ఆర్.సి.నెం.SS-16021/8/2020-CMO SEC-SSA తేది:04/01/2021 పాఠశాల విద్యాశాఖ - జగనన్న విద్యా కానుక- యూనిఫాం క్లాత్ మరింత ఖచ్చితంగా సరఫరా చేయడానికి వీలుగా పిల్లల ఎత్తు నమోదు చేయుట గురించి జిల్లా విద్యా శాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లకు మార్గదర్శకాలు - జారీ
విషయం:
జగనన్న విద్యా కానుక' కిట్ లో భాగంగా ఒకటి నుండి పదో తరగతి వరకు ప్రభుత్వ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మూడు జతల యూనిఫారాలు ఇస్తున్న విషయం తెలిసిందే. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం యూనిఫాం క్లాత్ మరింత ఖచ్చితంగా సరఫరా చేయడానికి వీలుగా రాష్ట్రవ్యాప్తంగా పిల్లల ఎత్తు (సెంటీమీటర్లలో)ను సేకరించాలని నిర్ణయించడం జరిగింది
ప్రస్తుతం ఆరు నుండి పదవ తరగతి వరకు విద్యార్ధులు పాఠశాలలకు వస్తున్నారు కావున ప్రధానోపాధ్యాయులు అందరూ ఆయా పాఠశాలల్లోని పిల్లల ఎత్తు వివరాలు ప్రధానోపాధ్యాయుని లాగిన్ లో ఇచ్చిన లింక్ లో (https://schooledu.ap.gov.in/CHILDINFOSERVICES) నమోదు చేయవలసిందిగా కోరడమైనది
అలాగే ఒకటి నుండి ఐదో తరగతి వరకు విద్యార్థుల కొలతలు తీసుకోవడానికి పిల్లలను ఒకరోజు పాఠశాలలకు పిలిచి ఆయా క్లాస్ టీచర్లకు ఆ పనిని కేటాయించాలి, ప్రస్తుత కోవిడ్ నిబంధనలను అనుసరించి ఈ పనిని పూర్తి చేయాలి
సూచనలు:
- మొదటిగా ఒక గోడపై సెంటీమీటర్లలో ఎత్తు తెలిసేలా 190 సెంటీమీటర్ల వరకు నోట్ చేసి పెట్టాలి.
- పిల్లల ఎత్తు తీసుకునేటపుడు వారు నిటారుగా ఉండేలా చూడాలి
- పిల్లల ఎత్తు సెంటీమీటర్లలో ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి
- ఒక తరగతికి సంబంధించిన పిల్లలందరి ఎత్తు వివరాలు ఒక పేపర్ పైన ముందు రాసి పెట్టుకుంటే లింక్ లో నమోదు చేయడం సులభం అవుతుంది.
- వ్యాయామ ఉపాధ్యాయులు, సిఆర్పీ ల సహాయంతో ఎత్తు కొలవడం, నమోదు చేయడం పూర్తి చేయాలి
- పిల్లల ఎత్తు వివరాలను సెంటీమీటర్లలో ప్రధానోపాధ్యాయుని లాగిన్ లో ఇచ్చిన లింక్ లో (https://schooledu.ap.gov.in/CHILDINFOSERVICES) ఖచ్చితంగా నమోదు చేయాలి
సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు, జిల్లా సీఎంవోలు విద్యార్థుల ఎత్తు సమోదు ప్రక్రియను త్వరగా పూర్తి చేసేలా అందరు మండల విద్యాశాఖాధికారులకు, ప్రదానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేయాలి
రాష్ట్రంలోని అందరు జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్లు పూర్తి శ్రద్ధతో పై ఆదేశాలను అత్యంత జాగరూకతతో అమలు చేయవలసిందిగా ఇందుమూలంగా ఆదేశించడమైనది
గమనిక: 'జగనన్న విద్యా కానుక 2021-22' వర్తించే పాఠశాలల యాజమాన్యాల వివరాలు అనుబంధం-1 లో ఇవ్వబడ్డాయి.