3 నెలల పొడగింపు..9 నెలల చెల్లింపు.
మూడు నెలలకు చెల్లించవలసిన వడ్డీ అసలుకు కలపడం జరుగుతుంది.
కరోనా వైరస్, ప్రపంచ దేశాలన్నిటిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అన్ని వ్యవస్థలు కుదేలవుతున్నాయి. ఇందులో భారత దేశం కూడా ఉంది. అందువలన కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించాయి . అత్యవసర మినహా అన్ని వస్తుసేవల ఉత్పత్తి, సరఫరాలు నిలిచిపోయాయి. దీనివలన చిన్న తరహా పరిశ్రమలకు చాలా పెద్ద ఆర్ధిక నష్టం. ఆదాయం ఉండదు. దాని వలన నగదు లభ్యత ఉండదు . అలాగే ఉద్యోగులకు జీతాలు సమయానికి లభించకపోవచ్చు. వీటిని దృష్టిలో ఉంచుకునిరిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా కొన్ని వెసులుబాట్లు కల్పించింది. అందులో ముఖ్యమైనది…
ఈఎంఐ చెల్లింపులు:
బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్థలు తమ రుణగ్రహీతలకు వాయిదా చెల్లింపులను మూడు నెలలకు పొడిగించింది (మారటోరియం పీరియడ్ ). అంటే మార్చి 1, 2020 నాటికి ఉన్న బాకీలు మే 31, 2020 వరకు చెల్లించనవసరం లేకుండా వెసులుబాటు కల్పించాయి. అయితే ఈ కాలంలో వీటిపై వడ్డీ వర్తిస్తుంది. ఇలా చెల్లించలేని వాయిదా ఫై క్రెడిట్ స్కోర్ప్రభావం కూడా ఉండదని స్పష్టం చేసింది.ఇది ఉద్యోగులకు, అల్పఆదాయ వర్గాల వారికి ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యం గృహ రుణం తీసుకున్న వారికి, వారి ఆదాయంలో అధికమొత్తం ఈఎంఐ లకు పోతుంది.
మరొక కోణం:
ఈ పొడిగింపు తాత్కాలిక లాభాన్ని చేకూర్చినా, దీర్ఘకాలంలో ఎటువంటి ప్రభావం చూపుతుందో ఈ కింది పట్టిక ద్వారా తెలుసుకుందాము.
HOME-LOAN-TABLE
ఉదా: శేఖర్ రూ.10 లక్షల గృహరుణం (A), 15 ఏళ్లకు(180 నెలలు) , 9 శాతం వడ్డీకి తీసుకున్నాడు. అతని ప్రస్తుత ఈఎంఐ రూ.10,143(D). దీనిపై అతడు పూర్తి కాలంలో చెల్లించే మొత్తం వడ్డీ రూ.8,25,680 (B) . అందువలన పూర్తి కాలానికి చెల్లించే మొత్తం రూ.18,25,680 ©. ప్రస్తుతం లభిస్తున్న మూడు నెలల పొడిగింపు వలన , అతడు ఎటువంటి ఈఎంఐ లు చెల్లించడు . కాబట్టి, ఈ మూడు నెలలకు చెల్లించవలసిన వడ్డీ రూ.22,669(E) . దీనిని అసలుకు కలపడం జరుగుతుంది. అప్పుడు జూన్ 1, 2020 నాటికి అతని అసలు బాకీ రూ.10,22,669 (F) కి చేరుతుంది. అప్పటినుంచి ఈ మొత్తాన్ని చెల్లించటానికి అదనంగా మరో 9 నెలలు పెరుగుతుంది. అంటే 189 నెలలు అవుతుంది. ఈ 189 నెలల కాలంలో అతడు చెల్లించే వడ్డీ రూ.8,93,281 (G). అంటే అతడు చెల్లించే మొత్తం రూ. 19,15,950 (H). అధికంగా చెల్లించే మొత్తం రూ.90,270(I).
ఒకవేళ శేఖర్ మూడు నెలల మినహాయింపు తరువాత, అంటే జూన్ 1, 2020 నుంచి 180 నెలలకు మాత్రమే చెల్లించాలనుకుంటే తన ఈఎంఐ ని రూ 10,373 (J) మార్చుకోవాల్సివుంటుంది .
పట్టికలో ఇచ్చిన అంకెల అవగాహన కోసం, అంకెల తరువాత బ్రాకెట్ లలో ఆంగ్ల అక్షరాలను పొందుపరిచాము.
ముగింపు:
ఫై తెలిపిన వివరాలు అవగాహన కోసం తయారుచేయబడినది. అందుకోసం వివిధ మొత్తాలకు కూడా చూపించడమైనది . ప్రతి రుణగ్రహీత మార్చి 1, 2020 నాటికి ఉన్న బాకీని పరిగణించి, దానిపై 3 నెలల వడ్డీని కలిపి లెక్కించవచ్చు. తద్వారా తమపై పడే అదనపు వడ్డీని తెలుసుకోవచ్చు. ఇదే పద్దతిలో వివిధ మొత్తాలకు 20 ఏళ్ల కాలపరిమితికి , వర్తించే అదనపు వడ్డీ గురించి మరో కధనంలో తెలుసుకుందాం.
Source: Eenadu Siri