జులై-20న ప్రభుత్వం FAPTO తో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.చర్చల మినిట్స్ ను FAPTO కు అందజేశారు.
- స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు బడ్జెట్ అంచనా రూ. 669/- కోట్ల వేయగా , ఇది తప్పుడు అంచనా అని నిలదీసి, రమారమి (130 కోట్లు లోపు) బడ్జెట్ ను రూపొందింపచేయునట్లు త్వరలో జీవో వచ్చేలా కృషి,
- సర్వీస్ రూల్స్ సమస్యపై ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి, కోర్టు కేసులను అధికమించి నిలిచిపోయిన అన్ని కేడర్ల పదోన్నతులు ఇవ్వాలన్న దానిపై శీగ్రంగా కోర్టులో ప్రభుత్వ వాదనలు వినిపించి త్వరలో పదోన్నతులు వచ్చే అవకాశం.
- ఖాళీగా ఉన్న Dy.EO & MEO పోస్టులకు ఉన్నత పాఠశాలల సీనియర్ ప్రధానోపాధ్యాయులకే ఇవ్వాలన్న డిమాండ్ పై ఇప్పటికే అమలు చేయడం & ఇంకా కొంత న్యాయపరంగా అధికమించాల్సి ఉంది.
- విశాఖపట్నం కేంద్రంగా మరో RJD పోస్ట్ సృష్టికి మార్గం.
- అంతర్జిల్లా టీచర్ల బదిలీలు ఆలస్యం కాకుండా Fapto సూచనల మేరకు తక్షణ చర్యలకు స్వీకారం.
- పండిట్, పిఈటీ పోస్టులను మిగిలిన 30% కూడా సాంకేతిక సమస్యలేకుండా విడివిడిగా ఫైల్ పంపాలని , డీఈఓ పూల్ లో వున్న పిఈటీ లకు న్యాయం చేయాలని, ఎయిడెడ్ పాఠశాలల్లో కూడా Up-gradation చేయాలని డిమాండ్ పై ప్రభుత్వ కార్యదర్శి తగు చర్య
- ఉన్నత పాఠశాలల HM ల DDO అధికారుల కొనసాగింపు, Dy.EO పోస్టుల్లో ZP Dy EO, RMSA wing include చేయుటకు
- ప్రతి MLA నియోజకవర్గ పరిధిలో ఒక DyEO పోస్ట్ మంజూరుకు చర్యలు
- డియస్సి-18 లో ఖాళీగా వున్న అన్ని కేడర్ల ఖాళీలను పూర్తి చేయాలని, ప్రాధమిక పాఠశాలల్లో కనీసం 2 పోస్టులు, అప్గ్రేడ్ ఐన యూ. పి పాఠశాలలకు, మీడియా పరంగా స్టాఫ్ పాటర్న్ ప్రకారం పోస్టుల భర్తీ, 354 అప్గ్రేడ్ Gr:1 HM ల భర్తీ, పండిట్ & పిఈటీ పోస్టుల 100% ఉన్నతీకరణ పై ప్రభుత్వం ఉన్నతస్థాయిలో ప్రయత్నం.
- విద్యారంగ సమస్యలు పాఠ్యపుస్తకాలు, సమారుప దుస్తులు, సైకిళ్ళు పంపిణీ, DCEB ద్వారా పరీక్షల నిర్వహణ తదితర అనేక సమస్యలపై పురోగతి మినిట్స్ ఉత్తర్వుల్లో చూడవచ్చు.
Download copy