TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Thursday, 12 August 2021

Jagananna Vidyakanuka 2021 Guidelines to MEOs, HMs, Teachers to distribute student kits at field level

Jagananna Vidyakanuka 2021 Guidelines to MEOs, HMs, Teachers to distribute student kits at field level

ఆర్. సి.నెం: SS-16021/3/2021-CMO SEC SSA తేది: 12-08-2021

విషయం: పాఠశాల విద్యాశాఖ - జగనన్న విద్యా కానుక 2021-22 స్టూడెంట్ కిట్లు పంపిణీ కొరకు మరియు 'మన బడి వాడు నేడు' - జిల్లా విద్యాశాఖాధికారులకు, సమగ్ర జిల్లా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లకు, సమగ్ర శిక్షా సీఎంవోలకు, మండల విద్యాశాఖాధికారులకు మరియు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శకాలు..

నిర్దేశాలు: 

1) ఆర్.సి.నెం. SS-16021/3/2021-CMO SEXC SSA తేదీ: 07-06-2021 
2) ఆర్.సి. నెం. SS-16021/3/2021-CMO SEC - SSA తేది. 05-08-2021

ఆదేశములు:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులు మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యంగా. 'మన ఐడి:నాడు-నేడు' అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. మొదటి దశలో 15,715 పాఠశాలల్లో రూ.3,669) కోట్లతో మౌలిక వసతులను మెరుగుపరచడం జరిగినది. మొదటి దశ పూర్తి అయిన సందర్భంగా దీనిని ప్రభుత్వం 2021 ఆగస్టు 16వ ప్రజలకు అంకితం చేయనున్నారు. అలాగే అదే రోజు రెండవ దశలో భాగంగా 16.368 పాఠశాలల్లో రూ.4535 కోట్లతో మౌలిక వసతులు మెరుగుపరిచే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అదే విధంగా ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది నిర్వహిస్తున్న 'జగనన్న విద్యా కానుక' కార్యక్రమం అదే రోజు ప్రారంభించనున్నారు..

గత సంవత్సరం 'జగనన్న విద్యా కానుక లో భాగంగా విద్యార్థులకు 3 జతల యూనిఫాం, నోటు పుస్తకాలు, ఒక జత బూట్లు మరియు రెండు జతల సాక్కులు, బెల్టు, బ్యాగు మరియు పాఠ్య పుస్తకాలు అన్నడం జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో అదనంగా 6 నుండి పదో తరగతి విద్యార్థులకు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ, 1 నుండి 5వ తరగతి విద్యార్థులకు పిక్టోరల్ డిక్షనరీల (బొమ్మల నిఘంటువు) ను అందించనున్నారు. దీనికోసం రూ. 731.30 కోట్లతో 47,32, 064 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

"మన బడి: నాడు- నేదు మొదటి దశ ముగింపులో భాగంగా, సంబంధిత జిల్లా కలెక్టర్లు ఉత్తమ సేవలందించిన ఇద్దరు హెడ్ మాస్టర్స్, ఇద్దరు ఇంజనీర్లు మరియు రెండు పేరెంట్స్ కమిటీలను గుర్తించి, వారికి తగిన విధంగా సన్మానించాలని అభ్యర్థించారు.

జగనన్న విద్యాకానుకలో భాగంగా పాటించవలసిన విషయాలు:

