TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Saturday 25 April 2020

APGLI Policy Complete Details, Bond, Slips, Forms, Imp Orders

APGLI Policy Complete Details, Bond, Slips, Forms, Imp Orders APGLI Annual Account Slips APGLI Bonus Calculator Find / Search Your APGLI Policy No Download APGLI Policy Details, Sum Assured Download APGLI Bond APGLI All type of Applications with Covering Letters APGLI Loan Eligibility Calculator


APGLI  Andhra Pradesh Govt Life Insurance

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణ వయస్సు 60 సం॥ల నుండి 62 సం॥లకు పెంచడం మరియు 2022 వేతన స్కేళ్ళు అమలు చేసినందున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా (ఎపిజిఎల్ఎస్ఐ) పథకం నూతన నిబంధనలు, ప్రీమియం పెంపుదల అమలు చేస్తూ జిఓ ఎంఎస్ నం. 198 ఆర్థిక తేదీ 18.10.2022 విడుదల చేయడం జరిగింది.


ఉత్తర్వులలోని ముఖ్య అంశాలు:

వయోపరిమితి:

ఉద్యోగుల, ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణ వయస్సు ప్రభుత్వం పెంచినందున ఈ ఉత్తర్వుల ద్వారా ఏపిజిఎల్ఎస్ఐ ప్రీమియం ప్రారంభం / పెంపుదల చేసుకొనే వయోపరిమితి 55 సం.ల నుండి 57 సం॥ల వరకు పెంచడమైనది. 57 సం||లు దాటిన వారు: ప్రీమియం ప్రారంభం / పెంపుదలకు అవకాశం లేదు. ఎవరైనా అటువంటి వారు ప్రీమియం మినహాయింపు చేసినా ఆ మొత్తానికి బాండు ఇవ్వరు. 57 సం||లలోపు వారు ప్రీమియం ప్రారంభం / పెంపుదల చేసుకొన్నప్పటికీ ప్రతిపాదనలు 57 సం॥ల తర్వాత పంపితే ఆ ప్రతిపాదనలను అంగీకరించరు.

ప్రతిపాదనలు ఎపిజిఎల్ఎస్ఐ కార్యాలయానికి చేరినప్పటి నుండి బీమా వర్తిస్తుంది. ఆలస్యంగా ప్రతిపాదనలు పంపితే అప్పటి వరకు బీమా పరిధిలోకి రారు.


ప్రీమియం:

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయులకు 2022 వేతన స్కేళ్ళు అమలులోకి వచ్చినందున ప్రీమియం శ్లాబులు మార్పు చేయడం జరిగింది. 2022 వేతన స్కేళ్ళలోని మూలవేతనం ఆధారంగా ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. ఈ ప్రీమియంలు అక్టోబర్ 2022 వేతనాల నుండి తగ్గింపు చేయాలి.

ఒక ఉద్యోగి గరిష్టంగా తన మూలవేతనంలో 15% వరకు ప్రీమియం పెంచుకోవచ్చు. (గతంలో 20% ఉండేది)

ఉద్యోగి తన మూలవేతనంలో 8%కన్న ఎక్కువగా ప్రీమియం పెంచిన సందర్భాలలో గత 3 సం||లలో వైద్య కారణము లచే పెట్టిన సెలవుల వివరాలు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ లేదా తత్స మాన ప్రభుత్వ వైద్యాధికారిచే జారీ చేయబడిన గుడ్వెల్త్ సర్టిఫికెట్ జతపరచ వలసి ఉంటుంది.

గమనిక:

1. కొత్తగా ఉద్యోగంలో చేరిన ఉద్యోగి మొదటి నెల జీతంలో అతని మూలవేతనమునకు సంబంధించిన ప్రీమియం మాత్రమే చెల్లించాలి. ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి అయిన తదుపరి పెంపుదల చేసుకోవచ్చు.

2. గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులు, క్యాన్సర్ సంబంధిత వ్యాధులతో బాధపడే వారు, వారి మూలవేతనమునకు సంబంధించిన ప్రీమియం మాత్రమే చెల్లించాలి. వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడు పొందిన పాలసీలు యధావిధిగా అమలులో ఉంటాయి.


