TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Wednesday, 28 April 2021

How to Register for Covid 19 Vaccination | Covid 19 Vaccination Registration Process

Registration is mandatory if you want the vaccine. How to register?

వ్యాక్సిన్‌ కావాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి.రిజిస్ట్రేషన్ చేసుకొనే విధానం.

  • REGISTER YOURSELF - Register using your Mobile no. or Aadhaar no. or any other Identity docs.
  • CHOOSE VACCINE LOCATION - Select your nearby Vaccine Center for vaccination.
  • CONFIRM YOUR SLOT - Book your slot to Get Vaccine and Get yourself vaccinated from selected center on scheduled date.

18 నుంచి 45 సంవత్సరాల వయసు కలిగిన వారికి మే 1వ తేదీ నుంచి వ్యాక్సిన్‌ అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, వ్యాక్సిన్‌ తీసుకునేవారు తప్పనిసరిగా కొవిన్‌ వెబ్‌ పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సిందేనని ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుతం 45 సంవత్సరాలు దాటిన వారు కూడా కొవిన్‌ వెబ్‌పోర్టల్‌లో పేరు నమోదు చేసుకోవాలి. అయితే, ఆధార్‌కార్డుతో నేరుగా వాక్సినేషన్‌ కేంద్రానికి వెళ్లినా వైద్య సిబ్బంది పేరు, వివరాలు నమోదు చేసుకుని వ్యాక్సిన్‌ ఇస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కరోనా కేసులు పెరుగుతుండటంతో మే 1వ నుంచి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకునేలా కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది.

'వ్యాక్సిన్‌ అందరికీ అందుబాటులోకి తెచ్చే క్రమంలో ఒక్కసారిగా డిమాండ్‌ పెరుగుతుంది. వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద జనాభా తాకిడి ఎక్కువవుతుంది. దీన్ని నియంత్రించడానికే కొవిన్‌ పోర్టల్‌లో వివరాలు నమోదు తప్పనిసరి చేశాం. నేరుగా ఆయా కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్‌ తీసుకోవడాన్ని ప్రస్తుతానికి అంగీకరించం' అని ఉన్నతాధికారులు తెలిపారు. 18 సంవత్సరాల వయసు దాటిన వారందరూ కొవిన్‌ పోర్టల్‌, ఆరోగ్యసేతు యాప్‌ ద్వారా ఏప్రిల్‌ 28వ తేదీ నుంచి తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. 

1. వ్యాక్సిన్ కోసం అధికారిక వెబ్ సైట్ www.cowin.gov.in లో పేరు నమోదు చేసుకోవచ్చు.

2. కొవిన్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత అందులో Register/ Sign in yourself అనే బటన్‌ ఉంటుంది. 
 
3. దాన్ని క్లిక్‌ చేసి 10 అంకెల మొబైల్‌ నంబరు లేదా ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి.
 
4. అనంతరం మన ఫోన్‌కు ఒక ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాలి. 

5. మీరు మీ పేరు నమోదులో భాగంగా మీ పేరు, వయసు, పుట్టినతేదీ వంటి వివరాలు ఎంటర్‌ చేయాలి. దీంతో పాటు ఏదో ఒక ధ్రువీకరణ పత్రం (డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డు, ఓటరు కార్డు, ఆధార్‌ కార్డు, పాస్‌పోర్టు తదితర) ఎంచుకుని దాన్ని అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

6. ఆ తర్వాత, మీ అపాయింట్‌మెంట్‌, కావలసిన తేదీ మరియు సమయాన్ని  షెడ్యూల్ చేయండి.

7. కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు పూర్తి చేసుకున్న అనంతరం మీకు ఒక రెఫరెన్స్ ఐడి వస్తుంది. దాని ఆధారంగా మీరు కోవిడ్ వాక్సిన్ సర్టిఫికెట్ పొందవచ్చు.

8. అక్కడే కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తియినట్టు ధృవీకరించే సర్ఠిఫికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

9. గూగుల్ మ్యాప్స్ ద్వారా మీకు దగ్గర్లోని కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ గురించి తెలుసుకోవచ్చు.

10. ఫేజ్-3 కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ కింద ఇవ్వబడిన ధృవీకరణ పత్రాలు అవసరం అవుతాయి. 

* ఆధార్ కార్డు

* పాన్ కార్డు

* ఓటర్ ఐడి

* డ్రైవింగ్ లైసెన్స్

* హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్, కేంద్ర కార్మికశాఖ ఆధ్వర్యంలోని మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ జాబ్ కార్డు

* ఎంపి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అధికారిక ఐడీ కార్డులు

* పాస్ పోర్టు

* బ్యాంకు/పోస్టాఫీసులు జారీ చేసిన పాస్ బుక్స్

* పెన్షన్ డాక్యుమెంట్

* రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు జారీ చేసిన ఐడీ కార్డులు

* ప్రభుత్వ, పబ్లిక్ లిమిటెట్ కంపెనీలు జారీ చేసిన ఐడీకార్డులు

మరికొన్ని ముఖ్యమైన విషయాలు:

* టీకా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వ్యాక్సిన్‌ ఇస్తారు. 

* తొలి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు తీసుకోవాలి. మొదటి డోసు తీసుకున్నప్పుడే రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలో తెలుస్తుంది. 

* రెండో డోసు తీసుకోవడం ద్వారా కొవిడ్‌ టీకా పొందినట్లుగా ధ్రువపత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది.

* టీకా పొందేప్పుడు నమోదు సమయంలో అప్‌లోడ్‌ చేసిన సంబంధిత ధ్రువపత్రాల ఒరిజినల్స్‌ను వెంట తీసుకెళ్లాలి.

రిజిస్ట్రేషన్‌ కోసం https://selfregistration.cowin.gov.in/ వీక్షించవచ్చు.

రిజిస్ట్రేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయగలరు

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...