TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Monday, 26 April 2021

How to complete UDISE + 2020-21 online - Instructions

How to complete UDISE + 2020-21 online UDISE + 2020-21 online Data Entry process

 UDISE+ 2020-21:: ఆన్లైన్లో పూర్తి చేసే విధానం:

  • అందరు ప్రధానోపాధ్యాయులు CSE సైట్లో స్కూల్ సెలక్ట్ చేసుకొని అందులో యూ డైస్ సెలెక్ట్ చేసుకుని లాగిన్ అయి.. డేటా క్యాప్చర్ ఫామ్ (DCF) ను ప్రింట్ తీసుకోవాలి.
  • ఏప్రిల్ 26 నుండి ఏప్రిల్ 29 వరకు DCF లో వున్న వివరాలను మన స్కూల్ లో వున్న వివరాలతో సరిచూసుకోవాలి. 
  • హెడ్మాస్టర్ సంతకాలు, CRC హెడ్మాస్టర్ సంతకాలు పూర్తి చేసి ఏప్రిల్ 30 వ తేదీ కి అందరు ప్రధానోపాధ్యాయులు సీ ఆర్ పిల సహకారం తో DCF లను మండల కార్యాలయానికి పంపాలి.
  • మే నెల 1 నుండి 10 వరకు అన్ని స్కూల్ ల DCF లను మండల లాగిన్ లో సబ్మిట్ చేయాలి.
  • మే 13 న ప్రధానోపాధ్యాయులు సమావేశం నిర్వహించి మళ్ళీ అప్డేట్ చేసిన స్కూల్ ప్రింట్ కార్డులను ప్రధానోపాధ్యాయుల కు అందజేస్తారు..
  • మే 14,15 తేదీలలో వాటిని సరిచూసుకుని సంతకాలు పూర్తి చేసి 16వ తేదీకి మండల కార్యాలయం కు అందజేస్తే మండల లాగిన్ లో ఫైనల్ సబ్మిట్ చేయడం జరుగును.
  • డేటా క్యాప్చర్ ఫామ్ లో వివరాలు తప్పుగా వుంటే వాటిని రెడ్ ఇంక్ తోనే కరెక్ట్ గా వ్రాయాలి.
  • DCF లో మొత్తం 11 సెక్షన్లు వుంటాయి.
  • అన్ని వివరాలు గత ఏడాది వి వుంటాయి.

ముఖ్యంగా గమనించాల్సిన అంశాలు :

సెక్షన్ 1 లో స్కూల్ ప్రొఫైల్ వుంటుంది.

  • 1.1.1 లో name as per recognition copy అన్న చోట కేవలం ప్రైవేట్ పాఠశాలలు మాత్రమే వ్రాయాలి.
  • 1.2.1 లో location of the school అన్నచోట మన పాఠశాల ఏ క్యాస్ట్ హాబిటేషన్ లో వుంటుందో ఆ పేరు వ్రాయాలి.
  • 1.6.1లో గ్రామ పంచాయతీ కోడ్ వ్రాయాలి.
  • 1.8 లో మన పాఠశాల ఏ హాబిటేషన్ లో వుంటుందో ఆ పేరు వ్రాయాలి.
  • 1.14 మరియు 1.14(b) లో హెడ్మాస్టర్ ఎవరైనా మారి వుంటే వారి వివరాలు వ్రాయాలి.
  • 1.16(c) లో మన స్కూల్ పరిధి లో అంగన్వాడీ వుంటే చూపాలి.
  • 1.28 లో మీడియం తెలుగు కోడ్ 17. మీడియం ఇంగ్లీష్ కోడ్ 19.
  • 1.34 లో స్కూల్ to స్కూల్ డిస్టెన్స్ కరెక్ట్ గా kms లో చూపాలి.
  • 1.37 లో 2019 - జూన్ 12 నుండి 2020 మార్చ్ 19 నాటికి ఎన్ని పని దినాలు వస్తాయి అన్నది రాయాలి.
  • 1.50 లో ప్రస్తుతం మన పాఠశాల పేరెంట్స్ కమిటీ వివరాలు వ్రాయాలి.
  • 1.50.1 లో పేరెంట్ కమిటీ అకౌంట్ వివరాలకు బదులుగా DDO PD అకౌంట్ వివరాలు రాయాలి.

సెక్షన్ 2 పాఠశాల భౌతిక వసతులు:

September 2020 నాటికి స్కూల్ infrastructure వివరాలు నింపాలి. ఇందులో ముఖ్యంగా నాడు నేడు 1 మరియు 2 ఫేజ్ లో ఎంపిక కాబడిన పాఠశాలలు 9 components ను requirement లో చూపరాదు. కేవలం అదనపు తరగతి గదులు, వంట గది అవసరం ఐతే మాత్రమే చూపాలి.

  • 2.1.12 లో మన పాఠశాల లైబ్రరీ వివరాలు వ్రాయాలి. 
  • 2.1.19 లో ఫర్నీచర్ నాడు నేడు వారు వున్నట్లుగా చూపాలి.
  • 2.2.3 బయోమెట్రక్ yes అని చూపాలి. RAA UP స్కూల్ వాళ్ళు మాత్రం మాథ్స్, సైన్స్ కిట్ లు వున్నట్లుగా చూపాలి.

సెక్షన్ 3 లో బోధనా సిబ్బంది వివరాలు:
  • 3.3 లో ఉపాధ్యాయల వివరాలు జాగ్రతగా పరిశీలించి ఏమైనా తప్పులు వుంటే కరెక్ట్ గా వ్రాయాలి.
  • No Teachers working school నందు working position లో zero వేయాలి.
  • సెక్షన్ 4 మన పాఠశాల ఎన్రోల్మెంట్ వివరాలు వుంటాయి. వీటిని ఏమీ మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆన్లైన్ లో మన పాఠశాల లో ఎందరైతే వుంటారో అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది.
సెక్షన్ 5 లో గత సంవత్సరం  ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా అందజేసిన వివరాలు వుంటాయి. వీటిని ఏమీ మార్చాల్సిన అవసరం లేదు.
సెక్షన్ 6 లో 2019 - 20 లో SA 1 ఫలితాలను రాయాలి.

సెక్షన్ 8 నిధులు ఖర్చులు:
  • 8.1 ఇందులో.. 2019-20 లో మన పాఠశాల కి వచ్చిన నిధుల వివరాలు వ్రాయాలి
  • 8.2 లో మన పాఠశాల కు ఎవరైనా దాతలు నిధులు అందజేసి వుంటే వారి వివరాలు వ్రాయాలి.
సెక్షన్ 10 ఇందులో కేటగిరీ వారీగా మన పాఠశాల లో వున్న పోస్టుల వివరాలు వుంటాయి... ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి ఏమైనా మార్పులు చేర్పులు వుంటే వాటిని కరెక్ట్ గా వ్రాయాలి.

సెక్షన్ 11 స్కూల్ సేఫ్టీ:
  • ఇందులో 11.10 లో మన పాఠశాల లో సేఫ్టీ ప్లెడ్జ్ రాసి వుంటాది గనుక yes వ్రాయాలి.

స్కూల్ లాగిన్ లింక్::-  https://udise.ap.gov.in/UDISE/logout.do

Download Instructions Telugu | Your School UDISE + Data

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...