APSWREIS - 5th Class Admission-Notification 2021-2022 APGPCET 2021 Andhra Pradesh Social Welfare Residential Education Institutions Society (APSWREIS) 5th class Admissions Notification 2021-22.
APPLICATION START DATE: 17-06-2021
APPLICATION END DATE: 15-07-2021
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (APSWREIS) 5 వ తరగతి ప్రవేశము కొరకు ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో 2021 - 22 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశ పరీక్ష ద్వారా 5వ తరగతి (ఇంగ్లిష్ మాద్యమం) లో ప్రవేశమునకు బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను తేది 17-06-2021 నుండి 15-07-2021 వరకు ఆన్ లైన్ లో apgpcet.apcfss.in ద్వారా సమర్పించాలి. ఇతర సమాచారం కొరకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయ కర్తలను' సంప్రదించగలరు.
అభ్యర్థులకు సూచనలు:
ప్రవేశానికి అర్హత :
1) వయస్సు: యస్.సి. మరియు యస్.టి (SC, ST) విద్యార్ధులు 01-09-2008 నుండి 31-08 2012 మధ్య పుట్టి ఉండాలి. ఒ.సి., బి.సి., యస్.సి. కన్వర్టడ్ క్రిస్టియన్ (బి.సి.-సి) విద్యార్ధులు 01-09-2010 నుండి 31-08-2012 మధ్య పుట్టి ఉండాలి..
2) 2020-21 విద్యా సంవత్సరం ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 4వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
3) విద్యార్థులు తమ సొంత జిల్లాలో మాత్రమే ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 3 మరియు 4వ తరగతులు చదివి ఉండాలి.
4) ఆదాయ పరిమితి: అభ్యర్థి యొక్క తల్లి, తండ్రి / సంరక్షకుల సంవత్సరాదాయము (2020-21) రూ.1,00,000/- మించి ఉండరాదు.
రిజర్వేషన్ల వివరాలు:
1) అన్ని గురుకుల విద్యాలయాల్లో S.C 75%, S.C. కన్వర్టర్ క్రిస్టియన్లు 12%, S.T - 6%, B.C. - 5% మరియు ఇతరులకు 2% సీట్లు కేటాయించబడినవి.
2) ప్రత్యేక కేటగిరి (ప్రమాదకర కర్మాగారాల్లో పని నుండి తీసివేయబడ్డ పిల్లలు, వెట్టి చాకిరీ నుండి బయట పడ్డ పిల్లలు, జోగినులు, బసవిన్లు, అత్యాచార బాధితులు, అనాధలు మరియు సైనిక ఉద్యోగస్తుల పిల్లలు) క్రింద 15% సీట్లు కేటాయించబడినవి.
3) వికలాంగులకు 3% సీట్లు కేటాయించబడినవి.
4) ఏదైనా కేటగిరిలో సీట్లు భర్తీ కాని యెడల, వాటిని S.C. కటగిరి విద్యార్ధులకు కేటాయిస్తారు.
గమనిక: 185 సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల వివరములు పట్టిక శ్రీ నందు ఇవ్వబడినవి.
ఇతర సమాచారము కొరకు సంబంధిత ప్రధానాచార్యులను సంప్రదించవచ్చు.
దరఖాస్తు చేయు విధానం:
1) 2021-22 విద్యా సంవత్సరానికి గాను, 5వ తరగతిలో ప్రవేశ పరీక్ష ప్రవేశానికి దరఖాస్తు చేసుకోదలచిన విద్యార్ధులు దగ్గరలోని ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ ద్వారా గాని (లేదా) దగ్గరలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఏర్పాటు చేయబడిన సహాయ కేంద్రం ద్వారా గానీ ఆన్ లైన్ apgpcet.apcfss.in లో తేది 17-06-2021 నుండి 15-07-2021 వరకు దరఖాస్తులు సమర్పించాలి
1) ఎటువంటి దరఖాస్తు రుసుము స్వీకరించబడదు.
3) ఆన్ లైన్ దరఖాస్తులో విద్యార్ధి 5వ తరగతిలో చేరుటకు ఎంచుకొన్న పాఠశాల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి
4) దరఖాస్తును నింపునపుడు అభ్యర్థి అన్ని వివరాలను జాగ్రత్తగా నమోదు చేయవలెను. తదుపరి ఏ విధమైన మార్పులు చేయబడవు.
5) దరఖాస్తు నింపుటలో జరుగు పొరపాట్లకు అభ్యర్ధియే పూర్తి బాధ్యత వహించాలి.
6) ఒకసా దరఖాస్తు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన తరువాత ఎటువంటి మార్పులు తదుపరి పరిగణించబడవు.
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సం.క్షేమ గురుకుల విద్యాలయాల్లో ప్రభుత్వం ద్వారా విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాల వివరాలు పట్టిక C నందు ఇవ్వబడినవి.
- పట్టిక - A: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల వివరాలు (185 No.s). Download
- పట్టిక B: జిల్లా సమన్వయ కర్తల (District Co-ordination) ఫోన్ నంబర్లు. Download
- పట్టిక C: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాల వివరాలు.
Download APSWREIS 5th Class Notification