ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది.
ఇంటర్ బోర్డు కార్యదర్శికి విద్యాశాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.
- ఆయా సబ్జెక్టుల్లో మొదటి ఏడాది మార్కులే రెండో ఏడాది కేటాయించనున్నారు.
- ‘‘ఇంటర్ సెకండియర్ ప్రాక్టికల్స్‌కు పూర్తి మార్కులు.
- గతంలో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు 35% మార్కులు.
- బ్యాక్‌లాగ్స్ ఉంటే ఆ సబ్జెక్టులకు రెండో ఏడాది 35 మార్కులు.
- ప్రైవేటుగా దరఖాస్తు చేసుకున్న వారికి 35శాతం మార్కులు.
- ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించాలి.