APGPCET 2020 ANDHRA PRADESH GURUKULA PATASALALA COMMON ENTRANCE TEST-2019) NOTIFICATION FOR ADMISSION INTO V CLASS in all AP Social Welfare / AP Tribal Welfare / MJP AP Back ward Classes Welfare Residential Institutions for the Academic Year 2020-2021
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (APSWREIS) 5 వ తరగతి ప్రవేశము కొరకు ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో 2020-21 విద్యా సంవత్సరానికి గాను లాటరీ పద్ధతి ద్వారా 5వ తరగతి (ఇంగ్లీష్ మాద్యమం) లో ప్రవేశమునకు బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను తేది : 14.08.2020 నుండి 31.08.2020 వరకు ఆన్ లైన్ లో apgpcet.apcfss.in ద్వా రా సమర్పించాలి. ఇతర సమాచారం కొరకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు జిల్లా సమన్వయ కర్తలను సంప్రదించగలరు
ప్రవేశానికి అర్హత:
వయస్సు:
- యస్.సి. మరియు యస్.టి ( SC, ST) విద్యార్థులు 11-09-2007 నుండి 31-08-2011 మధ్య పుట్టి ఉండాలి. ఒ సి., బి.సి. యస్.సి. కన్వర్టర్ క్రిస్టియన్ (బి.సి.-సి) విద్యార్థులు 01- 09-2009 నుండి 31-08-2011 మధ్య పుట్టి ఉండాలి.
- 2019-20240 విద్యా సంవత్సరం ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 4వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
- విద్యార్థులు తమ సొంత జిల్లాలో మాత్రమే ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 3 మరియు 4వ తరగతులు చదివి ఉండాలి.
ఆదాయ పరిమితి:
అభ్యర్థి యొక్క తల్లి, తండ్రి / సంరక్షకుల సంవత్సరాదాయము (2019-20) రూ. 1,00,000/- మించి ఉండరాదు
రిజర్వేషన్ల వివరాలు:
- అన్ని గురుకుల విద్యాలయాల్లో S.C - 75%, S.C. కన్సర్ట్ క్రిస్టియన్లు - 12%, S.T - 6%, B.C - 5% మరియు ఇతరులకు 2% సీట్లు కేటాయించబడినవి. ప్రత్యేక కేటగిరి (ప్రమాదకర కర్మాగారాల్లో పని నుండి తీసివేయబడిన పిల్లలు, వెట్టి చాకిరి నుండి బయట పడ్డ పిల్లలు. జోగినులు, బసవిన్లు, అత్యాచార బాధితులు, అనాధలు మరియు సైనిక ఉద్యోగస్తుల పిల్లలు క్రింద 15% సీట్లు కేటాయించబడినవి.
- వికలాంగులకు 3% సీట్లు కేటాయించబడినవి.
- ఏదైనా కేటగిరీ సీట్లు భర్తీ కాని యెడల, వాటిని S.C కేటగిరి విద్యార్థులకు కేటాయిస్తారు.
- 2020-21 విద్యా సంవత్సరానికి గాను, 5వ తరగతిలో లాటరీ పద్ధతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోదలిచిన విద్యార్థులు దగ్గరలోని ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ ద్వారా గాని (లేదా) దగ్గరలోని సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఏర్పాటు చేయబడిన సహాయ కేంద్రం ద్వారా గాని ఆన్ లైన్ apgpcet.apcfss.in లో తేదీ 14.08.2020 ముండి 31.08.2020 వరకు దరఖాస్తులు సమర్పించాలి.
- ఎటువంటి దరఖాస్తు రుసుము స్వీకరించబడదు.
- ఆన్ లైన్ దరఖాస్తులో విద్యార్థి 5వ తరగతిలో చేరుటకు ఎంచుకొన్నపాఠశాల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి.
- దరఖాస్తును నింపునపుడు అభ్యర్థి అన్ని వివరాలను జాగ్రత్తగా నమోదు చేయవలెను. తదుపరి
- ఏ విధమైన మార్పులు చేయబడవు.
- దరఖాస్తు నింపుటలో జరుగు పొరపాట్లకు అభ్యర్థి పూర్తి బాధ్యత వహించాలి.
- ఒకసారి దరఖాస్తు అప్ లైన్ లో అప్ లోడ్ చేసిన తరువాత ఎటువంటి మార్పులు తదుపరి పరిగణించబడవు.
- 2020-2021 విద్యా సంవత్సరమునకు అన్ని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో బాలురు మరియు బాలికలు ఎంపిక, ఆన్ లైన్ విధానంలో " లాటరీ " పద్ధతి ద్వారా జరుపబడును. ఎటువంటి ప్రవేశ పరీక్ష ఉండదు.
- ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ప్రభుత్వం ద్వారా విద్యార్థులకు
- అందిస్తున్న సౌకర్యాల వివరాలు పట్టిక వందు ఇవ్వబడినవి.