Telangana 10th Class 2021 Results | TS SSC Results 2021: How to Check Results?
హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులను పరీక్షలు నిర్వహించకుండానే ఉత్తీర్ణులను చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ సారి అత్యధిక ఏ గ్రేడ్ లు...పరీక్షకు మొత్తం 100 మార్కులు కాగా 91-100 మార్కులు సాధించిన వారికి ఏ1 గ్రేడ్, 81-90 మార్కులు సాధించిన వారికి ఏ2, 71-80 మార్కులు సాధిస్తే బీ1, 61-70 మార్కులు పొందిన వారికి బీ2, 51-60 మార్కులు సాధించిన వారికి సీ1, 41-50 మార్కులు వస్తే సీ2, 35-40 మార్కులు సాధించిన వారికి డీ, 0-34 మార్కులు వస్తే ఈ గ్రేడ్‌ను అధికారులు కేటాయించారు. అయితే ఈ ఏడాది మొత్తం 5,21, 392 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించగా ఇందులో దాదాపు 2 లక్షల మంది ఏ1 గ్రేడ్ సాధించినట్లు తెలుస్తోంది.
ఈ సారి హాల్‌టికెట్లు జారీ చేయనందువల్ల.. చదివిన పాఠశాల పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేస్తే హాల్‌టికెట్ నంబర్‌తోపాటు ఏ గ్రేడ్ వచ్చిందో తెలుసుకోవచ్చు.
ఫార్మేటివ్ అసెస్‌మెంట్(ఎఫ్‌ఏ)-1లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇచ్చారు. మొత్తం 5,21,393 మంది వార్షిక పరీక్షల కోసం ఫీజులు చెల్లించగా వారందర్నీ పాస్ చేస్తున్నట్లు ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది.
Telangana State Class 10, 10th Class SSC 2021 may check their Results and Download Subject wise Marks List/ Marks Card/ Marks Memo from the Directorate of Govt Examinations Telangana State Official Website/Web Portal https://bse.telangana.gov.in/
Declaring Result of all TS Class 10 Students 2020-21 as pass based on Formative Assessment Marks by awarding Grades.