రేఖా సంఖ్య: ఇ.ఎస్.ఇ 02-28021/87/2020-ప్లానింగ్ తేది 31-3-2021
విషయం: పాఠశాల విద్యా శాఖ - "నవరత్నాలు" - జగనన్న అమ్మఒడి పథకం - 9-12 తరగతుల విద్యార్థులకు అమ్మఒడి పథకం ద్వారా నగదు బదులు లాప్ టాప్ లు అందించుట గూర్చి-ఇందు మూలముగా తగు సూచనలు జారీ చేయటం గురించి...
సూచిక:
1) ఈ కార్యాలయ ప్రొసీడింగ్స్ ISE:02-28021/27/2020 PI.G-CST., తేదీ : 09.12.2020 ప్రభుత్వ ఉత్తర్వులు సంఖ్య 63 పాఠశాల విద్యా శాఖ (ప్రోగ్రాం: 2) తేదీ. 28-12-2020 ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 79, పాఠశాల విద్యా శాఖ ప్రోగ్రాం: 2) తేదీ: 4.11.2019
ఆదేశములు:
రాష్ట్రములోని అందరు జిల్లా విద్యాశాభాధికారులు మరియు ప్రాంతీయ విద్యా శాఖాధికారులకు తెలియ చేయునది ఏమనగా, పైన సూచించిన సూచికలు 2 మరియు 3 ల నందు "నవరత్నాలు" లో భాగంగా "జగనన్న అమ్మ ఒడి" పథకం కింద ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2019-20 మరియు 2020-21 సంవత్సరాలకు గాను అర్హులైన 1 వ తరగతి నుండి 12 వ తరగతి (ఇంటర్ మీడియట్ ) చదువుతున్న విద్యార్థుల తల్లికి లేదా గుర్తించబడిన సంరక్షకుల వారికి సంవత్సరానికి రూ.15,000 - అర్థిక సహాయం అందిస్తున్నది. పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న అందరికి నాణ్యమైన విద్యకు గాను భరోసా ఇవ్వడంతో పాటు విద్యార్థుల హాజరుని నిరంతరం పరిశీలిస్తూ వారు మెరుగైన అభ్యాసన ఫలితాలను సాధించడం కోసం 1 నుండి 12 (ఇంటర్మీడియట్ విద్య) తరగతుల వరకు పిల్లల సర్వతోముఖ అభివృద్ధికి గాను అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వం పటిష్టంగా అమలు పరుస్తూ ఉన్నది.
కాగా, రానున్న విద్యాసంవత్సరం నుండి, అనగా, 2021-22 సంవత్సరం నుండి, అమ్మకడి పథకం ద్వారా ఆర్హులైన 9 తరగతుల విద్యార్థుల తల్లులకు వారి విద్యార్థుల విద్యావికాసం కోసం ఎవరైనా తల్లులు నగదు బదులు లాప్ టాప్ లు కోరుకున్నట్లయితే వారికి లాప్ టాపులు అందించడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వం తీసుకున్ను ఈ నిర్ణయాన్ని అర్హులైన తల్లులందరికి తెలియపరిచి, వారు అమ్మ ఒడి కింద సహాయం నగదు రూపేణా కోరుకుంటున్నారా లేక లాప్ టాప్ ల రూ పేడా కోరుకుంటున్నారా తెలుసుకోవటం కోసం గౌరవనీయ ముఖ్యమంత్రిగారు తల్లుల్ని ఉద్దేశించి ఒక లేఖ రాసారు, ఆ లేఖ ప్రతిని దీనివెంట జతపరుస్తున్నాం ..
కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి ఉత్తరమును అమ్ముఒడి పథకం కింద అర్హులైన 9-12 విద్యార్థుల తల్లులందరికీ అందిస్తూ, వారి అభీష్టం తెలుసుకుని తిరిగి ప్రభుత్వానికి తెలియపరచటం కోసం అందరు జిల్లా విద్యాశాఖాదికారులు మరియు ప్రాంతీయ విద్యా శాఖాది కారులకు ఈ క్రింది సూచనలు ఇవ్వడమైనది.
- ఈ ఉత్తర్వులకు పి. డి. ఎఫ్. రూపములో జతపరిచిన సదరు లేఖను డి.సి. య. బీ, ల ద్వారా 10- 4-2021 లోపుగా ముద్రించాలి.www.gsrmaths.in
- ఆ విధంగా ముద్రించిన లేఖను మండల విద్యా శాఖాధికారుల ద్వారా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మరియు కళాశాలల ప్రిన్సిపాళ్ళకు విద్యార్థుల సంఖ్య ను అనుసరించి 16 4-2021 లోపుగా అందించాలి.
- ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు కళాశాలల ప్రధా నాచార్కులు అందరు కూడా తమ విద్యాసంస్థల్లో 9 నుండి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులతో 19-4-2021 న సమావేశం ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి పర్యుల వారి లేఖలోని అంశాలను విద్యార్థులకు చక్కగా విశదీకరించాలి. విద్యార్థులు ఆ లేఖను ఇంటికి తీసుకుని వెళ్ళి తమ తల్లులకు లేదా సంరక్షకులకు చూపించి వారి అభీష్టాన్ని తెలుసుకుని ఆ లేఖ పైన రాయించి తిరిగి ఆ లేఖను 122-4-2021 నాటికి ప్రధానోపాధ్యాయులకు అండ చెయ్యాలి.
- ఈ ఆ విధంగా విద్యార్థులు తమకు తిరిగి ఇచ్చిన అంగీకార పత్రములోని అంశాలను ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాద్యాయులు మరియు కళాశాలల ప్రధా నాచార్యులు స్వీయ పర్యవేక్షణలో అమ్మ ఒడి వెబ్ సైటు నందు 26-4-2021 లోపుగా పొందుపరచాలి. ఆ విధంగా పొందుపరిచిన తర్వాత, ఆ అంగీకారపత్రాలను పాఠశాల, కళాశాల రికార్డులో భద్రపరచాలి.
అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమాన్ని నిర్దేశించిన సమయములో పూర్తిచేయడానికి వీలుగా జిల్లా విద్యాశాభాధికారులు మరియు ప్రాంతీయ విద్యా శాఖాధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ క్రింది స్థాయి సిబ్బందికి తగుసూచనలు అందిస్తూ జయప్రదంగా పూర్తిచేయ్యాలి.
Download proceedings | CM Letter, Mother declaration