TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Thursday, 11 November 2021

NAS TEST -2021 - Important Instructions to Field Investigators

 NAS TEST -2021 - Important Instructions to Field Investigators

NAS TEST -2021 - ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ల కు ముఖ్య సూచనలు:

1. మీ మెయిల్ కు పంపబడిన అప్పాయింట్మెంట్ ఆర్డరును డౌన్లోడ్ చేసుకోవాలి. 

2. ఉదయం 7.30 గంటల కల్లా మీకు కేటాయించిన శాంపిల్ స్కూలుకు హాజరు కావాలి.

3. ముందు రోజు శాంపిల్ స్కూల్ ప్రధానోపాధ్యాయునితో ఫోనులో మాట్లాడి నాస్ టెస్ట్ నిర్వహణపై చర్చించాలి.

4. 12-11-2021న 07.30 AM కు ప్రధానోపాధ్యాయుడుతో కలిసి పరీక్ష నిర్వహించే గదిని పరిశీలించి, అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉండేటట్లు చూడాలి.

5. పరీక్ష నిర్వహించే తరగతికి మరియు సెక్షన్లకు చెందిన అటెండాన్స్ రిజిస్టర్లు ప్రధానోపాధ్యాయుని నుండి పొందాలి.

6. వీలైనంతవరకు సర్వే నిర్వహించే గది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండేటట్లు చూడాలి.

7. అబ్జర్వర్ వచ్చే సమయానికి పరీక్ష నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకొని

ఉండాలి. 

8. అబ్జర్వర్ తోకలిసి పరీక్షకు నిర్దేశించిన విధానం మేరకు విద్యార్థులను ఎంపిక చేయాలి.

9. కంట్రోల్ షీట్ నందు విద్యార్థుల పూర్తి పేర్లు ఎంపిక చేసిన పద్దతిని అనుసరించి వ్రాయాలి. 

10. ఓ.ఏం.ఆర్ షీట్స్ లో జవాబులను గుర్తించే విధానాన్ని బ్లాక్ బోర్డు సహాయంతో విద్యార్థులకు వివరించాలి. 

11. సర్వే నిర్వహించే తరగతిలో గరిష్టంగా 30 మంది విద్యార్థులకు అసెస్మెంట్ టెస్ట్ నిర్వహించాలి. 

12. తరగతిలో ఒకే సెక్షన్ ఉండి ఆ సెక్షన్ లో 30 మంది లోపు విద్యార్థులు ఉంటే వారందరికీ అసెస్మెంట్ టెస్ట్ నిర్వహించాలి.

13. తరగతిలో ఒకటికంటే ఎక్కువ సెక్షన్లు ఉంటే సెక్షన్ల పేర్లు పేపర్లపై వ్రాసి లాటరీ ద్వారా పరీక్ష

నిర్వహించే సెక్షను ఎంపిక చేయాలి.

14. లాటరీ ద్వారా ఎంపిక చేయబడ్డ సెక్షన్ లో ఖచ్చితంగా 30 మంది విద్యార్థులు ఉంటే ఆ సెక్షన్ లోని విద్యార్దులందరికి నిర్వహించాలి.

15. తరగతిలో ఒకటికంటే ఎక్కువ సెక్షన్లు ఉండి లాటరీ ద్వారా ఎంపిక చేయబడ్డ సెక్షన్ లో 30 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉంటే, తగ్గిన విద్యార్థుల కొరకు మరొకసారి లాటరీ ద్వారా మిగిలిన సెక్షన్ల నుండి మరొక సెక్షన్ ను ఎంపిక చేసుకోవాలి.

