ఆర్.సి.నెం.SS-16021/8/2020-MIS SEC-SSA తేది: 16-10-2020
విషయం:
సమగ్ర శిక్షా - జగన్నన విద్యా కానుక - స్టూడెంట్ కిట్ లోని వస్తువులలో బూట్లు సైజు సరిపోకపోయినా, బ్యాగులు డ్యామేజ్ ఉన్నా మార్పు చేయడం కొరకు - జిల్లా విద్యాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లకు మార్గదర్శకాలు జారీ
నిర్దేశం:
1.సమగ్ర శిక్షా వారి ఉత్తర్వులు ఆర్.సి.నెం.SSA-16021/8/2020-MIS SEC-SSA, తేది:17-07-2020
2.పాఠశాల విద్యాశాఖ వారి ఉత్తర్వులు:ఆర్.సి.నెం.151/A&I/2020 తేది:06 -10-2020
ముఖ్య గమనిక:
జగనన్న విద్యా కానుక' కిట్ లో భాగంగా విద్యార్థులకు ఇచ్చిన బ్యాగుల జిప్పులు సరిగా పని చేయట్లేదని అక్కడక్కడ వినిపిస్తోంది. దీనికి సంబంధించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందకుండా మళ్లీ మార్పు చేసుకోవచ్చని సమగ్ర శిక్షా నుంచి (ఆర్.సి.నం.SSA-16021/8/2020-MIS SEC-SSA తేది: 17 -07-2020), పాఠశాల విద్యా శాఖ నుంచి (ఆర్.సి.నెం.151/A&I/2020 తేది 06-10-2020) ఉత్తర్వులు జిల్లా విద్యాశాఖాధికారికి, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేట్లు ఇమెయిల్ ద్వారా పంపించడమైనది.
ఇలాంటి సందర్భాలు ఎదురైన ప్రాంతాల్లో ఆయా మండల రిసోర్సు కేంద్రం అధికారులు కింది పట్టికలో ఇచ్చిన జిల్లాలవారీ సరఫరాదారులకు సంబంధించిన వ్యక్తులను సంప్రదించి డ్యామేజ్అ యిన వస్తువులను మార్చి సరిగా ఉన్న వస్తువులను విద్యార్థులకు అందజేయాలి.
జగనన్న విద్యా కానుక' కిట్ల సరఫరాలో తదుపరి ఎలాంటి సమస్యలు ఎదురవ్వకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకునేలా ఈరోజు సాయంత్రం లోపు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు ఇవ్వాలి.
జగనన్న విద్యా కానుక' స్టూడెంట్ కిట్ ప్రతి విద్యార్థి తప్పకుండా అందేలా సక్రమ చర్యలకు సిద్ధం కావాలని రాష్ట్రంలోని అందరు జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్లు పూర్తి శ్రద్ధతో పై ఆదేశాలను అత్యంత జాగరూకతతో అమలు చేయవలసిందిగా ఇందు మూలంగా ఆదేశించడమైనది.