- జిల్లా సెలక్షన్ కమిటీ ప్రాధమికంగా ఎంపిక చేసిన అభ్యర్ధులకు సూచన గ్రామ సచివాలయ పోటీ పరిక్షలో నిర్ణీత మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్ధుల జాబితా నుండి వారి యొక్క రాంక్, లోకల్/ నాన్ లోకల్, పొస్ట్ ప్రాధాన్యత, మహిళా రిజర్వేషన్, సామాజిక వర్గం, వైకల్యం, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు స్పోర్ట్స్ కోటా ల ఆధారంగా జిల్లా కలక్టరు నేతృత్వం లోని జిల్లా సెలక్షన్ కమిటీ పరిశీలన చేసిన అనంతరం ప్రాధమికంగా ఎంపిక అయిన వారికి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కొరకు నిర్ణీత ప్రదేశంలో హాజరు కావలసిందిగా ఎస్.ఎం.ఎస్ మరియు ఇ మెయిల్స్ ద్వారా అభ్యర్ధులకు సమాచారము పంపట మైనది.
- గ్రామ సచివాలయం వెబ్ సైట్ నుండి అభ్యర్ధులు తమ హాల్ టికెట్ నంబరు మరియు పుట్టిన తేది ఆధారంగా కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకొనవచ్చు. కాల్ లెటర్ పొందిన అభ్యర్ధులు తమ దరఖాస్తు ఫారం, 4 నుండి 10వ తరగతుల స్టడీ సర్టిఫికెట్స్, విద్యార్హతలు, కులం, స్పోర్ట్స్ / వికలాంగత్వం/ ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికెట్స్, యాంటిసిడెంట్ ఫారం మరియు తదితర సర్టిఫికెట్స్ ను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసుకోవలెను.
- ఆ విధంగా అప్ లోడ్ చేసిన సర్టిఫికెట్స్ ను మరల వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని, వాటిని ప్రింట్ చేసుకొని, వెరిఫికేషన్ సమయంలో అధికారులకు రెండు ప్రతులు అందచేయవలెను.
Download Post wise Selected Candidates
Download Call letter