ఏపీలో ‘ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి’ ఉత్తర్వులు రద్దు.
G.O No 81,85 ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేసిన జీవోలను కొట్టి వేసిన హై కోర్టు.
అమరావతి: ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఏ మాధ్యమంలో చదవాలన్న అంశం విద్యార్థుల నిర్ణయానికి వదిలేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న హైకోర్టు ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.81, 85లను రద్దు చేసింది. సుదీష్ రాంబొట్ల శ్రీనివాస్, గుంటుపల్లి శ్రీనివాస్ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది.