TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Saturday 28 October 2017

School Complex Guidelines and Pathasala Samudaya Karadeepika

 స్కూల్ కాంప్లెక్స్ ఛైర్మన్ కు  సూచనలు
v  అక్టోబర్ నెలలో నిర్వహించవలసిన స్కూల్ కాంప్లెక్స్ ను తప్పనిసరిగా ఈ నెల 31 వ తేదీలోపు  నిర్వహించవలెను.
v  కాంప్లెక్స్ నిర్వహణకు  అవసరమయ్యే  మార్గదర్శకాల కొరకు పాఠశాల  సముదాయ కరదీపికను  ఒక కాపీని డౌన్ లోడ్ చేసుకుని  సదరు కాంప్లెక్స్ ఛైర్మన్ గారు కాంప్లెక్స్ సమావేశమును సమర్ధవంతముగాను  నిర్మాణాత్మకంగాను నిర్వహించవలెను.
v  పాఠశాల సముదాయ కరదీపికలో  సూచించిన టైమ్ టేబుల్ ను తప్పక పాటించవలెను.
v  అక్టోబర్ నెల కాంప్లెక్స్ సమావేశమునందు (లెర్నింగ్ ఔట్ కమ్స్) అభ్యసన ఫలితము మరియు NAS గురించి ఫలప్రదమైన చర్చలు జరుపవలెను.
v  స్కూల్ కాంప్లెక్స్ నిర్వహణ జరిగిన క్రమమును సదరు కాంప్లెక్స్ సి.ఆర్.పిగారు  డాక్యుమెంటేషన్ చేయవలెను.
v  CSE వెబ్ సైట్ నందు స్కూల్ కాంప్లెక్స్ ప్రోగ్రాం ప్రోఫార్మా ను ను పూర్తి చేసి ఫోటోస్ ను కూడా అప్ లోడ్ చేయవలసిన భాద్యత  సి.ఆర్.పి పై కలదు.
స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు  సూచనలు:
v  కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలలన్నింటిని తప్పని సరిగా సందర్శించి ప్రతినెలా వారు సందర్శించిన ప్రోఫార్మా లను, టూర్ డైరీ లను భద్రపరచి ఉంచవలెను.
v  కాంప్లెక్స్ సమావేశము నకు ముందస్తుగానే రిసోర్స్ పర్సన్లను, సబ్జెక్టు నిపుణులను, నమూనా పాఠం చెప్పు ఉపాధ్యాయులకు తగిన సమాచారం తెలిపి వారిని సమావేశమునకు సిద్దపరచవలెను.
v  కాంప్లెక్స్ సమావేశము టైమ్ టేబుల్ లో గల అన్నీ అంశాలకు ప్రాధాన్యత నివ్వవలెను.
v  2017-18 కాంప్లెక్స్ గ్రాంట్  వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలను అనుసరించి ఖర్చుచేసి సంబంధిత యు.సి లు మరియు వొచర్స్ ను  & టూర్ డైరీలను భద్రపరచవలెను.

v  కాంప్లెక్స్ కు హాజరైన ఉపాధ్యాయులకు వర్కింగ్ లంచ్, కన్వేయన్స్, రెసోర్స్ పర్సన్స్ కు గౌరవ భృతి మొదలైన వాటికి ఒక్కొక్క ఉపాధ్యాయునికి రూ.100/- చొప్పున ఖర్చు చేయుటకు గల మార్గదర్శకముల ననుసరించి ఖర్చు చేసి ప్రతి నెలా తమ మండలంలోని అన్నీ కాంప్లెక్స్ లు విధిగా MEO గారికి సమర్పించిన ఎడల  వాటిని MEO గారు సి.ఆర్.పిలు, డి.ఇ.ఓలు, ఎమ్.ఐ.ఎస్, మెస్సెంజర్స్ మొదలైన వారి డ్యూటి సర్టిఫికేట్ లతో పాటుగా   ఎస్.ఎస్.ఏ  కార్యాలయమునకు  సమర్పించవలెను. సదరు బిల్లుల ఆధారంగా కాంప్లెక్స్ ఛైర్మన్  గారి ఖాతా నందు నిధులు జమ చేయుట జరుగును.
Download Complex Manual Telugu
Download Complex Manual Urdu
Click here for MRC and School Complex Grants Guidelines, UCs and Vouchers 

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...