TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Tuesday 30 November 2021

LIP Further Instructions on Registers and Records

LIP Further Instructions on Registers and Records లిప్ కార్యక్రమానికి సంబంధించిన మరికొన్ని సూచనలు - స్కూల్ లో నిర్వహించాల్సిన రికార్డులు RC NO: స్పెషల్/ఏ5/2021. తేది.20.11.2021

విషయం: పాఠశాల విద్య నాణ్యతా విద్య వినూత్న కార్యక్రమం లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (LIP - 100 రోజులు ప్రోగ్రాం) - అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో | (ప్రైవేట అన్ ఎయిడెడ్ పాఠశాలలు తప్ప) - జోన్-11 - అమలు తగు సూచనలు జారీ - గురించి. 

సూచిక: ఈ కార్యాలయ కార్యావర్తనములు రి.సం, స్పెషల్/ఎ5/2021 తేది. 05.11.2021  మరియు 09.11.2021.

జోన్-II నందు గల అందరి జిల్లా విద్యాశాఖాధికారులకు, ఉప విద్యాశాఖాధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు తెలియచేయునది ఏమనగా, లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (LIP - 100 రోజుల ప్రోగ్రాం) ను ది. 10.11.2021 నుండి అమలు చేయడంలో భాగంగా క్షేత్ర స్థాయినుండి వచ్చిన సలహాలు మేరకు క్రింది అదనపు మార్గదర్శకములు ఇవ్వడం జరిగినది. 

1. తరగతి గది నందు ఏ భాష కు చెందిన ఉపాధ్యాయులు ఆ భాషను మాత్రమే బోధించవలెను. కానీ మూడు భాషలలో ఒకేసారి తరగతి గది బ్లాక్ బోర్డు పై వ్రాసి బోధించడం గమనించడం జరిగినది. ఆ విధంగా చేయరాదు. కేవలం స్కూల్ నోటీసు బోర్డు నందు మాత్రమే మూడు భాషలలో వ్రాయవలెను. తరగతి గది నల్ల బల్ల పై మూడు భాషలు ఒకేసారి వ్రాయకూడదు.

2. ఇప్పటి వరకు 6,7 మరియు 8 తరగతులకు 5 పదములు నేర్పటం జరుగుచున్నది కానీ ది 01.12.2021 నుండి దీనిని 3 పదములకు తగ్గించడమైనది కనుక 3 పదములు మాత్రమే నేర్పవలెను.

3 . 10.11.2021 నుండి ది 30.11.2021 వరకు నేర్పిన పదములు మీద మొదటి పక్షంకు పరీక్షను ది. 01.12.2021 న నిర్వహించవలెను. దీనికి సంబధిత పరీక్షాంశములు ఈ కార్యాలయం నుండి పంపించబడును మరియు ప్రతి పక్ష పరీక్ష నందు పరీక్షించవలసిన పరీక్షాంశములు ఈ కార్యాలయం నుండి పంపించబడును.

4. ప్రతి పక్ష పరీక్ష అనంతరం విద్యార్ధుల ప్రగతి కొలమానం గ్రేడింగ్ (స్టూడెంట్ అసెస్మెంట్ (స్టూడెంట్ అసెస్మెంట్ గ్రేడింగ్) (SAG) క్రింది విధంగా చేయవలెను.

5. ప్రతి పక్ష పరీక్ష అనంతరం తరగతి ఉపాధ్యాయులు, విద్యార్థుల ప్రగతి కొలమానంను పై గ్రేడింగ్ ల ఆధారంగా గణించి ఈ క్రింది నమూనా గా రిజిస్టర్ నిర్వహించవలెను.

6. తరగతి ఉపాధ్యాయులు తరగతి లో A గ్రేడ్ పొందిన విద్యార్థుల సంఖ్య ఆధారంగా తరగతి గ్రేడ్ ను క్రింది ఉదాహరించిన విధంగా లెక్క కట్టవలెను.

ఉదాహరణకు: ఒక తరగతి లో 30 మంది ర్థులకు 16 మంది విద్యార్ధులు A. గ్రేడ్ లో వచ్చినచో 16 / 30 = 53% (శ్రీ స్టార్ రేటింగ్ ఇవ్వవలెను). 

