Rc.No.ESE02/811/2020-PLG - CSE dt.25/11/2020
విషయము: పాఠశాల విద్య విద్యార్థులలో మాతృభాష మీద పెంపొందించుట ద్వారా తెలుగు భాష పరిరక్షణ మరియు వ్యాప్తి - పాఠశాలల్లో క్విజ్ నిర్వహణ - ఆదేశాలు ఇచ్చుట గురించి
సూచిక: దాసుభాషితం, తెలుగు లలిత కళా వేదిక వారి ప్రతిపాదనలు.
ఉత్తర్వులు:
పై సూచిక ద్వారా దా సుభాషితం, తెలుగు లలిత కళా వేదిక వారు రాష్ట్రంలోని పదవ తరగతి బాలబాలికలకు మాతృభాష మీద ఆసక్తి అనురక్తి పెంపొందించే ఉద్దేశంతో వరుసగా ఈ 3 వ సంవత్సరమూ 'CPB SPB తెలుగు పోటీ' నిర్వహింప తలపెట్టాము అని తెలియపరిచారు. వివరాలను 'CPB - SPB తెలుగు పోటీ 2020' అనే పోస్టర్ నందు జత పరచడమైనది మరియు బహుమతుల వివరాలు కూడా జతపరచడమైనది. పూర్తి వివరాలు కోసం ఈ దిగువ లింక్ ద్వారా గమనించమని కోరారు https://www.dasubhashitam.com/brown-spb-telugu-potee/about.
పోటీ నమోదు ఆఖరు తేదీ: December 10, 2020
పోటీ తేదీ: December 13, 2020, విజేతల ప్రకటన : December 20, 2020.
కావున పై అంశాలను జిల్లా విద్యా శాఖాధికారులు తమ తమ పరిధిలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియపరచి పదవ తరగతి విద్యార్థులు ఈ క్విజ్ నందు పాల్గొనున్నట్లు ప్రోత్సహించవలసిందిగా కోరడమైనది. ఇందుతో జతపరచిన పోస్టర్, విధివిధానాల సమగ్ర సమాచారం అన్ని ఉన్నత పాఠశాలలకు, చేరే విధంగా చూడగలరు.