TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Friday 2 April 2021

AP MPTC, ZPTC Elections 2020-21 Presiding officers PO Hand Book, P.O, APO Duties, Training Material, Covers, Male- Female count

The objective of this Handbook is to provide information and guidance to perform your duties as a Presiding Officer in the best possible manner. However, this Handbook is neither an exhaustive compendium in all aspects nor a substitute reference for the various provisions of election law related to the conduct of poll. You should, therefore, wherever necessary, refer to those legal provisions, which are reproduced in Annexures-1 (Provisions of A.P. Panchayat Raj Act, 1994) and Annexure-1A (Provisions of Conduct of Elections Rules, 2006).

MPTC/ZPTC ఎన్నికలు-2020-21:

డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద సరిచూసుకొనవలసిన మెటీరియల్:

బ్యాలెట్ పెట్టె;పెట్టె పై నంబరు; వర్కింగ్ కండిషన్  సరిచూసుకోవాలి. బ్యాలెట్ పేపర్లు (MPTC,ZPTC విడివిడిగా) లెక్కపెట్టుకోవాలి. మధ్యలో Missing ఏమైనాఉంటే గుర్తించాలి. ఏరో క్రాస్ మార్క్స్,  స్టాంప్ పాడ్స్,  ఇండిలబుల్ ఇంక్, మార్క్ డ్ కాపి-ఎలక్టోరల్ రోల్ + 3 ఇతర వర్కింగ్ కాపీలు, పోలింగ్ స్టేషన్ నంబర్-రబ్బర్ స్టాంపు, బ్యాలెట్లు చించడానికి ఐరన్ స్కేలు, పేపర్ సీల్స్;నంబర్లు సరిచూసుకోవాలి. స్పెషల్ tags, మెటల్ సీల్, పోలింగ్ ఏజెంట్ఐడికార్డ్స్,  పోలింగ్ సిబ్బంది ఐడికార్డ్స్,  గుడ్డసంచి మరియు గోనెసంచి,  సూది,దారం, సీలింగ్ వేక్స్ ,అగ్గిపెట్టె, కొవ్వొత్తులు,  పుషర్,  బయటి పోస్టర్స్ 

అతి ముఖ్యమైన ఫారంలు:

1.Ballot paper account (Anx-20/Pg.No.121) 6 కాపీలకు తక్కువ కాకుండా ఉంటే మంచిది.
2.ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ (Anxr-19/Pg.No.118)
3.పేపర్ సీల్ అక్కౌంట్ (Anxr-8/Pg No.104)
4.PO డిక్లరేషన్ (Anxr-10,Pg.No.106)
5.విజిట్ రిపోర్టు (Anxr-23/Pg.125)

పోలింగ్ స్టేషన్ చేరిన తర్వాత చేయవలసినవి:

  • కుర్చీలు,బెంచీలు, బల్లలు పోలింగ్ కు అనుకూలంగా సర్దుకోవాలి.
  • ఓటింగ్ కపార్ట్ మెంట్ కట్టుకోవాలి.ఒకటి చాలు.ఓటర్ల సంఖ్య ఎక్కువనిపిస్తే రెండు ఏర్పాటు చేసుకోవాలి.
  • సిబ్బందికి ఐడికార్డ్స్ ఇచ్చి విధులు కేటాయించుకోవాలి.
  • బ్యాలట్ వెనుక వైపున పైన క్రింద  పోలింగ్ స్టేషన్ నెంబరు స్టాంపు వేసుకోవాలి.
  • బ్యాలట్ వెనుకవైపున PO sign చేసుకోవాలి.
  • Male/Femaleఓటింగ్ చూపించే నంబర్లు తెల్లకాగితంపై వేసుకునిఉంచుకోవడం/Ptrint పట్టుకుని వెళ్ళడం మంచిది.
  • పూర్తి చేయాల్సిన ఫారంలు, కవర్లపై పోలింగ్ స్టేషన్ నంబర్లు, పేర్లు వ్రాసుకోవడం
  • పోలింగ్ స్టేషన్ ఏరియా తెలిపే మరియు అభ్యర్థుల వివరాలు తెలిపే పోస్టర్లను  బయట గోడకు అంటించండం
  • పోలింగ్ ఏజెంట్లకు కబురుపంపడం
  • ఏజంట్లు వచ్చిన తరువాత ఏజంట్ ఫారంలు తీసుకుని వాటికి కేటాయించిన కవర్ లో ఉంచి వారి గుర్తింపు కార్డులతో సరిచూసుకున్న పిదప వారికి ఐడికార్డులు ఇవ్వడం. (Appointment of polling agents Anx-22,Pg.124)
  • ఉదయంఆరు గంటలకి ఖచ్చితంగా హాజరు కావలసిందిగా సూచించడం