7. అన్ని తరగతులలో A గ్రేడ్ ఆధారంగా ప్రధానోపాధ్యాయులు క్రింది పట్టిక ఆధారంగా స్కూల్ ఎస్సేస్మేంట్ రేటింగ్ (SAR) తయారుచేయవలెను.

పాఠశాల గ్రేడు గణించు విధానం: 

పాఠశాలలోని అన్ని తరగతుల À గ్రేడ్ విద్యార్థుల సంఖ్య × 100 పాఠశాల లోని అన్ని తరగతుల మెత్తం విద్యార్థుల సంఖ్య ఉదాహరణకు పై పాఠశాల యొక్క గ్రేడ్ 123/213 × 100 = 57.74% కనుక ఈ పాఠశాల యొక్క గ్రేడ్ త్రీ స్టార్ రేటింగు,

8. ప్రతి పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు వారానికి విధిగా నాలుగు పాఠశాలలు సందర్శించి తమ నివేదికను CRP ద్వారా మండల విద్యాశాఖాధికారి వారి కార్యాలయం కి పంపించవలెను. ఒక  పక్పాషం లో పాఠశాలసముదాయ పరిధిలో ఉన్న అన్ని పాఠశాలలను వచవలెను.

9. ప్రధానోపాధ్యాయులు ప్రతి పక్షంలో దీనికి జతపరచిన Annexure- లేదా లేదా 11 లో నివేదికను సంబంధిత MEO వారికి మొదటి పక్షం పరీక్షా నివేదికను 3వ తేదీలోగానూ, రెండవ ఏకం పరీక్షా నివేదికను 17వ తేదీలలోగానూ పంపవలెను.

10. మండల విద్యాశాఖాధికారి వారి నివేదికను ప్రతి నెల 4 / 19 తేదిలలో Annexure-1. I & III లో నివేదికను సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయం కు పంపవలెను.

11. జిల్లా విద్యాశాఖాధికారులు వారి నివేదిక ను ప్రతి నెల 5/20 తేదిలలో వారి జిల్లా ప్రగతి ని Annexure-I ,II& III|| లో ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, పాఠశాల విద్య, జోన్-II, కాకినాడ వారి కార్యాలయం కు సమర్పించవలెను.

12. LIP పదములను విద్యార్ధులచే నల్లబల్ల పై వ్రాయించకూడదు. ఉపాధ్యాయులు మాత్రమే వ్రాయవలెను.

13. LIP ప్రోగ్రాం పై ఒకరోజు నేర్పిన పదములను అమరుసటి రోజు విద్యార్ధుల LIP book లో చూడకుండా.. వ్రాయించి విద్యార్థుల చేతనే స్వీయ మూల్యాంకనం చేయించవలెను.

14, LIP ప్రోగ్రాం ను భాషోపాధ్యాయులు మాత్రమే బోధించవలెను.

15. మూడు భాషలు ఒకేచోట వ్రాయించకూడదు, ఒక పుస్తకం నందు తెలుగుకి 30 పేజీలు, ఇంగ్లీష్ కి 30 పేజీలు, హిందీ కి 30 పేజీలు కేటాయించవలెను.

16, జిల్లా విద్యాశాఖాధికారులు అందరూ తమ జిల్లాలలో LIP ప్రోగ్రాం అమలు కొరకు సెక్రటరీ DCEB వారిని నోడల్ అధికారి గా నియమించవలెను. వారి ద్వారానే రిపోర్ట్ స్వీకరించవలెను.

17, జోన్-11 పరిధిలో లోగల మండల విద్యాశాఖాధికారులు మరియు ఉప విద్యాశాఖాధికారులు వారానికి

 పాఠశాలలో LIPకార్యక్రమం అమలును పరిశీలించి రిపోర్టును RJD KKD REGION WhatsApp గ్రూప్ నందు పోస్ట్ చేయవలెను.

18. జిల్లా విద్యాశాఖాధికారులు వారానికి కనీసం ఒక పాఠశాల సందర్శించవలెను.

కావున జోన్-11 నందు గల అందరి జిల్లా విద్యాశాఖాధికారులు పై సుచనలను పాఠశాల యి వరకు చేదునట్టు గా చ్యరలు తీసుకోని లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (LIP 100 రోజుల గ్రా. 10.11.2021 నుండి 31.03.2021 వరకూ విజయవంతం గా అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకొనవలసిందిగా ఆదేశించడమైనది.

Download LIP on Registers and Records

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...