ముఖ్యమైన విషయాలు:

1. ప్రతిపాదనలపైన డిడిఓ (గెజిటెడ్) సంతకం ఉండాలి. డిడిఓ గెజిటెడ్ కాకపోతే పై గెజిటెడ్ అధికారి సంతకం చేయాలి. దరఖాస్తు దారుడు గెజిటెడ్ అయితే మరొక గెజిటెడ్ అధికారి సంతకం చేయాలి.

2. ప్రీమియం పెంచిన 3 సం॥లోపు మరణిస్తే అన్ని ప్రీమియంలు కలుపు కుని క్లబ్ రేటు పరిధిలో ఉంటే సాధారణ మరణ క్లయిమ్ లాగానే పరిష్కరిస్తారు. అన్ని ప్రీమియంలు కలిపి శ్లాబ్ రేటుకున్న ఎక్కువవుంటే మెడికల్ లీవు వివరాలు, డిపార్ట్మెంట్ డెత్ సర్టిఫికెట్ అడుగుతారు.

3. అంగవైకల్యం / 100% దృష్టిలోపం ఉన్న వారికి సాధారణ పాలసీదారుల మాదిరిగానే పాలసీలు మంజూరు చేస్తారు.

APGLI Scheme is a Social Security Measure for the welfare of the Government employees and is mandatory for all Government employees and provincialized Local Body employees.
  • The Government employees who are between 21 and 53 years of age are eligible for taking APGLI Policies.
  • The APGLI Department issues only Endowment Policies which mature one day before attaining 58 years of age.
  • APGLI policies do not lapse.
  • The Premium rates are low.
  • Attractive Bonus rates.
  • The present rate of Bonus is Rs 100/- for every Rs 1000/- Sum Assured per annum.
  • The Loans are sanctioned up to 90% of Surrender Value.
  • Only Simple Interest of 9% per annum is charged against loans sanctioned.
  • In case of maturity of the policy, the total Sum Assured and Bonus till Date of Maturity are paid to the policy holder.
  • The Policies are exempted from attachment of the court of law as well as Govt. dues, except the arrears of premium or loan etc.,
  • If the Policy Holder ceases to be Government servant, and decides to surrender the policy by discontinuing the payment of Premium, the subscriber will be paid the Surrender Value and the eligible Bonus.
  • In case of Death of policy holder before maturity of the policy, the full Sum Assured along with Bonus till date of death are paid to the legal heirs
  • APGLI Premium is exempted from income tax under section 80C.
APGLI New Slab Rates 2022 PRC 2022 GO 198 dt. 18.10.202 w.e.f 01.11.2022:


The minimum compulsory subscription is fixed around 4% of the basic pay however slab rates are introduced w.e.f. 1994 onwards.


Revised APGLI Slab Rates (Basic Pays)
Monthly Premium (Rs.)
Pay from Rs.20000 to Rs.25220
800/-
Pay from Rs.25221 to Rs.32670
1000/-
Pay from Rs.32671 to Rs.44570
1300/-
Pay from Rs.44571 to Rs.54060
1800/-
Pay from Rs.54061 to Rs.76730
2200/-
          Pay from Rs.73761 and above
3000/-


A person whether superior grade employee or Office Subordinate employee who desires to pay more may be allowed to contribute upto 20% of his pay subject to medical examination at the discretion of the Director of Insurance.[G.O.Ms.No.26 Finance & Planning (FW.Admn-II) Dept., dated 22.02.1995.] Subject to some conditions the Good health certificate should be produced by the proponent if he desired to enhance the premium above compulsory slab rates.


Except as provided in rule 22, the premium for insurance effected shall be payable monthly and shall be recovered by deduction from the pay of the insured every month. .(G.O.Ms.No. 318, Finance (Pen.I) Dept. dated 20.09.1964 w.e.f. 21.02.1963) The Drawing & Disbursing Officers concerned are solely responsible for effecting the recovery of revised premium time to time from all the eligible employees i.e., who are between 22 to 55 years of age, duly forwarding the requisite proposal forms and obtaining the requisite policies from the Insurance Department. G.O.Ms.No. 36, Finance Admin DI&IF) Dept. dated 5.3.2016 Under any circumstances proposal shall not be accepted if the applicant has already attained the age of (55) years on the date of submission of his application, notwithstanding the fact that the amount was already deducted in the monthly pay hills. Such amounts shall be treated as unauthorized amounts and refunded to the individual following the usual procedure.
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...