ఆర్.సి.నెం. SS-15024/65/2020-SAMO తేది: 6-8-2020 విషయం - సమగ్ర శిక్షా - పాఠశాల గ్రంథాలయాలు - జిల్లా స్థాయిలో ఉపాధ్యాయులు, సాహితీవేత్తలు రచయితలతో, విద్యార్థులకు 'బాలసాహిత్యం - పాఠశాల గ్రంథాలయాలు' రూపకల్పన- గురించి సూచనలు ఉత్తర్వులు ఇవ్వడమైనది.
ప్రతి పాఠశాలలో 'గ్రంథాలయం' యొక్క అవసరాన్ని జాతీయ పాఠ్య ప్రణాళిక ముసాయిదా, 2005 మరియు ఉచిత మరియు నిర్బంధ విద్య పిల్లల హక్కు చట్టం 2009 ద్వారా గుర్తించబడింది. గ్రంధాలయం పాఠశాల యొక్క ముఖ్యమైన భాగం. ఆనందకరమైన అభ్యాసం కోసం వనరులను మాత్రమే అందివ్వడమే కాక , పిల్లలకు స్థిరమైన వల్ల నైపుణ్యాలను అందిస్తూ, వారిలో కుతూహలాన్ని రేకెత్తించి స్వతంత్ర పాఠకులుగా మార్చుతుంది.
జాతీయ మదింపు సర్వే 2017 ద్వారా, పాఠశాల గ్రంథాలయంలో గడువు కథల పుస్తకాలు చదివిన పాఠశాల పిల్లలు ఉన్నత స్థాయి అభ్యసనాలను కలిగి ఉన్నారని స్పష్టంగా నిర్ధారణ అయ్యింది
2018-19 సంవత్సరం నుండి సమగ్ర శిక్షా కింద 1 తరగతి నుండి 12 తరగతి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలలకు గ్రంథాలయ నిధులు మొదటిసారి అందించబడ్డాయి. పిల్లలకు పఠనం మరియు అభ్యసనం శాశ్వతంగా నిలిచిపోవాలని చేసే ప్రయత్నంలో గ్రంథాలయం మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి మరియు కొత్త పుస్తకాలు గ్రంథాలయంలో అందివ్వడానికి ఈ కింది సూచనలు చేయబడ్డాయి.
సమగ్ర శిక్షా పథకంలో అమలులో భాగంగా పాఠశాల విద్యలో గ్రంథాలయం దాని ప్రాముఖ్య త గురించి పూర్వ ప్రాథమిక విద్య నుంచి ఉన్నత పాఠశాల వరకూ గ్రంథాలయాల ఏర్పాటు చేసి విద్యార్థుల్లో పఠనాశక్తిని ఎంచి తద్వారా వారిలో గుణాత్మక మార్పు తీసుకురావడం ముఖ్యోద్దేశం.
***********