  • జగనన్న విద్యాకానుక స్టూడెంట్ కిట్లును 16.08:2021 నుండి 31.08 2021 లోపు పంపిణీ చేయాలి. మొదట వచ్చిన విద్యార్థికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి.
  • రాష్ట్రంలోని అందరూ జిల్లా విద్యాశాఖాధికారులు, సమగణిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే కోవిడ్ నియమనిబంధనలు పాటిస్తూ కార్యక్రమం సక్రమంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. 
  • ఒక రోజులో గరిష్టంగా 30-40 నుంది విద్యార్థులకు కిట్లు పంపిణీ చేయాలి.
  • ప్రతి పాఠశాల నందు 'స్టూడెంట్ కిట్' సిద్ధం చేసి విద్యార్థులకు అందించేందుకు సన్నద్ధులై ఉండాలి. ఏ తరగతి విద్యార్థికి ఏయే వస్తువులు బ్యాగులో వేసి సిద్ధం చేయాలో అనుబంధం-1 లో పొందుపరచడమైనది. 
  • తరగతివారీగా బాలబాలికలకు విడివిడిగా కిట్లు సిద్ధం చేసుకుని ఉంచాలి. సులభంగా, త్వరితగతిన సంబంధిత విద్యార్థికి కిట్ అందించడానికి ప్రతి బ్యాగు మీద ఉన్న పౌచ్ లో దిగువ తెలిపినట్లు పేపర్ పెట్టుకోవాలి. 
  • అందుకున్న వివిధ సరుకులకు సంబంధించిన వివరాలను స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు అందించబడిన వారి లాగిన్ నందు నమోదు చేయవలసి ఉంటుంది. 
  • జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని నిర్వహించడానికి 16.08.2021 న మన బడి: నాడు- నేడు పనులు పూర్తయిన పాఠశాలల్లో జిల్లా కేంద్రం నందు ఒక పాఠశాలను, ప్రతి నియోజకవర్గం నందు ఒకటి, ఇవికాకుండా మిగిలిన మండలాల్లో ఒక్కో పాఠశాలను ఎంపిక చేసుకోవాలి. 
  • 01.09.2021 నాటి నుండి కొత్త ప్రదేశాలు (అడ్మిషన్లు) వివరాలు అందిన సరుకునందు ఏమైనా చినిగినా, పాదైనా, బూట్లు మిస్ మ్యాచ్ వంటివి ఉన్నా పాఠశాలనందు వివరాలను నమోదు చేసి సంబంధిత మండల విద్యాశాఖాధికారి వారికి, సదరు మండల విద్యాశాఖాధికారి సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి లేదా సమగశిక్షా అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ వారికి లేదా జిల్లా సీఎంవోకు తెలియపరచాలి. 
  • జిల్లా కేంద్రం నుండి డిక్షనరీలు తరలించడానికి ట్రాన్స్ పోర్టరును ఎంపిక చేయడానికి ట్రాన్సోషన్ కు అయ్యే ఖర్చు చెల్లించడానికి జిల్లా కలెక్టర్ గారి నేతృత్వం లో జిల్లా పీసీ ఆమోదం తీసుకుని సంబంధిత జిల్లా డీపీవో మేనేజ్ మెంట్ కాస్ట్ నుండి చెల్లించాలి.  మండల కేంద్రాల నుండి స్కూల్ కాంప్లెక్సులకు, అక్కడి నుండి పాఠశాలలకు సరుకు సరఫరా చేయడానికి అయ్యే ఖర్చును కూడా జిల్లా దీపిన్ వారి ఆమోదంతో తగిన బిల్లులు సమర్పించిన తరువాత జిల్లా డి.పి.ఓ -మేనేజ్ మెంట్ కాస్ట్ నుండి చెల్లించాలి.  GSR INFO www.gsrmaths.in
  • జిల్లా నందు సేకరించిన పూర్తి సమాచారం సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి లేదా సమగజిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ లేదా జిల్లా సీఎంచో రాష్ట్ర కార్యాలయానికి 15.09.2021 నాటికి తెలియజేయాలి. ఆ తర్వాత వచ్చిన ఫిర్యాదులు స్వీకరించబడవు.
  • జగనన్న విద్మాకానుక స్టూడెంట్ కిట్లును సరఫరా చేసేటప్పుడు నరుకులో ఏమైనా నాణ్యతా లోపాలు గుర్తించినట్లయితే వాటిని సరఫరా చేయకుండా ఆ సరుకులు రిజెక్ట్ చేసి ఆ వివరాలను స్టాకు రిజిస్టర్ నందు నమోదు చేయాలి.
  • రాష్ట్ర కార్యాలయం నందుగల రాష్ట్ర అకడమిక్ మోనటరింగ్ ఆపీసర్ వారిని "జగనన్న విద్యాకానుక గ్రీవెన్స్ సెల్' నోడల్ ఆఫీసరుగా నియమించడమైనది. జిల్లా నుంచి ఫిర్యాదులు jvk2grievance@gmail.com కు పంపించాలి. 0866 - 2428599 నంబరును సంప్రదించవచ్చు.
  • జిల్లా నందు ఈ ఫిర్యాదులు సేకరించుటకు ఏపంవోలకు బాధ్యతలు అప్పగించడమైనది. ప్రతి జిల్లా నందు ఈ ఫిర్యాదులు) సేకరించుటకు ఒక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ఎవంతో దానిని పర్యవేక్షించాలి. ప్రతి జిల్లాలో ఏర్యాదులు కోసం ఒక పోన్ నంబరును ఏర్పాటు చేయాలి. అందిన ఫిర్యాదులను 15.09.2021 లోపల రాష్ట్ర కార్యాలయానికి సమర్పించాలి.
  •  కిట్ కు సంబంధించిన వస్తువులు అందినవి అందినట్టు స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉపాధ్యాయులు, సిబ్బంది సహకారంతో ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారులు నమోదు. చేసిన వివరాలను (ఎన్ని వచ్చాయి? ఇంకా ఎన్ని అందాలి?) ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు గమనిస్తూ ఉండాలి. 
  • జగనన్న విద్యాకానుక స్టూడెంట్ కిట్లు జిల్లాకు సరిపడినన్ని దాని పక్షంలో ఏ సరుకు ఎంత కావాలో సంబంధిత అధికారుల ద్వారా రాష్ట్ర కార్యాలయానికి తెలియజేయాలి. 
  • "జగనన్న విద్యాకానుక". వస్తువులు పంపిణీలో ఏదైనా సందేహాలు ఉన్న యెడల 91542 94169 నంబరులో కార్యాలయపు పనివేళ్లలో సంప్రదించగలరు.
  • మండల విద్యాశాఖాధికారులు మరియు స్కూల్ కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయులు 'జగనన్న విద్యాకానుక" యాప్ లో తమకిచ్చిన లాగిన్ నందు అందుకున్న వస్తువుల వివరాలు ఎప్పటికప్పుడు తప్పనిసరిగా నమోదు చేయాలి.
  • పూర్తి శ్రద్ధతో పై ఆదేశాలను అత్యంత జాగరూకతతో అమలు చేయవలసిందిగా ఇందుమూలంగా ఆదేశించడమైనది.

Download JVK 2021 Distribution Guidelines
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...