TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Sunday, 25 August 2019

How to withdraw cash from SBI ATM without using debit card - SBI YONO APP

        The State Bank of India has launched the YONO Cash service for its customers which will allow them to withdraw cash from ATMs without their debit cards. A part of SBI's digital banking platform, You Only Need SBI YONO APP. Such SBI ATMs will be called YONO Cash Point.
         SBI customers can use the YONO app on their smartphones to withdraw cash from SBI ATMs, or YONO Cash Points, without using their debit and credit cards. After installing the YONO app on their phones, SBI account holders will have to set a 6-digit YONO PIN for withdrawing cash.
Once a request for withdrawing cash is placed, a 6-digit code will be sent to the user's phone via SMS, which will then have to be entered into a YONO Cash Point.

ATM: జేబులో ఏటీఎం కార్డు లేదా? అయినా డబ్బులు డ్రా చేయండి ఇలా

SBI YONO CASH | ఏటీఎం కార్డు మర్చిపోయి మార్కెట్‌కు వెళ్లారా? అర్జెంట్‌గా డబ్బులు అవసరమయ్యాయా? కార్డు లేదని డబ్బులు డ్రా చేయలేకపోతున్నారా? ఇకపై ఆ టెన్షన్ అవసరం లేదు. ఏటీఎం కార్డు లేకపోయినా డబ్బులు డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI. కొద్ది రోజుల క్రితం ప్రారంభించిన ఎస్‌బీఐ యోనో క్యాష్‌తో ఇది సాధ్యం. ఎలాగో తెలుసుకోండి.
1. మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమరా? మీ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఉందా? మీరు ఏటీఎం కార్డు మర్చిపోయినా... మీ కార్డు అందుబాటులో లేకపోయినా... ఏటీఎంలో డబ్బులు డ్రా చేయొచ్చు
2. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్‌ ఫీచర్ ఇది. ఇందుకోసం మీకు YONO యాప్ ఉండాలి. ఈ యాప్ ఉంటే దేశంలోని 16,500 ఎస్‌బీఐ ఏటీఎంలల్లో ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా చేయొచ్చు.
3. ఈ సర్వీసు ఉన్న ఏటీఎంలకు 'యోనో క్యాష్ పాయింట్స్' అని నామకరణం చేసింది ఎస్‌బీఐ. కార్డు లేకుండా డబ్బులు డ్రా చేయడం ద్వారా స్కిమ్మింగ్, క్లోనింగ్ లాంటి మోసాలను తగ్గించొచ్చని ఎస్‌బీఐ భావిస్తోంది
4. యోనో యాప్‌లో యోనో క్యాష్ ద్వారా కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్‌ సాధ్యమవుతుంది.2-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది
5. కార్డ్‌లెస్ విత్‌డ్రాయల్ కోసం ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో YONO యాప్ డౌన్‌లోడ్ చేయాలి. ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్లల్లో ఈ యాప్ పనిచేస్తుంది.
6. యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత రిక్వెస్ట్ యోనో క్యాష్ క్లిక్ చేయాలి. అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసి ఎంత నగదు కావాలో ఎంటర్ చేయాలి.
7. ఆరు అంకెల యోనో క్యాష్ పిన్ సెట్ చేసుకోవాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు 6 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎస్ఎంఎస్ వస్తుంది. ఈ రిఫరెన్స్ నెంబర్ 30 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది.
8. మీకు దగ్గర్లో ఉంటే యోనో క్యాష్ పాయింట్‌కు వెళ్లాలి. ముందుగా మీకు ఎస్ఎంఎస్‌లో వచ్చిన 6 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీరు యాప్‌లో ఎంటర్ చేసిన అమౌంట్‌ను ఏటీఎంలో ఎంటర్ చేయాలి.
9. మీరు యాప్‌లో క్రియేట్‌ చేసిన 6 అంకెల యోనో క్యాష్ పిన్‌ను ఎంటర్ చేసి డబ్బులు డ్రా చేసుకోవచ్చు.
Download SBI YONO Cash APP

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...