంద్రమునకు సంబంధించిన రోస్టర్ ను ప్రదర్శించవలెను.
2. నిర్ణీత సమయంలో వచ్చిన అన్ని దరఖాస్తులను తీసుకోవాలి మరియు సపరేట్ రిజిస్టరులో నమోదు చేసుకుని రసీదు ఇవ్వాలి.
3. వచ్చిన ప్రతి దరఖాస్తును నోటిఫికేషన్ లోని రోస్టర్ తో తనిఖీ చేసి, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అర్హతలను పరిశీలించే సమయంలో వారి స్థానికత, పదవ తరగతి ఉత్తీర్ణత, స్టడీ సర్టిఫికెట్లు, టి.సి, కులం వంటి ముఖ్యమైన విషయాలను పరిగణలోకి తీసుకోవాలి..
4. ప్రతి దరఖాస్తును ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పరిశీలించి అర్హులు మరియు అనర్హుల నివేదికను సంబంధిత ప్రొఫార్మాలో ఎక్సెల్ కాపీ మరియు ఇంకు సంతకం కాపీ) ప్రాజెక్టు డైరెక్టర్ వారికి 21.12.2021 ఉదయం 11.00 లోపల సంబంధిత సెక్షన్ అసిస్టెంట్ ద్వారా సమర్పించాలి.