16. తరగతిలో ఒకే సెక్షన్ ఉన్నా లేదా ఒకటికంటే ఎక్కువ సెక్షన్లు ఉన్నా ఎంపికచేయబడ్డ సెక్షన్ లో 30 మంది కంటే ఎక్కువమంది విద్యార్థులు ఉంటే, ఆ సెక్షన్ లో ఉన్న విద్యార్థుల సంఖ్యను 30 చే భాగించగా వచ్చే భాగఫలాన్ని దగ్గరి సహజ సంఖ్యకు సవరించి దీనిని M అనుకోవలెను. ఉదాహరణకు ఒక తరగతిలో 55 మంది విద్యార్థులు ఉంటే 55 ను 30 చే భాగించాలి. భాగఫలం 1.83 దానిని దగ్గరి సహజ సంఖ్యకు సరించగా దాని విలువ (M) 2 అవుతుంది. తదుపరి ఆ సెక్షన్ లో ఉన్న విద్యార్థుల నంబర్లతో కూడిన స్లిప్పులు వ్రాసి లాటరీ తీయాలి. లాటరీ లో వచ్చిన నెంబర్ విద్యార్థిని మొదటి విద్యార్థిగా అసెస్మెంట్ టెస్టుకు తీసుకోవాలి. ఆ విద్యార్థి నెంబర్ నుండి ముందుగా గుర్తించిన M ఆధారంగా మిగిలిన విద్యార్థులను ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు లాటరీ ద్వారా గుర్తించబడ్డ విద్యార్థి, తరగతిలో 7వ నెంబర్ విద్యార్థి అయి ఉండి, M విలువ 2 అయితే తదుపరి విద్యార్థులు వరుసగా 9వ, 11వ, 13వ నంబర్ల విద్యార్థులను ఎంపిక చేయాలి.

17. కంట్రోల్ షీట్ నందు విద్యార్థులకు ఇచ్చే NAS ID నంబర్లు 01 నుండి ప్రారంభించాలి.

18. ఫీల్డ్ ఇన్వెస్టిగేటరుతో కలిసి పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి. 19. పరీక్ష నిర్వహణకు సంబంధించిన ముఖ్య సూచనలను విద్యార్థుల మాతృ భాషలో వివరించాలి.

20. బబ్లింగ్ చేయడంపై విద్యార్థులకు తగిన సూచనలు చేయాలి.

21. 3 మరియు 5వ తరగతుల విద్యార్థులకు 10.30 AM కు పరీక్ష ప్రారంభించి 12.00 PM కు ముగించాలి.

22. మరియు 10వ తరగతుల విద్యార్థులకు 10.30 AM కు పరీక్ష ప్రారంభించి 12.30 PM కు ముగించాలి. 

23. అసెస్మెంట్ టెస్ట్ పూర్తి అయిన తరువాత విద్యార్థులకు ప్యూపిల్ క్వశ్చనైర్ అందించాలి.

24. 3 మరియు 5 తరగతుల విద్యార్థులను ఒక్కొక్కరిని పిలిచి ప్యూపిల్ క్వశ్చనైర్ లో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు రాబట్టి వాటిని ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లే నింపాలి.

25. 8 మరియు 10 వ తరగతుల విద్యార్థులు ప్యూపిల్ క్వశ్చనైర్ వారే పూరించాలి.

25. 8 మరియు 10 వ తరగతుల విద్యార్థులు ప్యూపిల్ క్వశ్చనైర్ వారే పూరించాలి.

26. పరీక్ష అనంతరం ఫీల్డ్ నోట్స్ ను పూరించాలి..

27. వినియోగించబడ్డ మరియు వినియోగించబడని ఓ.ఏం.ఆర్. షీట్స్, అసెస్మెంట్ టెస్ట్ బుక్లెట్స్, - ప్యూపిల్ క్వశ్చనైర్, స్కూల్ క్వశ్చనైర్, టీచర్ క్వశ్చనైర్, కంట్రోల్ షీట్ అన్ని తీసుకొని, వినియోగించిన ఓ.ఏ.ఆర్. షీట్స్ ఒక బాగ్ నందు, మిగిలినవన్నీ మరొక బాగ్ నందు ప్యాక్ చేయాలి.

28. అసెస్మెంట్ టెస్ట్ పూర్తైన తరువాత మిగిలిన పనుల విషయంలో అబ్జర్వర్ కు సహకరించాలి. 29. జిల్లా పరిశీలకులు విజిట్ చేయడం జరుగుతుంది. వారికి పూర్తిగా సహకరించాలి.

30. సి.బి.ఎస్.యి. వారు ఇచ్చిన యాక్టివిటీ షెడ్యూల్ ప్రకారం నిర్ణీత సమయంలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలి.

IMPORTANT ABBREVIATIONS

NAS-NATIONAL ACHIEVEMENT SURVEY

DLO-DISTRICT LEVEL OFFICER   

DLC-DISTRICT LEVEL COORDINATOR 

FI-FIELD INVESTIGATOR

AT- ASSESSMENT TEST

PQ-PUPIL QUESTIONNAIRE

SQ - SCHOOL QUESTIONNAIRE

TQ-TEACHER QUESTIONNAIRE

MOI-MEDIUM OF INSTRUCTION 

LOA - LETTER OF APPOINTMENT

Download NAS 2021 Instructions

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...