పోల్ డే (08-4-2021):

బ్యాలెట్ పెట్టె సీలింగ్:

  • ఏజంట్లు వచ్చిన తరువాత పెట్టెలోపలి భాగం చూపి లోపల ఏమీ లేవని వారి చేత చెప్పించాలి.
  • బాక్స్ లోపల అడ్రస్ స్లిప్ (PO సంతకం;ఏజంట్ల సంతకాలు పెట్టి) వేయాలి.
  • పేపర్ సీల్ తీసుకుని తెల్లగా ఉన్నవైపు PO సంతకం పెట్టి ఏజంట్ల సంతకాలు పెట్టించాలి.
  • బ్యాలట్ పెట్టె కున్న whole పూర్తిగా కవర్ అయ్యేలా పెపర్ సీల్ ను జాగ్రత్తగా మడచుకుని అమర్చాలి.జరగకుండా చిన్నఅట్టముక్కను అమర్చాలి.
  • పెట్టె పై భాగంనకు green రంగు కనపడుతూ ఉండాలి.దాని పై పోలింగ్ స్టేషన్ నంబరు సూచించే Round stamp వేయాలి.
  • పెట్టెను మూసి semi lock చేయాలి.పూర్తిగా మూయరాదు.Ballot papers వేసే సన్నటి ద్వారం కనపడుతూ ఉండాలి.
  • పూర్తిగా మూసివేస్తే ముందు వేసిన paper seal చించి పెట్టెను మరలా తెరవాల్సి ఉంటుంది.
  • Semi lock చేసిన తరువాత తాత్కాలిక seal వేయాలి.పోలింగ్ ముగిసిన తరువాత ఈ సీల్ తీసి పెట్టెను మొత్తం మూసి మరలా శాశ్వత సీల్ వేస్తామని చెప్పాలి.
  • బాక్సు కు అడ్రస్ Tag కట్టి PO,ఏజెంట్లు సంతకాలు చేయాలి
  • వాడిన paper seal నంబరు నమోదు చేసుకోవాలి.
  • డిక్లరేషన్ లో ఏజెంట్లు సంతకం before commencement of poll వద్ద తీసుకోవాలి.
  • PO డైరీలో  పేపర్ సీల్,అడ్రస్ టాగ్ నెంబర్లు (ఉంటే) నమోదు చేసుకోవాలి.

Ready to start poll:

  • APO-marked copy
  • OPO-1:ఇంఢిలబుల్ ఇంక్ 
  • OPO-2: MPTC బ్యాలట్
  • OPO-3: ZPTC బ్యాలట్
  • 7am ఓటర్లను ఓటింగ్ హాల్లోకిఅనుమతించండి
  • ఓటరు గుర్తింపు ను EPIC లేదా 20 రకాల కార్డుల ద్వారా  check చేసిన మీదట ఓటరు స్లిప్ ఆధారంగా ఓటును ఇవ్వాలి.
  • ఓటర్ Male అయితే మార్కుడ్ కాపీలో ఓటర్ ఫోటోమరియు పేరు దగ్గర diagonal గా Red ink తో క్రాస్ మరియు ఓటర్ Female ఐతే Diagonal గా Red ink తో క్రాస్ మరియు నంబర్ వద్ద రెడ్ ఇంక్ తో రౌండప్ చేయాలి.
  • ఎడమచేతి చూపుడు వేలుకు ఇండిలబుల్  ink తో గుర్తు గోరుమధ్యనుండి వేలు కణుపు వరకు పెట్టాలి.
  • బ్యాలట్ కౌంటర్ ఫాయిల్ మీద ఓటర్ సీరియల్ నంబర్ మరియు గుర్తింపు నంబర్ వ్రాసి ఓటరు సంతకం/వేలిముద్ర తీసుకోవాలి.
  • ZPTC,MPTC ఓట్లు సమానంగా ఇస్తున్నారో లేదో check చేసుకుంటూ ఉండమనాలి.
  • ఓటింగ్ సమయంలో ప్రతీ ఓటరూ విధిగా రెండు ఓట్లు వేస్తున్నాడో లేదో కూడా చూసుకుంటూ ఉండాలి.
  •  ఛాలెంజ్ ఓటు:
  • ఓటర్ నిజం కాదని ఏజెంట్ చాలెంజ్ చేస్తే, చాలెంజ్ ఫీజు తీసుకొని , బి ఎల్ ఓ, తో నిజానిజాలు తెలుసుకుని నిజమైన ఓటరును ఓటుకు అనుమతించవచ్చు. లేదా పోలీసులకు అప్పగించాలి. వివరాలుఫారంలోనింపాలి. 1.Chalenge Fee Receipt:Anx-12/ Pg.111, 2.Complaint to Police:Anx-13/Pg.112, 3.Chalenge voters List:Anx-24/Pg.126
  • ఎవరైనా కళ్ళు కనబడని వారు, వయో వృద్ధులు వస్తే వారికి తోడుగా కంపెనీయన్ ను తెచ్చుకున్నట్లే తే కంపేనియన్ ఓటర్ వివరాలు ఫారం లలోనింపండి. ఇలాంటి కంపేనియన్ ను ఒకరిని ఒకసారి మాత్రమే అనుమతించవచ్చు. 1.Declaration:Anx-16/Pg.115 2.List:Anxr-25/Pg.127
  • టెండర్ ఓటు:
  • ఒక వ్యక్తి ఓటు వేయడానికి వెళ్లిన సందర్భంలో అప్పటికే  అతని ఓటు వేసినట్లుగా నమోదయిన సందర్భంలో సదరు వచ్చిన వ్యక్తి ఓటు వేస్తానని రుజువు చూపి పట్టుబడితే, అతనికి మళ్ళీ ఒక ఓటు ఇచ్చి న సందర్భాన్ని టెండర్ ఓటు అంటాము.. ఇది మీకిచ్చిన ఓట్ల బండిల్ లో చివరి నుంచి తీసి ఇచ్చి, అలాంటి ఓటును ఇవ్వబడిన saparate కవర్ లో ఉంచి సీల్ చెయ్యాలి..ఇలాంటి టెండర్ ఓట్లు మొత్తం ఆ బూత్ ఓటర్లలో 2 శాతానికి మించితే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలి. .List of tender votes: Anxr-28/Pg.130
  • ఎవరైనా ఓటర్ 18సంవత్సరాలు కు తక్కువ ఉన్నట్టు గా మీరు అనుమాన పడితే ఓటర్  డిక్లరేషన్ సంతకంచేయించి ఓటుకు అనుమతించండి. (Anx-14/Pg.113)

  • ఓటింగ్ జరుగుతున్నంతసేపు ప్రతి గంటకుఓటింగ్ శాతాన్ని మేల్ ఫిమేల్ వారిగా పై అధికారులకు తెలుపుటకు సిద్ధంగా ఉండండి
  • పోలింగ్ ఏజెంట్ లను చివరి గంటలో బయటికి వెళ్లకుండా చూడండి.
  • 5 గంటలకు ఎంతమంది అయితే వరుసలో నిలబడ్డారో వారికి సంతకంఛేేసిన స్లిప్పులు చివరినుండి  ఇవ్వండి తర్వాత వచ్చిన ఓటర్లను అనుమతించకండి

ఓటింగ్ ముగిసిన తరువాత:

  • డెక్లరేషన్ పై ఓటింగ్ ప్రక్రియ ముగిసినట్లుగా ఏజెంట్ల చె సంతకం చేయించండి.
  • తరువాత బ్యాలట్ పేపర్ అకౌంట్ లో అన్ని వివరాలు నింపి ప్రతి ఏజెంటు కు ఒకటి ఇవ్వండి, మీ దగ్గర మూడు కాపీలు ఉండేటట్టుగా చూసుకోండి.
  • పోలింగ్ ఏజెంట్లు సమక్షంలోనే  బాక్సునకు అడ్రస్ టాగ్ కట్టి లక్క సీల్ వేయండి.
  • అన్ని ఫారాలను పూర్తి ఛేపీ కవర్ల లో పెట్టండి.సీలు వేయవలసినవి వేయండి.
  • బ్యాలట్ పేపర్ అకౌంట్, POడైరీ మాత్రం అంటించకపోవడం మంచిది.
  • సీల్డ్ చేయవలసిన కవర్లకు మూడు ప్రక్కల సీల్ వేసుకోవడం.

Covers:

  • స్టాట్యుటరీ (BROWN) Pg. 92
  • స్టాట్యూటరీ (GREEN) Pg. 92
  • నాన్ స్టాట్యూటరీ(YELLOW) Pg.92
  • Other ( BLUE) Pg.93
  •  డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద వచ్చిన పోలింగ్ ఆఫీసర్లు సహకారంతో  మెటీరియల్ అప్పగించండి.

AP MPTC, ZPTC Elections 2021 - Presiding Officers PO Training Module User Manual Hand Book 

Download Male Female Count Sheet

Download PO Hand Book |PO, APO Duties |Training Material

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...